E-Paper
Advertisement

The Girlfriend OTT: ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

The Girlfriend OTT: ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

The Girlfriend OTT: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది.. ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతా ఆర్ట్స్’ వంటి పెద్ద బ్యానర్లో రూపొందిన సినిమా కావడంతో మొదటి నుంచే అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా కలెక్షన్స్ కూడా బాగానే రావడంతో రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ పడిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.. ఈ మూవీని థియేటర్ల మిస్ అయిన వారిని గుడ్ న్యూస్.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘ది గర్ల్ ఫ్రెండ్’ ఓటీటీ..

రష్మిక అంటే సక్సెస్ సినిమాలకు కేరాఫ్ గా మారింది. ఆమె ఇటీవల నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కొన్ని రోజుల గ్యాప్ లోనే ఈమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. థామా, అలాగే ది గర్ల్ ఫ్రెండ్.. ఈ రెండు కూడా మంచి టాక్ ను అందుకోవడం విశేషం. ఇటీవలే థామా మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో దీక్షీత్ శెట్టి, రోహిణి, రావు రమేశ్ పాత్రలు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ ని మీరు ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి..

Also Read : రామరాజు ఇంట్లో కార్తీక నోములు.. భాగ్యం పై శ్రీవల్లి సీరియస్.. ప్రేమ కాళ్ళు పట్టుకున్న ధీరజ్..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. రష్మిక నటన, మ్యూజిక్‌, స్క్రీన్‌ప్లే అన్నీ కలిసి సినిమాకు బలమైన హైలైట్‌లుగా నిలిచాయి. ఈ మూవీని 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. పాజిటివ్ టాక్ తో బాగానే వసూళ్లను రాబట్టింది. ఇక దీని స్టోరీ విషయానికొస్తే.. భూమా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెకు తల్లి లేదు. చదువుల కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ కు వచ్చి ఒక హాస్టల్ కు వస్తుంది.. విక్రమ్‌తో ఏర్పడిన రిలేషన్ స్నేహం నుంచి ప్రేమగా ఆపై శారీరక సంబంధం వరకు వెళుతుంది. అదే సమయంలో విక్రమ్‌తో ప్రేమలో ఉన్న దుర్గ అనే అమ్మాయి భూమాతో ఫ్రెండ్‌షిప్ చేసి మీ ఇద్దరికీ సెట్ అవ్వదు ఎప్పటికీ కలవలేరు దూరంగా ఉంటే మంచిది అని సలహా ఇస్తుంది. భూమా మానసిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకుంది? విక్రమ్‌తో కలిసి ఉందా లేదా..? అసలు ఇంట్లో ప్రేమ మ్యాటర్ తెలుస్తుందా? ఆ తర్వాత ఎదురు ఏ పరిస్థితిలో ఏంటి అన్నది సినిమా స్టోరీ.. థియేటర్లలో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×