E-Paper
Advertisement

Romantic Drama OTT: అలల మీద విరబూసిన అందమైన ప్రేమ…కొసరి కొసరిగా ప్రియుడి మత్తులో…

Romantic Drama OTT: అలల మీద విరబూసిన అందమైన ప్రేమ…కొసరి కొసరిగా ప్రియుడి మత్తులో…
Advertisement

Romantic Drama OTT : ఓటీటీలో ఒక క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా టర్కీలోని అత్యంత అందమైన బీచ్ ప్రాంతాల్లో తీశారు. ముఖ్యంగా చెస్మే, ఉర్లా అనే తీర ప్రాంతాల్లోని నీలం రంగు సముద్రం, అక్కడి పాత కాలపు ఇళ్లు చూస్తుంటే కళ్లు తిప్పుకోలేరు. సినిమా చూస్తున్నంత సేపు మనకు కూడా అక్కడికి వెళ్లి హాలిడే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. ప్రేమికులు ఈ సినిమాను అస్సలు మిస్ చేయకూడదు. అంత చక్కగా ఉంటుంది ఈ ప్రేమ కథ.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ టర్కిష్ రొమాంటిక్ మూవీ పేరు ‘ఛేజింగ్ ద విండ్’ (Chasing the Wind). ఈ చిత్రానికి ఇంజిన్ ఎర్డెన్ దర్శకత్వం వహించారు. ఇందులో టర్కిష్ సూపర్ స్టార్స్ హండే ఎర్చెల్, బారిష్ అర్దుక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం 1 గంట 36 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా రిలాక్సింగ్‌గా, వినడానికి హాయిగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రపు అలల చప్పుడు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే చిన్న మెసేజ్ కూడా ఇందులో ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరోయిన్ అస్లీ (హండే ఎర్చెల్) పక్కా సిటీ అమ్మాయి, పెద్ద బిజినెస్ మొఘల్. ఆమెకు ఆస్తిపాస్తులు, ఆఫీసు పనులే లోకం. హీరో ఏగే (బారిష్ అర్దుక్) మాత్రం దానికి రివర్స్. హాయిగా సముద్ర తీరంలో సర్ఫింగ్ నేర్పిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ బిందాస్‌గా బతికేస్తుంటాడు. వీళ్ళిద్దరూ ఒకే పెద్ద కంపెనీకి వారసులు. ఈ కథలో మెయిన్ స్టోరీ ఇప్పుడే ఉంటుంది. అస్లీకి ఆ సముద్ర తీరంలో ఒక పెద్ద లగ్జరీ హోటల్ కట్టాలని ప్లాన్ ఉంటుంది. కానీ ఏగేకు మాత్రం తన ఊరు, అక్కడి ప్రకృతి పాడవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. ఇద్దరి మధ్య చిన్న పాటి గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో అస్లీ ఆ ఊరికి వచ్చి, ఏగేతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తుంది. ఆ గొడవల మధ్యనే మెల్లగా ఒకరిపై ఒకరికి మనసు పారేసుకుంటారు. కార్పొరేట్ పాలిటిక్స్ కంటే ప్రేమ గొప్పదని అర్థం చేసుకునే సీన్లు భలే ఉంటాయి ఇందులో. చివరికి ఆ హోటల్ ప్రాజెక్ట్ ఏమైంది? అస్లీ తన మొండితనాన్ని వదులుకుందా? ఏగే తన ఊరిని కాపాడుకున్నాడా? అనేదే క్లైమాక్స్.

Read Also : ఇద్దరబ్బాయిలతో అమ్మాయి దోబూచులాట… యమ కిక్ ఇచ్చే ట్రయాంగిల్ లవ్వు

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×