E-Paper
Advertisement

ఏం సినిమా గురూ… అమ్మాయిలు పాలించే రాజ్యంలోకి అడుగు పెడితే… ఆ పని కూడా వాళ్ళే

ఏం సినిమా గురూ… అమ్మాయిలు పాలించే రాజ్యంలోకి అడుగు పెడితే… ఆ పని కూడా వాళ్ళే
Advertisement

Romantic comedy : అబ్బాయిలు చేసే పనులన్నీ అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుంది ? ఇలాంటి స్టోరీ లైన్ వినగానే గుర్తొచ్చే మూవీ ‘జంబలకిడిపంబ’. కానీ ఆ మూవీ వచ్చి చాలా కాలమే అవుతోంది. మరీ ఆ మూవీలా కాకుండా నేటి యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా రూపొందిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. అందులోనూ ఈ సినిమా పెద్దలకు మాత్రమే. మరి ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

డేమియన్ సాక్స్ (సాచా బారన్ కోహెన్) ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో హై పొజిషన్‌లో ఉన్న, అహంకారి, మహిళలను వస్తువుల్లా చూసే, లేడీస్ మ్యాన్. అతనికి డబ్బు, పవర్, పార్టీలు, క్యాజువల్ ఫ్లింగ్స్ అన్నీ ఉంటాయి. తన లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తాడు. అలెక్స్ ఫాక్స్ (రోజమండ్ పైక్) అదే ఆఫీసులో పని చేసే తెలివైన, అణచివేయబడిన ఫీమేల్ క్రియేటివ్ డైరెక్టర్.

Advertisement

డేమియన్ తన ఏజెన్సీలో CEO పొజిషన్‌కు దగ్గరగా ఉన్నాడు. ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్‌లో అతను మహిళలను టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది. కానీ అతని మగ అహంకారం వల్ల అతను ఒక పెద్ద అబద్ధం చెప్పి, అలెక్స్‌ను ప్రమోట్ చేస్తాడు. అయితే అది ఆమెను గౌరవించడం కోసం కాదు, తన లాభం కోసం మాత్రమే. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. డేమియన్ తలకు గాయం అవుతుంది. కళ్లు తెరిచేసరికి అతను ఒక పూర్తి వేరే ప్రపంచంలో మేల్కొంటాడు.

ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే ఇది మాట్రియార్కల్ సొసైటీ. అంటే మహిళలే పవర్‌ లో ఉంటారు. మగవాళ్లను అణచివేస్తారు. ఆఫీసులు, సొసైటీ, రూల్స్ అన్నీ మహిళల చేతుల్లో ఉంటాయి. డేమియన్ ఇప్పుడు తన పాత లోకంలో అలెక్స్ ఎదుర్కొన్న అన్ని సమస్యలను ఎదుర్కొంటాడు. అతనికి ఇప్పుడు ఎవరూ గౌరవం ఇవ్వరు. ఆబ్జెక్టిఫై చేయడం, అవమానించడం, వెకిలి చేష్టలు… అచ్చం మన ప్రపంచంలో అమ్మాయిలను ఎలా చూస్తారో అక్కడ అబ్బాయిలను అలా చూస్తారు. ఈ లోకంలో అలెక్స్ ఫాక్స్ సూపర్ కాన్ఫిడెంట్, పవర్‌ఫుల్, హార్డ్-డ్రింకింగ్ టాప్ ఎగ్జిక్యూటివ్‌గా మారిపోయి ఉంటుంది

Advertisement

డేమియన్ తన పాత లైఫ్‌ను తిరిగి పొందాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆలోచనలు, ప్రవర్తన మార్చుకోకపోతే అతనికి ఏమీ సాధ్యం కాదు. మరి తరువాత ఏం జరుగుతుంది ? ఈ కొత్త ప్రపంచంలో డేమియన్ అలెక్స్‌తో ఎలా తలపడతాడు ? చివరికి అతను తన లోకంలోకి వెళ్లాడా లేదా ? అన్నది స్టోరీ.

ఎక్కడ చూడవచ్చు ?

ఈ రొమాంటిక్ కామెడీ ‘ladies first’ మూవీలో జెండర్ రోల్స్‌ను ఫ్లిప్ చేసి, సొసైటీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను సెటైరికల్ కామెడీ వేలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్. Netflixలో 2026 మే 22న విడుదలైంది ఈ మూవీ.

Read Also : డివోర్స్ మహిళతో రెండో పెళ్లి… మరో మహిళతో సన్నిహితంగా… ఇదేం ఫ్యామిలీ భయ్యా

Tags

Related News

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×