E-Paper
Advertisement

శత్రువులే ప్రేమికులయ్యే విచిత్రమైన రొమాంటిక్ కామెడీ డ్రామా… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సిరీస్

శత్రువులే ప్రేమికులయ్యే విచిత్రమైన రొమాంటిక్ కామెడీ డ్రామా… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సిరీస్
Advertisement

Romantic Comedy Drama : ప్రేమ కథలు తీయాలంటే కొరియన్ వాళ్ళే తీయాలి. వీళ్ళు తీసే రొమాంటిక్ సిరీస్ లకు అతుక్కుపోతున్నారు ప్రేక్షకులు. ఇది ఇండియాలో కూడా ఒక వైరస్ లా పాకుతోంది. చూసేవాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా ఫాలో అవుతూ కొరియాలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది ఒక సిరీస్. మీరు పాత స్నేహితులు శత్రువులుగా మారి, మళ్లీ ప్రేమికులుగా మారే కథలను ఇష్టపడితే, ఈ సిరీస్ మీకు బాగా నచ్చుతుంది. ఇందులో కామెడీ, ఎమోషన్స్ రెండూ ఉంటాయి. దీనికి ఐయండిబిలో 7.2 రేటింగ్ కూడా ఉంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2025 లోవచ్చిన ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ పేరు ‘మై డియరెస్ట్ నెమెసిస్’ (My Dearest Nemesis). ఈ సిరీస్ ‘హీ ఈజ్ ఏ బ్లాక్ సాల్ట్ డ్రాగన్’ అనే పాపులర్ వెబ్‌టూన్ ఆధారంగా రూపొందింది. ఇందులో ప్రధాన పాత్రల్లో మూన్ గా-యంగ్ (ట్రూ బ్యూటీ ఫేమ్) మరియు చోయి హ్యూన్-వూక్ (ట్వింక్లింగ్ వాటర్మెలన్ ఫేమ్) నటించారు. స్క్రీన్‌పై వీళ్ళ కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 2000ల నాటి ఆన్‌లైన్ గేమింగ్ కల్చర్‌ను నేటి కార్పొరేట్ ఆఫీస్ సెటప్‌కు ముడిపెడుతూ దర్శకుడు లీ జోంగ్-జే ఈ కథను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. మొత్తం 12 ఎపిసోడ్‌లతో సాగే ఈ డ్రామా, తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది. కొరియాలో tvN ఛానల్‌లో ప్రసారమైన ఈ సిరీస్, అంతర్జాతీయంగా Viki ప్లాట్‌ ఫామ్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగులో అధికారికంగా డబ్ చేయకపోయినా, కథలోని మోషన్స్, కామెడీ మన ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

టీనేజ్ లో హీరో, హీరోయిన్ ఇద్దరూ ‘బ్లాక్ డ్రాగన్’, ‘స్ట్రాబెర్రీ’ అని దొంగ పేర్లు పెట్టుకుని ఆన్‌లైన్ గేమ్‌లో తెగ చాటింగ్ చేసుకునేవారు. చాటింగ్‌లో ఇద్దరికీ ఒకరంటే ఒకరు పిచ్చి ప్రేమ. తీరా బయట కలుద్దామని ప్లాన్ చేసుకుంటే, హీరో చేసిన అతి వల్ల ఆ మీటింగ్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఆ దెబ్బతో హీరోయిన్ వాడి మొహం చూడనని తెగేసి చెప్పి, వాడిని రిజెక్ట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ప్రజెంట్ లో హీరోయిన్ ఒక పెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో కష్టపడి పని చేస్తూ టీమ్ లీడర్ అవుతుంది. ఒకరోజు స్టోరీ మలుపు తీసుకుంటుంది. అక్కడికి కొత్తగా వచ్చిన బాస్ ఎవరా అని చూస్తే, పాత ఆన్‌లైన్ ప్రేమికుడు (హీరో) ప్రత్యక్షమవుతాడు.

అతను ఇప్పుడు పెద్ద కోటీశ్వరుల వారసుడు, పైగా ఆఫీస్ మొత్తానికి హెడ్. పాత గొడవలు గుర్తున్న హీరోయిన్ తప్పించుకుందామన్నా, హీరో మాత్రం అస్సలు వదలడు. పాత పగ తీర్చుకోవడానికా లేక పాత ప్రేమ కోసమా అన్నట్టుగా ఆమె వెంటపడుతూ టార్చర్ పెడతాడు. ఇక ఆఫీసులో వీరిద్దరి మధ్య నిత్యం కీచులాటలే. ఒకరు ఒకటంటే మరొకరు పది అంటారు. కానీ లోలోపల మాత్రం పాత ఆన్‌లైన్ ప్రేమ అలాగే ఉంటుంది. చివరకు ఆ గొడవలు, పంతాలు పోయి, ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం బయటపడుతుంది. ఆన్‌లైన్ ప్రపంచంలో మొదలైన ఆ పిచ్చి ప్రేమ, రియల్ లైఫ్‌లో ఎన్నో ట్విస్టులు దాటుకుని చివరకు ఎలా సెట్ అయిందనేదే ఈ సిరీస్ అసలు మజా.

Advertisement

Read Also : ఆ నలుగురు ఎవరు? వాళ్ళు చెప్పే ప్రళయం నిజంగానే వస్తుందా ? ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న సినిమా

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×