Action Comedy OTT : సరదాగా సాగే పక్కా టైమ్ పాస్ మూవీలు కొన్ని ఉంటాయి. ఇవి ఆడియన్స్ కి మంచి రిలాక్స్ ఇస్తాయి. అలాంటి మూవీ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా కామెడీతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఉండటం వల్ల యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా సుమారు 105 నిమిషాల నిడివితో చాలా ఫాస్ట్ గా సాగిపోతుంది, ఎక్కడా బోర్ కొట్టదు.
2021లో వచ్చిన ఈ కొరియన్ యాక్షన్ కామెడీ మూవీ పేరు ‘మిషన్ పాజిబుల్’ (Mission: Possible). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది, ముఖ్యంగా విడుదలైన మొదటి వారంలోనే సౌత్ కొరియాలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇందులో హీరోగా నటించిన కిమ్ యంగ్-క్వాంగ్ తన పాత్ర కోసం ప్రత్యేకంగా ‘క్రవ్ మగా’ అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, డూప్ లేకుండా రిస్కీ ఫైట్ సీన్లలో నటించడం విశేషం. ఇక దర్శకుడు కిమ్ హ్యుంగ్-జూ యాక్షన్, కామెడీని బాగా బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది మన దగ్గర ప్రైమ్ వీడియో (Prime Video)లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. కొరియన్ సినిమాలు ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
చైనాలో తయారైన దొంగ తుపాకులు కొరియాలోకి వస్తున్నాయని తెలిసి, వాళ్లను పట్టుకోవడానికి చైనా నుంచి యూ దా-హీ అనే ఒక లేడీ సీక్రెట్ ఏజెంట్ సౌత్ కొరియాకు దిగుతుంది. అక్కడ అసలైన కొరియన్ ఏజెంట్‌ను కలవాల్సిన ఆమె, పొరపాటున వూ సు-హాన్ అనే ఒక లోకల్ ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీసులోకి వెళ్తుంది. అతను మనీ మైండెడ్ ఫెలో, డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. ఆమె భారీ అమౌంట్ ఆఫర్ చూసి, తనే ఆ అసలైన ఏజెంట్ అని అబద్ధం చెప్పి ఆమెతో కలిసి మిషన్‌లో దిగుతాడు. అసలు రచ్చ ఇక్కడే మొదలవుతుంది. వీళ్లిద్దరూ కలిసి ఆ గన్ డీలర్ల కోసం గాలిస్తుంటే, ఎక్కడ వెతికినా అక్కడ వరుసగా శవాలు పడుతుంటాయి. ఆ మర్డర్లన్నీ వీళ్లే చేశారని పోలీసులు వీళ్ల వెనక పడతారు.
అటు విలన్లు, ఇటు పోలీసులు.. మధ్యలో ఈ జంట. ఒక పక్క ఆ హీరోయిన్ సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, మనోడు మాత్రం తన కామెడీతో, అమాయకత్వంతో ఆమెకు పిచ్చెక్కిస్తుంటాడు. వీడు వెధవ వేషాలు వేస్తున్నాడని ఆమెకు అర్థమయ్యేలోపే పరిస్థితి చేయి దాటిపోతుంది. వూ సు-హాన్ చూడటానికి కామెడీగా ఉన్నా, ఫైటింగ్ టైమ్ వచ్చేసరికి తనలోని అసలైన టాలెంట్ చూపిస్తాడు. ఈ గన్ డీలింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయను వీళ్లిద్దరూ కలిసి ఎలా ఫినిష్ చేశారనేది చాలా ఫన్నీగా, యాక్షన్ సీన్లతో సినిమా సాగుతుంది. చివరికి ఆ తుపాకుల వెనక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ ఎవరు? ఆ విలన్ల గ్యాంగ్‌ను వీళ్లు ఎలా డీల్ చేశారు? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఆకలితో అరుపులు భయంతో కేకలు… ఒక్కో ఎపిసోడ్ ఒక్కో అద్భతం… ఐయండిబిలో 7.2 టాప్ రేటింగ్