E-Paper
Advertisement

BMW OTT: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

BMW OTT: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

BMW OTT: రవితేజ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha mahasayulaku wignya pathi). సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 13వ తేదీ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన పర్వాలేదు అనిపించుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ డింపుల్ హైయతి, ఆశికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు రెండు నెలలు అవుతున్న ఇప్పటివరకు డిజిటల్ స్ట్రీమింగ్ కు మాత్రం అందుబాటులోకి రాలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటిటిలో ప్రసారం అవ్వడమే కాకుండా టెలివిజన్ ప్రీమియర్ కూడా అయ్యాయి.

ఓటీటీ విడుదలకు సిద్ధమైన రవితేజ సినిమా ..

ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బరిలో దిగిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇంకా ఓటీటీలోకి రాకపోవడంతో అభిమానులు కూడా ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా కొన్ని సాంకేతిక కారణాలవల్లే డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మార్చి 13వ తేదీ ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

నిరాశపరిచిన భర్త మహాశయులకు విజ్ఞప్తి..

Advertisement

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న ఇప్పటివరకు జీ స్టూడియోస్ నుంచి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, చెరుకూరి సుధాకర్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాపై రవితేజ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయాయి. ఇటీవల కాలంలో రవితేజ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.

రవితేజ ఇరుముడి..

Advertisement

ధమాకా సినిమా తర్వాత రవితేజ సుమారు అరడజనుకు పైగా సినిమాలను విడుదల చేశారు కానీ ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేదు. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా నిరాశపరచడంతో ప్రస్తుతం రవితేజ అభిమానులు అందరూ కూడా ఇరుముడి సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మజలి ఫేమ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియ భవాని శంకర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read: Allu Sirish wedding: పెళ్లి కొడుకైన అల్లు శిరీష్… వైరల్ అవుతున్న ఫోటోలు !

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×