E-Paper
Advertisement

సీరియల్ కిల్లర్‌కే చుక్కలు చూపించే పిరికోడు… అసలైన కిక్కు ఇచ్చే క్రేజీ సిరీస్

సీరియల్ కిల్లర్‌కే చుక్కలు చూపించే పిరికోడు… అసలైన కిక్కు ఇచ్చే క్రేజీ సిరీస్
Advertisement

Thriller Series OTT : కొరియన్ డ్రామాల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే కొరియెన్ సిరీస్ ను చూడాల్సిందే. ఇందులో ముఖ్యంగా నెగటివ్ రోల్ ని కామెడీగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఈ కథలో ఒక కిల్లర్ డైరీ హీరోకి దొరుకుతుంది. ఇంతలో ఒక ప్రమాదం జరిగి హీరో గతం మరచిపోతాడు. ఇక ఆ డైరీ చూసి కిల్లర్ తనే అనుకుని భ్రమలో బతుకుతాడు. ఆ తరువాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు అస్సలు బోర్ కొట్టవు. దీనికి ఐయండిబిలో 7.7 రేటింగ్ కూడా ఉంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ కొరియన్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘సైకోపాత్ డైరీ’ (Psychopath Diary). 2019లో వచ్చిన ఈ సిరీస్ లీ జోంగ్-జే దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో యూన్ షి-యూన్, జంగ్ ఇన్-సన్, పార్క్ సుంగ్-హూన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్‌లో యూన్ షి-యూన్ నటన హైలైట్ అని చెప్పాలి. ఒక పక్క అమాయకపు ఆఫీస్ ఎంప్లాయిగా, మరోపక్క తనని తాను సీరియల్ కిల్లర్‌గా ఊహించుకుని ఇచ్చే సైకో ఎక్స్‌ప్రెషన్స్ భలే నవ్వు తెప్పిస్తాయి. ఇక అసలైన విలన్ పార్క్ సుంగ్-హూన్ నటన కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. దర్శకుడు లీ జోంగ్-జే థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ని, డార్క్ కామెడీని చాలా బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేశారు. 16 ఎపిసోడ్ల పాటు సాగే ఈ కథలో అనవసరమైన సాగతీత లేకుండా, ప్రతి ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ వికి (Viki) ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డాంగ్-సిక్ అనే కుర్రాడు చాలా సాఫ్ట్. ఆఫీసులో అందరితో చివాట్లు తింటూ, చేతగానివాడు అని అనిపించుకుంటూ ఉంటాడు. జీవితం మీద విరక్తి వచ్చి సూసైడ్ చేసుకుందామని వెళ్తే, అక్కడ ఒక హత్య జరుగుతుండటం కళ్ళారా చూస్తాడు. భయపడి పారిపోయేటప్పుడు, ఆ హంతకుడు రాసుకున్న ఒక డైరీ వీడి చేతికి చిక్కుతుంది. ఆ కంగారులో రోడ్డు మీద పరుగెడుతుంటే ఒక పోలీస్ జీపు వచ్చి గుద్దేస్తుంది. దాంతో అతని పాత జ్ఞాపకాలన్నీ చెల్లాచెదరై గతం మర్చిపోతాడు. ఆసుపత్రిలో కళ్ళు తెరిచేసరికి వాడి చేతిలో ఆ డైరీ ఉంటుంది. అందులో ఉన్న కిరాతకమైన హత్యలన్నీ చూసి, నేను ఇంత పెద్ద సైకోపాత్ సీరియల్ కిల్లర్నా అని పొరపాటు పడతాడు.

ఇక ఆ డైరీ చదివి తనని తాను ఒక డేంజర్ విలన్‌లా ఫీలవ్వడం మొదలుపెడతాడు. భయపడేవాడు కాస్తా రివర్స్ అయ్యి, తనని ఏడిపించే వాళ్ళకి చుక్కలు చూపిస్తూ మాంచి యాటిట్యూడ్ చూపిస్తుంటాడు. ఈ కామెడీ గందరగోళం ఒక పక్క నడుస్తుంటే, అసలైన హంతకుడు తన డైరీ కోసం వెతుకుతూ సీన్లోకి వస్తాడు. మరోపక్క ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ హత్యల కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ ముగ్గురి ఎంట్రీతో కథ ఓ రేంజ్ లో నడుస్తుంది. చివరికి హీరోకి తన గతం గుర్తొచ్చిందా ? కిల్లర్ ను పోలీసులు పట్టుకుంటారా ? వీళ్ళ మధ్య నడిచే మైండ్ గేమ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : దొంగా పోలీస్ ఒక్కటైతే… ప్రతి నిమిషం నవ్వులు పూయించే కామెడీ మూవీ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×