E-Paper
Advertisement

అసహ్యకరమైన పురుగులు, వింతైన దెయ్యాలు… ప్రియురాలి కోసం ఇదేం పిచ్చి పని

అసహ్యకరమైన పురుగులు, వింతైన దెయ్యాలు… ప్రియురాలి కోసం ఇదేం పిచ్చి పని
Advertisement

Psychological Horror Thriller : 2026లో వచ్చిన సూపర్ డార్క్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘Return to Silent Hill’ . ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ Christophe Gans తీశాడు. ప్రధాన పాత్రల్లో Jeremy Irvine జేమ్స్ సండర్‌ల్యాండ్‌గా, Hannah Emily Anderson మేరీ పాత్రల్లో నటించారు. ఈ సినిమా Silent Hill 2 గేమ్‌ను ఆధారం చేసుకుని తీసిన సూపర్ హైలీ ఎక్స్‌పెక్టెడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. డైరెక్టర్ 2006లోనే Silent Hill మూవీని తీశారు. ఇప్పుడు ఆయనే ‘రిటర్న్ టు సైలెంట్ హిల్’ అనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ సినిమా JioHotstarలో ఇప్పుడు అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

జేమ్స్ సండర్‌ల్యాండ్ అనే యువకుడు (జెరెమీ ఇర్విన్) ఇందులో హీరో. ఇతను ఆర్టిస్ట్, పెయింటింగ్స్ చేసి జీవితం గడుపుతాడు. కానీ అతని ప్రేయసి మేరీ క్రేన్ (హానా ఎమిలీ ఆండర్సన్)ని కోల్పోతాడు. ఆమె ఇక లేదని జేమ్స్ బాధపడుతూ, ఒంటరిగా బతుకుతుంటాడు. అయితే ఓ మిస్టీరియస్ లెటర్ ను చూశాక అతనిలో గర్ల్ ఫ్రెండ్ బతికే ఉందన్న ఆశ చిగురిస్తుంది. ఒక రోజు జేమ్స్‌కు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ మేరీ రాసినట్టు ఉంటుడి. “నన్ను కలవడానికి Silent Hillకి రా” అని ఆ లెటర్ లో ఆమె ఆమె అడుగుతుంది. జేమ్స్ షాక్ అవుతాడు. ఎందుకంటే మేరీ చనిపోయిందని లేదా దూరమైందని అతను ఇన్ని రోజులు నమ్మాడు. అయినా ఆమెను తిరిగి చూడాలనే ఆశతో, ఒక్కసారి సైలెంట్ హిల్ అనే ఆ చిన్న పట్టణానికి వెళ్తాడు.

Advertisement

అక్కడికి వెళ్లేసరికి జేమ్స్ కళ్లు చెదిరిపోతాయి. ఒకప్పుడు సుందరమైన, ప్రశాంతంగా ఉండే పట్టణం సైలెంట్ హిల్ ఇప్పుడు భయంకరమైన హెల్‌లాగా మారిపోయి ఉంది. చుట్టూ దట్టమైన పొగమంచు, బూడిద వర్షం పడుతుంది. వీధులు ఖాళీగా ఉండి, గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. రాత్రి అయ్యాక భయంకరమైన మాన్స్టర్స్ బయటకు వస్తాయి.

ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో జేమ్స్ మేరీని వెతుక్కుంటూ పట్టణంలో తిరుగుతాడు. అక్కడ అతనికి పిరమిడ్ హెడ్, నర్స్ మాన్స్టర్స్, ఇంకా కొత్త భయంకర జీవులు ఎదురవుతాయి. తరువాత ఏం జరుగుతుంది ? జేమ్స్ తన గర్ల్ ఫ్రెండ్ ను కనిపెట్టాడా ? ఆ లెటర్ రాసింది ఎవరు ? ఆ సిటీ నుంచి హీరో బతికి బయట పడ్డాడా ? అన్నది స్టోరీ.

Advertisement

Read Also : పోలీసుల కళ్లుగప్పి వరుస హత్యలు చేసే సీరియల్ కిల్లర్… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×