E-Paper
Advertisement

IND VS SA 4th T20I: టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా 4వ టీ20 ర‌ద్దు

IND VS SA 4th T20I:  టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా 4వ టీ20 ర‌ద్దు

IND VS SA 4th T20I: క్రికెట్ ఫ్యాన్స్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా 4వ టీ20 మ్యాచ్ ర‌ద్దు అయింది. ల‌క్నో వేదిక‌గా పొగ మంచు విప‌రీతంగా ఉన్న నేప‌థ్యంలో టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా 4వ టీ20 మ్యాచ్ ర‌ద్దు చేశారు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకన క్రికెట్ స్టేడియం ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow )  వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ లక్నో లో AQI పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందట. ఈ AQI ఏకంగా 391 పాయింట్లుగా రికార్డు అయినట్లు గుర్తించారు. అయినప్పటికీ మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు చాలా ప్రయత్నించారు.

Also Read: IPL Auction 2026: మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయ‌ర్లు వీళ్లే

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా 4వ టీ20 ర‌ద్దు

చాలా సార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు, ప్లేయర్ల సేఫ్టీ కోసం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ మ్యాచ్ నిర్వహించలేమని, అది సాధ్యమయ్యే పని కాదని వెల్లడించారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన నాలుగవ టి20ని రద్దు చేశారు. కాగా ఇప్పటికే జరిగిన మూడు టి20 లలో 2-1 తేడాతో టీమిండియా ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అంటే ఐదవ టి20 ఈ రెండు జట్లకు చాలా కీలకము కానుంది. ఈనెల 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐదవ టి20 జరగనుంది. ఇందులో టీమిండియా విజయం సాధిస్తే టైటిల్ గెలవనుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే టి20 సిరీస్ డ్రాగ ముగుస్తుంది.

టీమిండియా కు బిగ్ షాక్.. గిల్ కు గాయం

టీమిడియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4వ టి20 జరగాల్సి ఉండగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందే టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ కు తీవ్ర గాయమైందని తెలుస్తోంది. అతని పాదానికి ప్రాక్టీస్ చేసే సమయంలో గాయమైనట్లు టీమిండియా యాజమాన్యం వెల్లడించింది. దీంతో నాలుగోవ టి20కి అతన్ని దూరం పెడుతున్నట్లు వెల్లడించింది టీమిండియా యాజమాన్యం. కానీ అంతలోనే ఈ మ్యాచ్ రద్దు కావడంతో గిల్ కు కాస్త రిలీఫ్ దక్కింది. ఇక ఈనెల 19వ తేదీ వరకు అతడు కోలుకుంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే టి20లో గిల్ ఆడుతాడు. లేకపోతే అతని స్థానంలో సంజు శాంసన్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ కు తీవ్ర గాయమైందని వార్త రావ‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. గిల్ ఆడినా పెద్ద‌గా ఒరిగిందేమీ ఉండ‌ద‌ని, అట్ట‌ర్ ఫ్లాప్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సంజును గిల్ స్థానంలో తీసుకోవాల‌ని కోరుతున్నారు.

 

Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×