E-Paper
Advertisement

Horror Thriller OTT : రేడియో స్టేషన్లో దెయ్యంతో దబిడి దిబిడి… IMDbలో 8.6 రేటింగ్‌… గూస్ బంప్స్ తెప్పించే 2 గంటల హర్రర్ మూవీ

Horror Thriller OTT : రేడియో స్టేషన్లో దెయ్యంతో దబిడి దిబిడి… IMDbలో 8.6 రేటింగ్‌… గూస్ బంప్స్ తెప్పించే 2 గంటల హర్రర్ మూవీ
Advertisement

Horror Thriller OTT : ప్రస్తుత కాలంలో హారర్, సస్పెన్స్ సినిమాలకు క్రేజ్ భలే ఉంది. భయం కలిగించే కథలు, ఉత్కంఠ భరితమైన సీన్స్… ఇవన్నీ చూసి థ్రిల్ ఫీల్ అవుతాం కదా! వీకెండ్ కు పర్ఫెక్ట్ ఆప్షన్ గా అలాంటి మూవీ ఒకటి వచ్చేసింది. థియేటర్లలో హిట్ అయిన ఈ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోనూ భయపెడుతోంది. ఈ సినిమాను ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపేయాలనిపించదు. మరి ఆ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో అందుబాటులో

ఇప్పుడు చెప్పుకుంటున్న హర్రర్ మూవీ పేరు ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి మూవీని నిర్మించగా, సపోర్టింగ్‌ రోల్స్ లో శాండీ మాస్టర్ (విలన్‌గా), తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, మకరంద్ దేశ్‌పాండే లాంటి వాళ్లు కనిపిస్తారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీతోనే బెల్లంకొండకి లాంగ్ టైమ్ తర్వాత హిట్ వచ్చింది.

Advertisement

అక్టోబర్ 17 నుండి ZEE5లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఒరిజినల్‌తో పాటు ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొదటి హాఫ్ ఎంగేజింగ్, సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్స్ బాగున్నాయి. హర్రర్ అట్మాస్ఫియర్ సూపర్. కొంచెం ప్రిడిక్టబుల్ అయినా, హారర్ ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓ లుక్కేసి థ్రిల్ ఫీల్ అవ్వండి.

Read Also :  మనుషుల్ని చంపి మాస్క్ పెట్టే సైకో… హింట్ వదులుతూ హత్యలు… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి బ్రో

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

రాఘవ్ (బెల్లంకొండ), మైథిలి (అనుపమ) ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వాళ్లు ఒక ఘోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీ నడుపుతారు. టూరిస్టులను హాంటెడ్ ప్లేస్‌లకు తీసుకెళ్లి, ఫేక్ ఘోస్ట్ స్టోరీస్ చెప్పి భయపెట్టడం వాళ్ల బిజినెస్. కానీ ఒకసారి నిజమైన హాంటెడ్ ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది. సువర్ణమాయ అనే పాడుబడిన రేడియో స్టేషన్‌ కి వెళ్తారు. అక్కడ గతంలో జరిగిన హత్యలు, రహస్యాలు బయట పడతాయి. స్టేషన్ సీల్ చేసి ఉన్నా, వాళ్లు లోపలికి వెళ్లి ఒక దెయ్యాన్ని మేలుకొల్పుతారు. అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి, బతికి బయట పడడానికి చావుదాకా వెళతారు. ఇదే మెయిన్ ట్విస్ట్. రేడియో స్టేషన్ చుట్టూ తిరిగే కథలో ట్విస్ట్స్, హర్రర్ సీన్స్ బాగున్నాయి. నటీనటుల పెర్ఫార్మెన్సెస్బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాఘవ్ రోల్‌లో కూల్‌గా, ఇంటెన్స్‌గా కనిపించాడు. అనుపమ పరమేశ్వరన్ మైథిలిగా సూపర్, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ హైలైట్. శాండీ విలన్ రోల్‌లో భయపెట్టాడు. మిగతా క్యాస్ట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మరి అక్కడి నుంచి హీరో అండ్ టీం ఎలా బయట పడ్డారు ? అక్కడున్న దెయ్యాల కథ ఏంటి ? అన్నది స్టోరీ.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×