E-Paper
Advertisement

OTT Movie : రచయిత భార్య మిస్సింగ్… వింత శక్తితో పూనకాలు… ‘కాంతారా’ లాంటి సినిమా

OTT Movie : రచయిత భార్య మిస్సింగ్… వింత శక్తితో పూనకాలు… ‘కాంతారా’ లాంటి సినిమా
Advertisement

OTT Movie : కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతారా’ కాన్సెప్ట్ తో ఇది వరకే ఒక మూవీ వచ్చింది. ఇందులో సాయికుమార్ విలన్ గా యాక్టింగ్ ఇరగదీశాడు. క్లైమాక్స్ సీన్ లో అందరికీ గూస్ బంప్స్ కూడా తెప్పించాడు. ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో సస్పెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పటికీ కన్నడ ఇండస్ట్రీలో టాప్ థ్రిల్లర్ జాబితాలో కొనసాగుతోంది. ఈ సినిమా 88వ అకాడమీ అవార్డులకు అర్హత కలిగిన జాబితాలో చోటు దక్కించుకుంది, కానీ అది నామినేషన్ల తుది జాబితాలోకి రాలేదు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2015లో విడుదలైన ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘రంగితరంగ’. శ్రీ దేవి ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై హెచ్‌కె ప్రకాష్ నిర్మించిన ఈ సినిమాకు అనుప్ భండారి తొలిసారిగా రచించి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిరూప్ భండారి, రాధిక చేతన్, అవంతిక శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు, వీరితో పాటు సీనియర్ నటుడు సాయి కుమార్ నటించాడు. ఈ సినిమా 2015 జూలై 3న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2015లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం Sun nxt లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గౌతమ్ అనే ఒక రచయిత బెంగుళూరులో నివసిస్తూ ఉంటాడు. గౌతమ్ తన భార్య ఇందుతో కలిసి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో, ఇందు తన అత్తగారి ఇంటి నుండి వచ్చిన ఒక ఉత్తరం వల్ల కలవరపడుతుంది. ఆమె పుట్టిన ఊరైన కమరొట్టు అనే మారుమూల గ్రామంలోని పూర్వీకుల ఇంట్లో కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతున్నాయని, అక్కడ ఒక మహిళ చనిపోయిందని ఆ ఉత్తరం సారాంశం. దీంతో ఇందు తన భర్త గౌతమ్‌తో కలిసి హుటాహుటిన ఆ ఊరికి బయలుదేరుతుంది. కమరొట్టు గ్రామం చేరుకున్న తర్వాత, గౌతమ్, ఇందు ఆ పాత ఇంట్లో నివసిస్తున్న వ్యక్తుల వింత ప్రవర్తనను గమనిస్తారు.

Read Also : గుడ్డి మొగుడితో కరాటే అమ్మాయి… ఒక్క పంచ్ తో క్రిమినల్స్ కి చుక్కలు… గుండెను పిండేసే ఫ్యామిలీ స్టోరీ

Advertisement

ఆ ఇంట్లో గ్రామంలో ఏదో తెలియని రహస్యం దాగి ఉందని వారికి అనుమానం కలుగుతుంది. అదే సమయంలో, సాండ్ర డీసౌజా అనే ఒక జర్నలిస్ట్ కూడా ఆ గ్రామంలోకి వస్తుంది. ఆమె ఆ ఊరిని, అక్కడి ఆచారాలను డాక్యుమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గ్రామంలోని భయంకరమైన వాతావరణం, కొన్ని అతీత శక్తుల ఉనికి, గౌతమ్ గతంలో జరిగిన ఒక విషాద కథతో ముడిపడి ఉంటాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో గౌతమ్ భార్య ఇందు మిస్సింగ్ అవుతుంది. దీంతో స్టోరీ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. చివరికి గ్రామంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. గౌతమ్ భార్య ఏమవుతుంది ? ఆ ఇంట్లో జరిగే భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుడుకోవాల్సిందే.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×