E-Paper
Advertisement

Malayalam OTT Releases : ఓటీటీలోకి రానున్న ఫిబ్రవరి మోస్ట్ అవైటింగ్ మలయాళం మూవీస్… ఏ మూవీ ఏ ఓటీటీలో ?

Malayalam OTT Releases : ఓటీటీలోకి రానున్న ఫిబ్రవరి మోస్ట్ అవైటింగ్ మలయాళం మూవీస్… ఏ మూవీ ఏ ఓటీటీలో ?
Advertisement

Malayalam OTT Releases : మలయాళం సినిమాలకి ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో, డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్నాయి. ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం కలాంకావల్, జనవరి 15 SonyLiv లో డిజిటల్‌గా విడుదలైనప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చత్తా పచా’, నివిన్ పౌలీ ‘బేబీ గర్ల్’ ఈ వారం చివర్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక నివిన్ పౌలీ ‘సర్వం మాయ’, ‘విలాయత్ బుద్ధ’, నిఖిలా విమల్ ‘పెన్ను కేస్’ వంటి మలయాళ సినిమాలు ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం పదండి.

‘సర్వం మాయ’

మలయాళ నటుడు నివిన్ పౌలీ ఈ ఫీల్-గుడ్ ఎంటర్టైనర్ సినిమా ‘సర్వం మాయ’ తో 100 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లాడు. ఈ మలయాళ భాషా సూపర్ నేచురల్ కామెడీ చిత్రంకి అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఫైర్‌ఫ్లై ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో రియా శిబు టైటిల్ రోల్‌లో నటించగా, నివిన్ పౌలీ, అజు వర్గీస్, జనార్ధనన్, ప్రీతి ముఖుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సర్వం మాయ’ JioHotstarలో వచ్చే నెల స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

‘పెన్ను కేసు’

Advertisement

మలయాళ నటి నిఖిలా విమల్ నటించిన పెన్ను కేస్ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో నిఖిలా విమల్ పెళ్ళిళ్ళు చేసుకుని పురుషులను మోసం చేసే పాత్రను పోషించింది. ఆమెతో పాటు అజు వర్గీస్, ఇర్షాద్, రెంజి కంకోల్, రమేష్ పిషారోడి, పిపి కున్హికృష్ణన్, హక్కిమ్ షాజహాన్ వంటి నటులు కూడా ఉన్నారు. దర్శకుడు ఫెబిన్ సిద్ధార్థ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఈ నెల 16 నుంచి ఇంకా థియేట్రికల్ రన్ లో ఉంది. వచ్చే నెల డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.

‘విలాయత్ బుద్ధ’

ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గంధపు చెక్క స్మగ్లర్ మోహనన్ పాత్రను పోషించాడు. ఈ పాత్రను అతను ‘ పుష్ప’ సినిమాతో పోల్చడం కూడా జరిగింది. సీనియర్ నటుడు షమ్మీ తిలకన్ ఈ చిత్రంలో భాస్కరన్ మాస్టర్ పాత్రను పోషించాడు. దర్శకుడు జయన్ నంబియార్ ఈ సినిమాని రచయిత జి. ఇందుగోపన్ అదే పేరుతో రాసిన నవల ఆధారంగా రూపొందించారు.ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయింది. అయితే ఓటీటీలోకి ఎప్పుడు వచ్చేది ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే తెలుస్తుంది.

‘హాల్’

Advertisement

ఒక ప్రేమకథ చుట్టూ తిరిగే ఈ మూవీలో షేన్ నిగమ్ హీరో గా నటించారు. సర్వం మాయతో పాటు క్రిస్మస్ కానుకాగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి వీర దర్శకత్వం వహించారు. ‘సర్వం మాయ’ అద్భుతమైన విజయాన్ని సాధించినప్పటికీ, పండుగ రోజున విడుదలైన హాల్ పెద్దగా విజయం సాధించలేకపోయింది. సీనియర్ నటులు జానీ ఆంటోనీ, మధుపాల్, సంగీతా మాధవన్ నాయర్ కూడా నటించిన ఈ చిత్రంలో నటి సాక్షి వైద్య కథానాయికగా నటించారు. ఈ సినిమా కూడా వచ్చే నెల ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

‘పాతిరాత్రి’

2000ల నాటి మలయాళ ప్రముఖ నటి నవ్య నాయర్ ఈ పోలీస్ డ్రామాలో ఖాకీ పాత్రను పోషించారు. నటుడు సౌబిన్ షాహిర్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఆయన కూడా పోలీస్ పాత్రలో ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో జరిగే ఒక సంఘటన చుట్టూ కథ తిరుగుతుంది. దర్శకురాలు రతీనా పిటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. మనోరమ మ్యాక్స్ లో ఈ సినిమా తొందరలో వచ్చే అవకాశం ఉంది.

Read Also : 30 గంటలు సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా… అడుగడుగునా ట్విస్టులు… ఊహించని మలుపులు

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×