ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఏఫ్రిల్ 26– మే02) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ వారం మధ్యలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్ధికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి.
ఈ వారం మీకు వృత్తి పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్ధికపరమైన విషయాలు లాభదాయకంగా ఉంతాయి. కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యం. లక్ష్మీ దేవి ఆరాధన చేయడం శుభప్రదం.
ఈ వారం మీరు మాటతీరుపై నియంత్రణ కలిగి ఉండాలి. అనవసర చర్చల వల్ల వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం.
ఈ వారం మీరు ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది, కానీ విలాసాలకు ఖర్చు చేస్తారు.. చిన్నపాటి జలుబు, దగ్గు ఇబ్బంది పెట్టవచ్చు. మరిన్ని మంచి ఫలితాల కోసం సోమవారం శివాభిషేకం చేయించుకోండి.
ఈ వారం ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వెన్నునొప్పి వంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆదిత్య హృదయం పఠించండి శుభప్రదం.
వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చర్మ సంబంధిత జాగ్రత్తలు తీసుకోండి. బుధవారం గణపతికి గరిక సమర్పించండి.
ఈ వారం మీకు జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు, సంయమనం పాటించడం అవసరం. కోపాన్ని తగ్గించుకోవడం వల్ల పనులు సజావుగా సాగుతాయి. ఖర్చులు ఆదాయానికి మించి ఉండే అవకాశం ఉంది. అలసట ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం అమ్మవారికి దీపారాధన చేయడం శుభప్రదం.
ఈ వారం మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి.
ఈ వారం మీకు వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, పట్టుదలతో అధిగమిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. గురువారం దక్షిణామూర్తిని పూజించండి.
ఈ వారం మీరు సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి చూపుతారు. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. డబ్బు పొదుపు చేయడంపై దృష్టి పెడతారు. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం. కీళ్ల నొప్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి.
ఈ వారం మీరు వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించండి. శివాలయ దర్శనం శుభప్రదం.
ఈ వారం మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. మంచి ఆరోగ్యం కోసం తగినంత విశ్రాంతి తీసుకోండి గురువారం రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి.