E-Paper
Advertisement

గాల్లో వేలాడే శవాలు… ఆచారంలా మనుషుల్ని చంపి బలిచ్చే సైకో

గాల్లో వేలాడే శవాలు… ఆచారంలా మనుషుల్ని చంపి బలిచ్చే సైకో
Advertisement

Thriller Series : ఓ మంచి డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో ఏకంగా శవాలు గాల్లో తేలుతుంటాయి. సాధారణంగా సైకో కిల్లర్లు దొరికిన మనుషుల్ని చంపేసి ఎక్కడో ఓ చోట పారేస్తారు. కానీ ఈ సిరీస్ లో మాత్రం సైకో ఏకంగా చంపి, ఓ ఆచారం కోసం బలిస్తాడు. ఇలాంటి కొత్త స్టోరీ లైన్ తో రూపొందిన ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? సిరీస్ స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

జీ5లో అందుబాటులో

ZEE5లో 2026 జూన్ 5న విడుదలైన డార్క్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “Brown”. Abhinay Deo దీనికి దర్శకత్వం వహించారు. Abheek Barua రాసిన “City of Death” నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ లో కరిష్మా కపూర్ లీడ్ రోల్‌లో నటించింది. ఆమె అద్భుతమైన, గ్లామర్ లేని రియలిస్టిక్ అవతారంలో కనిపిస్తుంది. సీరియల్‌లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 45-50 నిమిషాలు ఉంటుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కొల్‌కతా నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో కథానాయిక Rita Brown (కరిష్మా కపూర్). ఒకప్పుడు కొల్‌కతా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ లో తెలివైన, ధైర్యవంతురాలైన డిటెక్టివ్ గా పేరు తెచ్చుకుంటుంది ఈవిడ. ఆమె ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినది. కానీ గతంలో జరిగిన ఒక ట్రాజెడీ వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఆమె సస్పెండ్ చేసిన పోలీస్ అధికారి. అల్కహాల్ అడిక్షన్‌తో, డిప్రెషన్‌తో, గత బాధల స్మృతులతో ఒంటరిగా గడుపుతుంది. తన మదర్ తో కలిసి ఉంటుంది. సిగరెట్లు తాగడం, డ్రింక్ చేయడం ఆమె రోజువారీ జీవితంలో భాగమైపోయాయి.

ఒక రోజు ధనిక, ప్రముఖ కుటుంబానికి చెందిన యువతి Ahana Jaiswal భయంకరమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఆమె శరీరం బెడ్‌ కి కట్టేసి, తల వేరు చేసిన ఘోర సన్నివేశంతో సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ కేసు చాలా సెన్సిటివ్, పైగా హై-ప్రొఫైల్ కావడంతో, పోలీస్ డిపార్ట్‌మెంట్ రీటా బ్రౌన్‌ ను తిరిగి యాక్టివ్ డ్యూటీలోకి తీసుకుంటుంది. రీటాకు జూనియర్ పార్ట్‌నర్‌గా Arjun Sinha (సూర్య శర్మ) ఉంటాడు. అర్జున్ కూడా తన భార్య, కుమారుడిని కారు యాక్సిడెంట్‌లో కోల్పోయి, డిమెన్షియా ఉన్న తండ్రితో బాధపడుతున్నాడు. ఇద్దరూ వ్యక్తిగత ట్రామా, బాధల మధ్య ఈ కేసును దర్యాప్తు చేస్తారు. మొదట్లో ఇది ఒక సాధారణ హత్య కేస్‌లా అనిపిస్తుంది. కానీ దర్యాప్తు ముందుకు సాగుతుండగా మరిన్ని హత్యలు జరుగుతాయి. దీంతో ఇది సీరియల్ కిల్లర్ కేస్ అని తేలుతుంది.

Advertisement

కేసు ముందుకు వెళ్తుండగా కొల్‌కతా ఉన్నత వర్గాల్లోని అవినీతి, రాజకీయ సంబంధాలు, కుటుంబ రహస్యాలు, సొసైటీలోని డార్క్ సైడ్ బయటపడతాయి. రీటా తన అల్కహాల్ అడిక్షన్‌తో పోరాడుతూ కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది ? హీరోయిన్ ఆ కిల్లర్ ను పట్టుకుందా ? అసలు కిల్లర్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Read Also : ఊళ్ళో ఉత్సవం… కట్ చేస్తే ఖతర్నాక్ ట్విస్టులున్న కన్నడ రివేంజ్ క్రైమ్ డ్రామా

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×