Thriller Movie OTT : కుర్చీకి కట్టిపడేసే థ్రిల్లర్ సినిమా గురించి వెతుకుతున్నట్లైతే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. క్లైమాక్స్ వరకు అస్సలు చూపు తిప్పుకోలేరు. ఈ కథలో ఒక చిన్న పాప, ఆమె ఇద్దరు తండ్రులు ఒక మారుమూల అడవిలోని క్యాబిన్‌లో సెలవులను గడుపుతుంటారు. అకస్మాత్తుగా నలుగురు అపరిచితులు వాళ్ళను బంధించి, లోకం అంతం కాబోతోందని, దానిని ఆపాలంటే మీ కుటుంబంలోని ఒకరు ప్రాణత్యాగం చేయాలనే భయంకరమైన నిబంధన విధిస్తారు. వాళ్ళు చెప్పేది నిజమా లేక అబద్ధమా అనే డైలమాలో ఆ కుటుంబం తీసుకునే నిర్ణయమే ఈ సినిమా కథ. 1 గంట 40 నిమిషాల పాటు మిమ్మల్ని కదలనివ్వదు ఈ సినిమా. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే
2023 లో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘నాక్ ఎట్ ది క్యాబిన్'(Knock at the Cabin). ఇందులో డేవ్ బాటిస్టా, జోనాథన్ గ్రాఫ్, బెన్ ఆల్డ్రిడ్జ్, క్రిస్టెన్ క్యూయి వంటి నటులు నటించారు. అయితే ఈ సినిమాకు అతిపెద్ద బలం డేవ్ బాటిస్టా నటన. మామూలుగా యాక్షన్ సినిమాల్లో అరుస్తూ కనిపించే బాటిస్టా, ఇందులో ఒక స్కూల్ టీచర్‌గా చాలా నెమ్మదిగా, విచారంగా మాట్లాడుతూనే భయం పుట్టిస్తాడు. అలాగే ఈ సినిమా అంతా ఒకే క్యాబిన్‌లో జరిగినప్పటికీ, దర్శకుడు శ్యామలన్ కెమెరా యాంగిల్స్‌తో ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగించేలా రూపొందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా పాల్ ట్రెంబ్లే రాసిన ‘ది క్యాబిన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే నవల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమాను జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్ ఉంటే నేరుగా చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటుకు తీసుకుని చూడవచ్చు.
ఈ సినిమాలో ఎరిక్, ఆండ్రూ అనే ఒక గే కపుల్ ఉంటారు. వాళ్ళు ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచుకుంటూ ఉంటారు.
అయితే వీళ్ళు ఒకరోజు సిటీ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడుపుదామని అడవిలో ఒక క్యాబిన్‌కి వెళ్తారు. అక్కడ పాప ఒక్కతే బయట ఆడుకుంటుంటే, సడన్‌గా నలుగురు అపరిచితులు ఆయుధాలు పట్టుకుని ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూసి భయపడి పాప లోపలికి పరుగెడుతుంది, కానీ ఆ నలుగురు బలవంతంగా తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి జొరబడి ఆ ఫ్యామిలీని కుర్చీలకు కట్టేస్తారు.
ఆ నలుగురు వచ్చినోళ్లు వింత మాటలు చెప్పడం మొదలుపెడతారు. ప్రపంచం అంతం అయిపోబోతోంది, సునామీలు, భూకంపాలు వచ్చి అందరూ చచ్చిపోతారు, అది ఆగాలంటే మీ ముగ్గురిలో ఎవరో ఒకరు మీ చేతులతోనే చావాలని కండిషన్ పెడతారు.
ఆ ఫ్యామిలీ ఏమో వీళ్లెవరో పిచ్చోళ్లలా ఉన్నారు, ఏదో ప్లాన్ చేసి మమ్మల్ని భయపెడుతున్నారని మొదట నమ్మరు. కానీ ప్రతిసారీ వాళ్ళు ఒక గడువు ఇచ్చినప్పుడల్లా టీవీలో నిజంగానే విపత్తులు జరుగుతున్నట్టు వార్తలు వస్తుంటాయి. చివరికి అది నిజమే అని నమ్మి, ఆ ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం ఏమిటి ? నిజంగానే విపత్తులు వస్తాయా ? వీళ్ళల్లో ఎవరైనా ప్రాణ త్యాగం చేస్తారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఆస్తి కావాలంటే ఆ పనులు చేయాల్సిందే… నెట్‌ఫ్లిక్స్ లో సెన్సేషనల్ మూవీ