E-Paper
Advertisement

Gurugram Hit And Run: గురుగ్రామ్‌లో హిట్ అండ్ రన్ కేసు.. కారు వేగానికి ఎగిరిపడిన బిజినెస్‌మెన్, సీసీటీవీ ఫుటేజ్‌లో

Gurugram Hit And Run: గురుగ్రామ్‌లో హిట్  అండ్ రన్ కేసు.. కారు వేగానికి ఎగిరిపడిన బిజినెస్‌మెన్, సీసీటీవీ ఫుటేజ్‌లో
Advertisement

Gurugram Hit And Run: హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. బిజినెస్‌మెన్ అమితాబ్ జైన్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఆయన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాల్లోకి ఎగిరి కిందపోయారు. ఆయనపై నుంచి దూసుకెళ్లింది కారు. స్పాట్‌లో ఆయన మృతి చెందారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

గురుగ్రామ్‌లో హిట్ అండ్ రన్ కేసు

Advertisement

సొంత వాహనాలతో రోడ్లపైకి వెళ్లేటప్పుడు జాగ్రత్త అంటూ పదే పదే చెబుతున్నారు పెద్దలు, పోలీసులు. అయినా ఊహించని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్ల మీద వెనుక నుంచి ఎవరు ఢీ కొడతారేమోనన్న భయం పాదచారులతోపాటు సైకిల్ వాళ్లను వెంటాడుతోంది. తాజాగా అలాంటి ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది.

హర్యానాలోని గురుగ్రామ్‌లో డిఎల్‌ఎఫ్ ఫేజ్-II ఏరియాలో ఉంటున్నాడు వ్యాపారవేత్త అమితాబ్ జైన్ ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఆయన వయస్సు 58 ఏళ్లు. జైన్ కొడుకు లండన్‌లో ఉంటున్నాడు. కుమార్తె బెంగళూరులో ఉంటోంది. ఇద్దరు జీవితంలో స్థిరపడిపోయారు. గురువారం ఉదయం అమితాబ్ జైన్ సైకిల్‌పై వెళ్తున్నారు. ఆయన తొలుత స్పీడ్ బ్రేకర్ దాటారు.

Advertisement

కారు వేగానికి ఎగిరి కిందపడిన బిజినెస్‌మెన్

అతడి వెంట వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. ఆయన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆయన గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఆ తర్వాత అతడిపై వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి షాపు లేదా ఇంటికి ముందు సీసీటీవీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. స్పీడ్ బ్రేకర్ ఉన్నా, కారు డ్రైవర్ వేగంగా వచ్చి హిట్ కొట్టినట్టు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.

హిట్ కొట్టిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగివుంది. తెల్లటి హ్యుందాయ్ శాంట్రో కారు అది. ఘటన తర్వాత కారుని డ్రైవర్ వేగంగా నడుపుతూ అక్కడి నుంచి పారిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ ప్రాంతవాసులు జైన్ ఫ్యామిలీకి తెలియడంతో వెంటనే ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే అమితాబ్‌ను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు, స్పాట్‌లో ఐదుగురు మృతి

ఆయన్ని బ్రతికించడానికి వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసిన్పటికీ విఫలమయ్యారు. అయితే కారు యజమానిని గుర్తించామని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. అతడి ఇంటికి పోలీసు టీమ్ వెళ్లింది కానీ, ఆయన అక్కడ లేదు. ఈ ఘటనకు కారణమైన నిందితుడ్ని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×