Illu Illalu Pillalu Today Episode December 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా వల్లికి గట్టిగానే బుద్ధి చెప్తారు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావంటే కచ్చితంగా నీ గురించి అందరికీ చెప్పేస్తాము అని వార్నింగ్ ఇస్తారు.. శ్రీవల్లి మాత్రం నేను ఇకమీదట నుంచి ఎటువంటి తప్పులు చేయను మీకు ఇంకా డైలాగులు చెప్పే అవసరం రానివ్వను అని అంటుంది. నన్ను ఇకమీదట నుంచి కొత్తగా చూస్తారు.. అంటూ శ్రీవల్లి భారీ డైలాగులు వదులుతుంది. ఇకమీదట శ్రీవల్లి 2.0 ని మీరు చూస్తారు అని అంటుంది.. సరే ఇక వెళ్లి నువ్వు నీకు కాపురం ఏంటో నీ పని ఏంటో చూసుకో అనేసి అంటుంది నర్మదా.. కాస్త పక్కకు వెళ్ళగానే శ్రీవల్లి అక్కడున్న బస్తాలని చూసి ప్రేమ నర్మదా నన్నే అంటారా ఒక్కొక్కరు బుడతల్లా ఉన్నారు నా మీదే మీ ప్రతాపం చూపిస్తారా అనేసి వాటి మీద తన ప్రతాపాన్ని చూపిస్తుంది.. ఇంట్లో కార్తీక నోములు కోసం పూజలు జరుగుతాయి. అమూల్య విశ్వం ఇచ్చిన చీరను కట్టుకొని అడ్డంగా దొరికిపోతుంది. మొత్తానికి శ్రీవల్లి కాపాడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లో కార్తీక నోముల కారణంగా పెట్టుకున్న పూజలకు అందరూ కలిసి పూజకు సిద్ధం చేస్తారు. అందంగా ముస్తాబయి దంపతులు పూజలు కూర్చుంటారు. ప్రేమ మాత్రం ధీరజ్ అన్న మాటలు తలుచుకొని దూరంగా వెళ్లిపోతుంది.. వీరిద్దరిని చూసినా నర్మదా ఏదో జరుగుతుందని అనుకుంటుంది. ప్రేమ చీరని పట్టుకుంటాడు. పట్టుకుంది మధ్యలో విడిచి పెట్టడానికి కాదు. తిరుపతి మీరు పూజ ఉన్నామని అనుకుంటున్నారా? మీ రూమ్ లో ఉన్నారని అనుకుంటున్నారా? ఆ రొమాన్స్ ఏంటి రా అనేసి అంటాడు.. ఇంట్లో అందరూ కూడా వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నారు అని అడుగుతారు. మాత్రం వీరిద్దరూ ఏదో చేస్తున్నారు అని అర్థమవుతుంది అంటూ అంటాడు. మీ భర్తల ఆశీర్వాదం తీసుకోండి అని పూజారి అంటాడు..
శ్రీవల్లి భాగ్యం ఇంటికి పోయి గంపలోని ఎండు ఆకులని వాళ్ళ మీద పోస్తూ ఉంటుంది.. ఏంటి అమ్మడు నువ్వు ఇలా మా మీద ఆకులు వేస్తున్నావ్… ఏమైంది చెప్పు అని అడుగుతుంది.. బంగారం ఎక్కడైనా ఆకులు అవుతాయా నువ్వు చూడు అన్నావ్ చూశాను అడ్డంగా దొరికిపోయాను అనేసి శ్రీవల్లి కోప్పడుతుంది.. నాటకాలు ఆడి నా పెళ్లి చేశారు కానీ అది నా మెడ చుట్టుకుంది. ఇక నాకు కాపురం ఎప్పుడో ఒకసారి వాళ్ళ చేతుల్లోంచి జారిపోతుంది అని కంగారుపడుతుంది. నువ్వు ఏమి బాధపడకు నువ్వు ఆల్రెడీ పెట్టాల్సిన పుల్లలన్నీ పెట్టేశావు. నువ్వు పరీక్ష రాశావు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నావు అనేసి భాగ్యం అంటుంది.
ప్రేమ కోసం ధీరజ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ప్రేమ దగ్గరికి ఒక పేపర్ తీసుకొని వచ్చి ఇస్తాడు.. ఏంట్రా ఇది అని ప్రేమ అడుగుతుంది.. ఏముందో చూడవే మళ్లీ అడగడం ఎందుకు అని ధీరజ్ అంటాడు.. నువ్వు ఏమంత చదువుతున్నావని హాల్ టికెట్ తీసుకొచ్చావు అని ప్రేమ అడుగుతుంది. అక్కడ పేరు చదవవే ముందు తింగరబుచ్చి అని ధీరజ్ అంటాడు.. ఎస్సై పోస్ట్ కోసం ప్రేమ కోసం అప్లై చేసి హాల్ టికెట్ ని తీసుకొస్తాడు ధీరజ్ అది చూసి ప్రేమ సంతోషంతో పొంగిపోతుంది..
నేను అప్లై చేయలేదు కదరా ఇది ఎలా వచ్చింది అంటే అన్నీ నీకు చెప్పే చేస్తున్నానా? అలానే నీకు చెప్పకుండా చేశాను అని ధీరజ్ అంటాడు.. ఎగ్జామ్ వచ్చే నెల హైదరాబాద్ లో ఉంటుంది. ఇంట్లో ఎగ్జామ్ ఏ వద్దని అన్నారు అలాంటిది హైదరాబాద్ కి ఏమని చెప్పి తీసుకొని వెళ్తావు అని ప్రేమ ధీరజ్ ని అడుగుతుంది.. చెప్పకుండా తీసుకుని వెళ్తాను ఇప్పుడేంటి నీకు నష్టం అనేసి ధీరజ్ అంటాడు.. అలా చేస్తే ఇంకాస్త గొడవలు అవుతాయి కదరా ఎందుకురా అలా చేయడం అని ప్రేమ అంటుంది… మా నాన్న అసలు నీ చేత జాబ్ చేయించొద్దు అని అన్నాడు.. కానీ నేను చేయిస్తాను అని అన్నాను అందుకే అని ధీరజ్ అంటాడు..
సాగర్ ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఒక కన్సల్టెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు.. అతను నువ్వు ఆల్రెడీ వీఆర్వో పోస్ట్ కి అప్లై చేశావు కనీసం ఆ పోస్ట్ కి దరిదాపుల్లో కూడా నీ మార్కులు రాలేదు.. గవర్నమెంట్ ఉద్యోగం చేయడం చాలా కష్టం అని అతను అంటాడు.. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం సార్. ఏం చేయాలో చెప్పండి అని సాగర్ బ్రతిమలాడుతాడు.. కానీ అతను నువ్వు ఆల్రెడీ అప్లై చేశావు కాబట్టి ఇక మీదట నువ్వు గవర్నమెంట్ జాబు చేయడం సాధ్యం కాదు అని తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే సాగర్ బాధపడుతూ బయటికి వస్తాడు. అక్కడ ఉన్న నర్మదను చూసి షాక్ అవుతాడు..
ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు.. ఆ మాట నేను అడగాలి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఇది కన్సల్టెన్సీ ఆఫీస్ కదా మరి ఇక్కడకు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.. ఊరికే ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంటే కలవడానికి వచ్చాను అని అంటాడు. ఇంటికే కదా వెళ్తున్నావ్ పదా వెళ్దామని నర్మదా అంటుంది. నర్మదకు ఎక్కడో అనుమానం ఉంటుంది.. ఇప్పుడు మనిద్దరం బండి మీద వెళ్తున్న సరే నువ్వు గలగల మాట్లాడేసి నా తల తింటావు. కానీ ఇప్పుడేంటి మౌనంగా ఉన్నావు అని అడుగుతుంది.. సాగర్ మాత్రం అదేమీ లేదు అని అంటాడు..
అందరూ రాత్రి భోజనానికి కూర్చుంటారు.. ప్రేమ నర్మద ఇద్దరు కూడా శ్రీవల్లిని అడ్డంగా ఇరికించాలి అని అనుకుంటారు.. ప్రేమ అక్క నువ్వు ఎం ఏ ఇంగ్లీష్ చదివావు కదా అనేసి అడుగుతుంది. అవును చెల్లాయి నేను బీభత్సంగా ఏంఎ ఇంగ్లీష్ చదివేశాను.. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని శ్రీవల్లి అడుగుతుంది. అదేం లేదు నువ్వు ఉద్యోగం చేయాలని ఎప్పుడు అనుకోలేదా..? నాకేమో గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని ఉంటుంది ప్రేమకేమో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉంటుంది అలా నీకు ఎప్పుడు ఉద్యోగం చేయాలని అనిపించలేదా అని నర్మదా అడుగుతుంది.
Also Read : పల్లవి మాయలో పడిన కమల్.. ఫ్రెండ్స్ తో శ్రీకర్ పార్టీ.. అవని సీరియస్ వార్నింగ్..
అయినా వీరిద్దరి ఏంటి నా మీద పడ్డారు ఏదో జరుగుతుందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.. నేను ఇప్పుడు అత్తయ్య గారి స్థానంలో ఉన్నాను.. మొన్నటివరకు అత్తయ్య గారు వంటగదికి మహారాణి.. ఇప్పుడు ఆవిడ తర్వాత నేనే మహారాణిని కదా అని అంటుంది.. నేను లేకపోతే అత్తయ్య ఒక్క పని కూడా చేసుకోలేదు అని శ్రీవల్లి అంటుంది.. సూపర్ అమ్మ నువ్వు? మీ అత్తయ్య వంట ఎన్ని రోజులు తిని తిని నాకు బోర్ కొట్టేసింది నువ్వు ఆ పని తీసుకో అనేసి అంటాడు రామరాజు.. అంటే నువ్వు లేకుండా అత్తయ్య వంట చేయలేదా? అని ప్రేమా నర్మద ఇద్దరు కూడా శ్రీవల్లిని వేదవతి దగ్గర ఇరికిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి గురించి బండారం బయటపడుతుందేమో చూడాలి..