E-Paper
Advertisement

OTT Movie : రష్మిక మందన్న హర్రర్ థ్రిల్లర్ ‘థామా’ను ఓటీటీలో ఫ్రీగా చూడవచ్చు… ఎక్కడంటే ?

OTT Movie : రష్మిక మందన్న హర్రర్ థ్రిల్లర్ ‘థామా’ను ఓటీటీలో ఫ్రీగా చూడవచ్చు… ఎక్కడంటే ?
Advertisement

OTT Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె నటించిన లేటెస్ట్ హర్రర్ మూవీ ‘ థామా’ను ఇప్పుడు ఓటీటీలో ఫ్రీగా చూడవచ్చు. పై తెలుగులోనూ చూడవచ్చు. మరి ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ విషయంలో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

ఫ్రీ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU) నుండి వచ్చిన తాజా చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్-కామెడీ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి సచిన్-జిగర్ సంగీతం అందించారు. మలైకా అరోరా, నోరా ఫతేహి, వరుణ్ ధావన్ అతిధి పాత్రల్లో నటించారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ దీపావళి సీజన్‌లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఫ్రాంచైజీకి అనుకూలంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది. సగటు వసూళ్లతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు.

Advertisement

అయితే రెండు వారాల క్రితం రెంట్ బేసిస్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది మూవీ. ఇప్పుడు ఇదే మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ తమ సబ్‌స్క్రైబర్‌లకు ఉచితంగా చూసే అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. అంటే ఇదివరకులా రెంట్ పే చేసే పని లేకుండానే ప్రైమ్ మెంబర్స్ ఈ మూవీని ఫ్రీగా చూడవచ్చు. ఇక మరో గుడ్ న్యూ ఏంటంటే ఈ సినిమా ఇంగ్లీష్ సబ్‌టైటిళ్లతో పాటు హిందీ, తెలుగు ఆడియోలలో అందుబాటులో ఉంది.

Read Also : ఆడినోళ్లకు ఆడినంత… బెట్టింగ్ ఉచ్చులో మిడిల్ క్లాస్ అబ్బాయి… ఓటీటీలో అదరగొడుతున్న కన్నడ యాక్షన్ మూవీ

కథలోకి వెళ్తే…

Advertisement

అలోక్‌ గోయల్‌ అనే జర్నలిస్ట్‌ ఓ రోజు తన మిత్రులతో కలిసి ఓ పర్వత ప్రాంతానికి న్యూస్‌ కవరేజ్‌ కోసం వెళ్తాడు. ఓ ఎలుగుబంటి అతనిపై దాడికి పాల్పడుతుంది. అంతలోనే తడ్కా అనే బేతాళ జాతికి చెందిన యువతి వచ్చి అతడిని కాపాడుతుంది. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న ఈ జాతి వాళ్ళకు అతీత శక్తులు ఉంటాయి. వీళ్ళ నాయకుడు థామా అనే యక్షాసన్‌. ఓ కారణంతో అతడిని దశాబ్దాలుగా ఓ గుహలో బందిస్తారు. తమ సామ్రాజ్యంలోకి వచ్చిన అలోక్‌ ను కూడా శిక్షించాలని అనుకుంటారు. కానీ తడ్కా అతడిని కాపాడుతుంది. పైగా అతడిని ప్రేమించిన ఆ అమ్మాయి ఏకంగా తన జాతిని వదిలేసి, సమాజంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది ? అన్నది స్టోరీ.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×