E-Paper
Advertisement

Operation Epic Fury: ఒక్క‌ దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను మ‌ట్టుబెట్టాం.. ట్రంప్ కీల‌క‌ ప్రకటన

Operation Epic Fury: ఒక్క‌ దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను మ‌ట్టుబెట్టాం.. ట్రంప్ కీల‌క‌ ప్రకటన
Advertisement

Operation Epic Fury: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు పెను ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలు.. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడుల నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడిగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆ దేశం అతలాకుతలం కాగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

అమెరికా-ఇజ్రాయెల్ సైన్యం సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక్క భారీ దాడుల పరంపరతోనే ఇరాన్‌కు చెందిన 48 మంది అగ్రశ్రేణి నాయకులను అంతమొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. “మేం ఊహించిన దానికంటే అత్యంత వేగంగా.. ఖచ్చితత్వంతో ఈ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. శత్రువు తేరుకోకముందే వారి వ్యూహకర్తలను మట్టుబెట్టాం” అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

ఈ దాడుల వల్ల ఇరాన్ నాయకత్వ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అత్యున్నత స్థాయి కమాండర్లు.. వ్యూహకర్తలు మరణించడంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేసే శక్తిని కోల్పోయిందని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇరాన్ తన క్షిపణి దాడుల ద్వారా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నప్పటికీ.. ట్రంప్ ప్రకటనతో టెహ్రాన్ వెన్నులో వణుకు మొదలైంది. పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపన కోసం ఈ స్థాయి కఠిన నిర్ణయాలు తప్పలేదని అమెరికా సమర్థించుకుంటోంది.

అయితే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. అమెరికాకు చెందిన అత్యంత అధునాతన MQ-9 రీపర్ డ్రోన్‌ను తమ క్షిపణి వ్యవస్థతో కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించి.. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇరాన్ జరిపిన ఈ ప్రతీకార దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. హార్ముజ్ జలసంధిలో ఒక ఆయిల్ ట్యాంకర్‌పై కూడా ఇరాన్ దాడికి తెగబడింది. ప్రతిచర్యగా ఇజ్రాయెల్.. అమెరికా దళాలు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులను ముమ్మరం చేశాయి. ఇరు పక్షాల మధ్య దాడులు.. ప్రతిదాడులతో ఈ ప్రాంతం మృత్యుకూపంగా మారుతోంది.

Advertisement

Related News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

Big Stories

Advertisement
×