E-Paper
Advertisement

Suspense Thriller OTT : వింతైన విమాన ప్రమాదం… అగ్రరాజ్యం రాజకీయాలను కదిలించే మర్డర్ మిస్టరీ… ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్

Suspense Thriller OTT : వింతైన విమాన ప్రమాదం… అగ్రరాజ్యం రాజకీయాలను కదిలించే మర్డర్ మిస్టరీ… ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

Suspense Thriller OTT : బ్రిటిష్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘రెడ్ ఐ’ (Red Eye) సీజన్ 2 ఓటీటీలో అదరగొడుతోంది. లండన్‌లోని అమెరికన్ ఎంబసీలో జరిగిన హత్య, విమాన ప్రమాదం చుట్టూ ఈ సీజన్ సాగుతుంది. 2024 లో వచ్చిన మొదటి సీజన్ కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు 2026 లో వచ్చిన సీజన్ 2 కూడా యాక్షన్ సీన్స్ తో దుమ్ము లేపుతోంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘రెడ్ ఐ (Red Eye) సీజన్ 2’ 2026 ఫిబ్రవరి 15 నుంచి Sony LIV ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జింగ్ లూసీ (హనా లీ), మార్టిన్ కాంప్‌స్టన్ (క్లే బ్రాడీ), లెస్లీ షార్ప్ (మాడెలిన్ డిలేనీ), జెమ్మా మూర్ (జెస్ లీ) ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి సీజన్‌లో హీరోగా నటించిన రిచర్డ్ ఆర్మిటేజ్ (డా. మాథ్యూ నోలన్) ఈ సీజన్‌లో అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తారు. ఈ సీజన్‌ మొత్తం 6 ఎపిసోడ్‌లతో నడుస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ లండన్‌లోని అమెరికన్ ఎంబసీలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ హత్యతో మొదలవుతుంది. డిటెక్టివ్ హనా లీ (జింగ్ లూసీ) ఈ కేసును దర్యాప్తు చేయడానికి అక్కడికి వెళ్తుంది. అయితే అదే సమయంలో అమెరికా నుంచి వస్తున్న ఒక విమానంలో బాంబు ఉందని, ఎంబసీ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే ఆ విమానాన్ని పేల్చేస్తామని ఒక ఆగంతకుడు బెదిరిస్తాడు. దీంతో ఎంబసీ మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్తుంది. హనా లీ ఎంబసీ సెక్యూరిటీ హెడ్ అయిన క్లే బ్రాడీతో కలిసి, లోపల దాక్కున్న హంతకుడిని పట్టుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తుంది.

మరోవైపు గాలిలో ఉన్న విమానంలో MI5 చీఫ్ మాడెలిన్ డిలేనీ, అమెరికా రక్షణ మంత్రి చిక్కుకుంటారు. విమానం భూమికి 20,000 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు వెళ్తే బాంబు పేలిపోయేలా సెట్ చేసి ఉంటుంది. చివరికి ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ద్రోహి ఎవరు ? రష్యా ప్రమేయం ఎంతవరకు ఉంది ? హనా లీ హంతకుడిని ఎలా అడ్డుకుంది ? విమానంలో ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సీజన్ సాగుతుంది.

Advertisement

Read Also : క్రైమ్ నుంచి సైన్స్ ఫిక్షన్‌ సినిమాల వరకు… నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ వెబ్ సిరీస్‌ల లిస్ట్

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×