E-Paper
Advertisement

ఐదు రోజులకొక హత్య చేసే సైకో కిల్లర్… తాగుబోతు డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్… మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

ఐదు రోజులకొక హత్య చేసే సైకో కిల్లర్… తాగుబోతు డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్… మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్
Advertisement

Mystery Thriller Series OTT : ఓటీటీలో రీసెంట్ గా ఒక థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. దీనిని ఆడియన్స్ తెగ చూస్తున్నారు కూడా. ఇది ఒక సీరియల్ కిల్లర్‌ చేసే వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. సిరీస్ చాలా సీరియస్‌గా, డార్క్‌గా సాగుతుంది. సిటీలో జరిగే భయంకరమైన హత్యలు, ఆ కిల్లర్ వదిలే వింత గుర్తులు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇందులో హీరో ఎప్పుడూ ఏదో ఒక బాధలో, మందుకి బానిసై కనిపిస్తాడు. కానీ కేసు దగ్గరకు వచ్చేసరికి అతని తెలివితేటలు మామూలుగా ఉండవు. మనల్ని కథలో లీనం చేసేలా ఈ సిరీస్‌ని తీశారు. ఇక ఇందులో యాక్షన్ కంటే సస్పెన్స్ ఎక్కువ. కిల్లర్ ఎవరు? అతను ఎందుకు చంపుతున్నాడు? అనే విషయాలను హీరో ఎలా కనిపెట్టాడనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. థ్రిల్లర్ కంటెంట్ ను ఇష్టపడేవాళ్లు అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్ ఇది. దీనికి ఐయండిబిలో 7.7 రేటింగ్ కూడా ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

జో నెస్‌బో రాసిన ప్రముఖ నవల ఆధారంగా రూపొందించిన ‘డిటెక్టివ్ హోల్’ (Detective Hole) వెబ్ సిరీస్ 2026 మార్చి 26 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ నార్వేజియన్ క్రైమ్ సిరీస్ ను జో నెస్‌బో స్వయంగా రూపొందించారు. సాధారణంగా నవలల ఆధారంగా తీసే సినిమాల్లో మార్పులు ఉంటాయి. కానీ ఇక్కడ రచయిత స్వయంగా సిరీస్ ను రూపొందించడంతో ఒరిజినల్ ఫీల్ తగ్గకుండా ఉంటుంది. మొదటిసారిగా వచ్చిన ఈ సీజన్‌లో మొత్తం 9 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ఒకేసారి చూసేలా ఉంటుంది. ఇందులో టోబియాస్ సాంటెల్‌మాన్ హ్యారీ హోల్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక విలన్ పాత్రలో నటించిన జోయల్ కిన్నమన్ నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్స్ ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠను పెంచుతూ, క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు ఇది ఒక విందులా ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో హీరో హ్యారీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే మోస్ట్ టాలెంటెడ్ డిటెక్టివ్. అయితే ఆయనకి మందు అలవాటు ఎక్కువ. పర్సనల్ లైఫ్ అంతా అస్తవ్యస్తంగా ఉన్నా, కేసుల దగ్గరకు వస్తే మాత్రం వేటగాడే. ఏదో ఒక గొడవలో పడి డిపార్ట్‌మెంట్ నుంచి బయటకు పోయే టైంలో, సిటీలో వరుసగా ఘోరమైన హత్యలు జరుగుతాయి. ఆ కేసుని సాల్వ్ చేసే దమ్ము హ్యారీకి తప్ప ఇంకెవరికీ లేదని డిపార్ట్‌మెంట్ మళ్ళీ అతన్ని రంగంలోకి దించుతుంది. హత్యలు జరిగే చోటల్లా ఐదు కోణాల నక్షత్రం గుర్తు కనిపిస్తూ ఉంటుంది. ఒక వేలు కట్ చేసి ఉండటం, బాడీ దగ్గర వింత గుర్తులు ఉండటంతో అదొక సైకో కిల్లర్ పని అని హ్యారీ కనిపెడతాడు. కిల్లర్ చాలా పక్కా ప్లాన్‌తో, కచ్చితంగా ప్రతి ఐదు రోజులకొకసారి ఒక హత్య చేస్తూ ఉంటాడు. మరో హత్య జరగక ముందే కిల్లర్‌ను పట్టుకోవడమే డిటెక్టివ్ హ్యారీ హోల్ ముందున్న ఇప్పుడున్న అసలు సవాల్.

అయితే బయట ఉన్న కిల్లర్ ఒకడైతే, డిపార్ట్‌మెంట్ లోపలే హ్యారీకి వెన్నుపోటు పొడవడానికి టామ్ వాలర్ అనే మరో పెద్ద విలన్ రెడీగా ఉంటాడు. ఆ కిల్లర్‌ని పట్టుకోవాలా లేక తన మీద పగబట్టిన సొంత బ్యాచ్ నుండి తప్పించుకోవాలా అనేది తలనొప్పిగా మారుతుంది హ్యారీకి. అయినా సరే హ్యారీ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ కిల్లర్ వెనుక పడతాడు. ప్రతి హత్య వెనుక ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పట్టుకుని కిల్లర్ నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో గెస్ చేయడమే అసలు కిక్కు. చివరికి ఆ నక్షత్రాల గుర్తులు వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి ? కిల్లర్ ఎందుకు ప్రతి ఐదు రోజులకొకసారి హత్యలు చేస్తున్నాడు ? హ్యారీ కిల్లర్ ని పట్టుకున్నాడా ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఒక్క తప్పుతో నరాలు తెగే ఉత్కంఠ… శవం దాచడానికి పడరాని పాట్లు… ఓటీటీలో కేక పెట్టిస్తున్న క్రేజీ థ్రిల్లర్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×