E-Paper
Advertisement

దెబ్బకు దెబ్బ.. కేసుకి కేసు.. ఇదో వెరైటీ రివెంజ్ డ్రామా

దెబ్బకు దెబ్బ.. కేసుకి కేసు.. ఇదో వెరైటీ రివెంజ్ డ్రామా
Advertisement

Revenge Thriller OTT : మామూలుగా లీగల్ డ్రామా కథల్లో లాయర్ వాదనలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ సిరీస్ స్టైలే వేరు. ఇందులో లాయర్ కోటు వేసిన హీరో, రౌడీల తాట తీస్తూనే చట్టంలోని లొసుగులను వాడుకోవడం హైలైట్. అంతేకాదు అతను రౌడీలనే తన అసిస్టెంట్లుగా మార్చుకోవడం చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాన్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్‌ను ఒక కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా మార్చాయి. ఈ సిరీస్ కు ఐయండిబిలో 7.6 రేటింగ్ కూడా ఉంది. ఈ బ్లాక్ బస్టర్ అయిన ఈ సిరిస్ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సూపర్ హిట్ కొరియన్ యాక్షన్ లీగల్ డ్రామా పేరు ‘లాలెస్ లాయర్’ (Lawless Lawyer). 2018లో వచ్చిన ఈ సిరిస్ లో లీ జూన్-గి, సియో యే-జి, లీ హ్యే-యంగ్, చోయి మిన్-సూ లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో హీరో లీ జూన్-గి ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలో శిక్షణ తీసుకున్నాడు. అందుకే ఇందులో ఫైట్ సీన్లు చాలా స్టైలిష్‌గా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. డైరెక్టర్ కిమ్ జిన్-మిన్, హీరో లీ జూన్-గి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సిరీస్, కొరియాలో భారీ టీఆర్‌పీ రేటింగ్స్ సాధించి ఒక సెన్సేషన్‌గా నిలిచింది. ఇక ఈ సిరీస్‌లో విలన్ల పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ముఖ్యంగా అందరూ గౌరవించే ఒక లేడీ జడ్జి అసలైన విలన్‌గా నటించడం కథకు పెద్ద ట్విస్ట్. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix), వికి (Rakuten Viki) అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ (Amazon MX Player) వంటి ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హీరో బాంగ్ సాంగ్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మని కళ్ళముందే రౌడీలు చంపడం చూస్తాడు. తన తల్లి ఒక లాయర్, కానీ సిటీలో ఉన్న పెద్ద మనుషుల అవినీతిని బయటపెట్టబోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అనాథగా మిగిలిన హీరో ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ అయిన తన మామ దగ్గర పెరుగుతాడు. అక్కడ రౌడీయిజం నేర్చుకుంటూనే, తన తల్లి కోరిక మేరకు చదువుకుని లాయర్ కూడా అవుతాడు. కానీ వాడు మామూలు లాయర్ కాదు, కోర్టులో వాదించడం ఎంత బాగా తెలుసో, కోర్టు బయట రౌడీల తాట తీయడం కూడా అంతే బాగా తెలుసు.

చాలా ఏళ్ల తర్వాత, తన తల్లిని చంపిన వాళ్లపై పగ తీర్చుకోవడానికి తన సొంత ఊరుకి తిరిగి వస్తాడు. అక్కడ జనం దైవంలా కొలిచే ఒక లేడీ జడ్జి, అలాగే ఒక మాజీ రౌడీ నుండి పెద్ద బిజినెస్ మెన్ అయిన విలన్ కలిసి ఆ సిటీని ఏలుతుంటారు. హీరో ఒక పాత ఆఫీసుని రౌడీల దగ్గర నుండి లాక్కుని, అక్కడ లా ఫర్మ్ పెడతాడు. హీరోయిన్ కూడా ఒక లాయరే, కానీ ఆవేశంలో ఒక జడ్జిని కొట్టి సస్పెండ్ అవుతుంది. ఇప్పుడు హీరో ఆమెను తన టీమ్‌లో చేర్చుకుని అసలు ఆట మొదలుపెడతాడు.

Advertisement

విలన్లు చట్టాన్ని తమ జేబులో పెట్టుకుని ఆడుతుంటే, హీరో వాళ్లకి వాళ్ల స్టైల్లోనే సమాధానం చెప్తాడు. ఒక పక్క లాయర్ కోటు వేసుకుని మరోపక్క గ్యాంగ్‌స్టర్ అవతారమెత్తి రౌడీలకి చుక్కలు చూపిస్తాడు. చివరకు తన తల్లికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరినీ జైలుకి పంపి రచ్చ లేపుతాడు. సింపుల్‌గా చెప్పాలంటే.. వాడు చట్టాన్ని ఫాలో అవ్వడు, చట్టాన్ని తనకి నచ్చినట్టు వాడుకుంటాడు.

Read Also : కేసు ఏదైనా సరే కామెడీతో దుమ్ము రేపే కొరియన్ డిటెక్టివ్… క్లైమాక్స్ వరకు నవ్వులే

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×