E-Paper
Advertisement

పవర్ కోసం నకిలీ పెళ్లి … ఓటీటీలో దూసుకెళ్తున్న కొరియన్ సిరీస్

పవర్ కోసం నకిలీ పెళ్లి … ఓటీటీలో దూసుకెళ్తున్న కొరియన్ సిరీస్
Advertisement

Romantic Comedy OTT : ఓటీటీలోకి రీసెంట్ గా ఒక కొరియన్ రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్ కి వచ్చింది. వచ్చి రాగానే ఇది టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇది ఒక మంచి ఎంటర్టైనింగ్ రొమాంటిక్ కామెడీ సిరీస్. ఈ కాలంలో కూడా రాజులు, రాణులు ఉంటే ఎలా ఉంటుందో అనే క్రేజీ ఐడియాతో దీన్ని తీశారు. ఒక పక్కా కమర్షియల్ మైండ్ ఉన్న బిజినెస్ అమ్మాయికి, అసలు పవరే లేని ఒక ప్రిన్స్‌కి మధ్య జరిగే సరదా గొడవలే ఈ కథ. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోరు, కేవలం ఒక డీల్ ప్రకారం పెళ్లి చేసుకుంటారు. అందుకే ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్లు, రొమాన్స్ భలే కిక్కు ఇస్తాయి. ఇందులో రాజరికం పేరుతో వచ్చే పాలిటిక్స్, అలాగే ఒక రిచ్ ఫ్యామిలీలో ఉండే కుట్రలు ఉంటాయి. కానీ అన్నీ కూడా సీరియస్‌గా కాకుండా, అందరికీ నచ్చేలా సరదాగా సాగుతాయి. దీనికి ఐయండిబిలో 8.3 రేటింగ్ కూడా ఉంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ పేరు ‘పర్ఫెక్ట్ క్రౌన్’ (Perfect Crown). ఇందులో ప్రముఖ నటి, గాయని IU, బ్యున్ వూ-సియోక్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ డ్రామాకు ‘వాట్స్ రాంగ్ విత్ సెక్రటరీ కిమ్’, ‘అల్కెమీ ఆఫ్ సోల్స్’ వంటి సూపర్ హిట్ డ్రామాలను తీసిన పార్క్ జూన్-హ్వా దర్శకత్వం వహించారు. ఇందులో ఈ కాలం నాటి రాజుల సెట్ కోసం, సియోల్‌లోని నిజమైన చారిత్రక కట్టడాలైన జియోంగ్‌బాక్‌గుంగ్, చాంగ్‌డియోక్కుంగ్ ప్యాలెస్‌లలో షూటింగ్ చేయడం జరిగింది. అంతేకాదు IU, బ్యున్ వూ-సియోక్ కలయికలో పదేళ్ల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, అనౌన్స్ చేసిన రోజు నుండే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజుల్లోనే 11.1% రేటింగ్ సాధించి, 2026లో అత్యధిక ఆదరణ పొందిన డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. 2026 ఏప్రిల్ 10 నుండి ఇది MBC ఛానెల్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. మొత్తం 12 ఎపిసోడ్లతో ఇది వరల్డ్ వైడ్ టాప్ టెన్ లిస్టులో కొనసాగుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథలో హీరోయిన్ (IU) మామూలు అమ్మాయి కాదు. ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యానికి వారసురాలు, పైగా ఫుల్ ఆటిట్యూడ్. అయితే తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆమెకు రాయల్ స్టేటస్ అవసరమవుతుంది. అప్పుడే ఆమె కన్ను హీరో (బ్యున్ వూ-సియోక్) మీద పడుతుంది. అతను ఎవడో కాదు, ఒకప్పటి రాజవంశానికి చెందిన ప్రిన్స్. కానీ అతనికి అధికారాలు ఏమీ ఉండవు. పైగా ఆర్థికంగా కూడా వీక్. దీంతో హీరోయిన్ అతనితో ఒక మ్యారేజ్ డీల్ మాట్లాడుకుంటుంది. భార్యా భర్తలుగా నటిస్తే ఇద్దరి ప్రాబ్లెమ్స్ సాల్వ్ అవుతాయని అతన్ని ఒప్పిస్తుంది.

ఇక రాజభవనంలోకి అడుగుపెట్టాక అసలు రచ్చ మొదలవుతుంది. హీరోకి అక్కడ విలువ లేదు, ఈమెకేమో ఆ పద్ధతులు రావు. ఇద్దరికీ అస్సలు పడదు, ఎప్పుడూ కుక్కాపిల్లి లాగా కొట్టుకుంటూ ఉంటారు. కానీ లోపల లోపల ఒకరి మీద ఒకరికి సాఫ్ట్ కార్నర్ పెరుగుతుంది. ఈ గ్యాప్‌లో బిజినెస్ విలన్లు, రాజకుటుంబంలో కుళ్లు రాజకీయాలు చేసేవాళ్లు వీళ్లిద్దరినీ విడదీయాలని నానా ప్లాన్లు వేస్తుంటారు. నాటకీయంగా మొదలైన ఈ పెళ్లి, నిజమైన ప్రేమగా ఎలా మారింది ? వీళ్లకున్న సమయాలు ఏమిటి ? అనేది సినిమాటిక్ స్టైల్‌లో ఉంటుంది. సీరియస్ పాలిటిక్స్ పక్కన పెడితే, వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు, ఫన్నీ గొడవలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి.

Advertisement

Read Also : మిడిల్ క్లాస్ లైఫ్ కళ్ళకు కట్టినట్లు.. తండ్రికొడుకుల సెంటిమెంట్ తో కట్టిపడేస్తున్న మలయాళ మూవీ

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×