E-Paper
Advertisement

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?
Advertisement

BJP Padayatras: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో బీజేపీ యాత్రల రాజకీయాలకు తెరతీస్తోంది. ప్రజా సమస్యలను ఎజెండాగా చేసుకుని క్షేత్రస్థాయిలోకి వెళ్లడంతోపాటు, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు పార్టీ నేతలు పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తమదైన అంశాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తుండగా.. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ రైతుల సమస్యలపై యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నారు. జవహర్‌నగర్‌ డంప్‌యార్డు తరలింపు, రైతుల ఇబ్బందులు, కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు.. ఇలా వేర్వేరు అంశాలను కేంద్రంగా చేసుకుని పార్టీ ఉద్యమాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 27న ఈటల పాదయాత్ర, నవంబర్‌ 1న రాంచందర్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహణకు సంబంధించిన ప్రకటనలు వెలువడటంతో రాష్ట్ర రాజకీయాల్లో యాత్రల అంశం చర్చనీయాంశంగా మారింది.

డంపింగ్‌ యార్డు..

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలనే డిమాండ్‌తో ఈటల రాజేందర్‌ ఈనెల 27న పాదయాత్ర చేపట్టనున్నారు. డంప్‌యార్డు కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న దుర్వాసన, కాలుష్యం, ఆరోగ్య సమస్యలను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని కేవలం రాజకీయ నిరసనకే పరిమితం చేయకుండా బాధితుల అభిప్రాయాలు, పర్యావరణ అంశాలు, వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి విషయాలను కూడా చర్చలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈటల పాదయాత్రకు పార్టీ రాష్ట్ర నాయకత్వం మద్దతు ప్రకటించింది. స్థానిక ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో పాదయాత్ర..

Advertisement

మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించారు. నవంబర్‌ 1న ‘లోక్‌తంత్ర బచావ్‌-అరాచకత హటావ్‌’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కాక్రోచ్ లు చేపడుతున్న ఆందోళనలను తిప్పికొట్టేలా ఈ యాత్ర కొనసాగనుందని చెబుతున్నారు. కాగా ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులను సమీకరించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దాదాపు 70 వేల మందిని జన సమీకరణ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నేతలకు టార్గెట్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించడంతోపాటు, ప్రజాస్వామ్యం, ఓటర్ల జాబితాల ప్రక్షాళన వంటి అంశాలపై తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని యోచిస్తోంది.

Also read: సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు

ఆదిలాబాద్‌ నుంచి అసెంబ్లీకి రైతు యాత్ర

Advertisement

రైతుల సమస్యలను కేంద్రంగా చేసుకుని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కూడా యాత్ర చేపట్టే అంశాన్ని ప్రతిపాదించారు. ఆదిలాబాద్‌ నుంచి అసెంబ్లీ వరకు రైతు యాత్ర నిర్వహించి, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నది ఈ ప్రతిపాదనలోని ప్రధాన ఉద్దేశం. పంటల బీమా, సాగునీరు, పంట నష్టాలు, రైతులకు అందాల్సిన ప్రభుత్వ సహాయం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా ఈ యాత్ర తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటికే పలు కారణాల వల్ల మూడుసార్లు వాయిదా పడింది. కాగా దీపావళి తర్వాత రైతు యాత్ర చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఈ యాత్ర దాదాపు వారం నుంచి 10 రోజుల వరకు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.

పార్టీలో కొత్త జోష్..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు, వాటి అమలు, రైతులకు అందుతున్న సహాయం వంటి అంశాలపై బీజేపీ నేతలు తరచూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలకు కూడా ప్రజల్లోనే సమాధానం చెప్పాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలు, మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా పాదయాత్రలు, నిరసనల ద్వారా ప్రజలను నేరుగా కలవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకే సమయంలో వేర్వేరు నేతలు వేర్వేరు అంశాలపై యాత్రలు చేపట్టాలనుకోవడం వల్ల నిత్యం ప్రజల్లో ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ యాత్రల ద్వారా స్థానిక సమస్యలను గుర్తించడం, ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలను క్షేత్రస్థాయిలో సమీకరించడం వల్ల యాక్టివిటీ పెరుగుతుందని, ఇన్నిరోజులు స్తబ్దుగా ఉన్న పార్టీలో కొత్త జోష్ నింపినట్లవుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చేపట్టనున్న యాత్రలు పార్టీ రాజకీయ కార్యాచరణకు కొత్త దిశను ఇస్తాయా? ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పరిష్​కారం చూపుతాయా? అనేది చూడాలి.

Also read: ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే

Tags

Related News

2016 ఒప్పందంలో బిగ్ మిస్టెక్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ అసలు రూట్ మ్యాప్ ఇదే?

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కేటీఆర్ సంచలన ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

కూటమిలో కుమ్ములాట.. బరిలోకి దిగేదెవరు? ఇంకా క్లారిటీ ఇవ్వని పెద్దలు!

స్వేచ్ఛ చెప్పిందే నిజమైందా.. హెచ్‌సీఏ కుంభకోణంలో షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×