E-Paper
Advertisement

Romantic Drama OTT : ఇద్దరబ్బాయిలతో అమ్మాయి దోబూచులాట… యమ కిక్ ఇచ్చే ట్రయాంగిల్ లవ్వు

Romantic Drama OTT : ఇద్దరబ్బాయిలతో అమ్మాయి దోబూచులాట… యమ కిక్ ఇచ్చే ట్రయాంగిల్ లవ్వు
Advertisement

Romantic Drama OTT : ట్రయాంగిల్ ప్రేమ కథలు ఎప్పుడూ కొత్తగానే ఉన్నట్టు అనిపిస్తుంటాయి. ఎప్పటినుంచో ఈ కంటెంట్ కు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల చుట్టూ తిరిగే ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ టర్కిష్ రొమాంటిక్ సిరీస్ పేరు ‘Love and Pride’. ఇది జేన్ ఆస్టెన్ రాసిన క్లాసిక్ నవల “ప్రైడ్ అండ్ ప్రెజుడీస్” ఆధారంగా రూపొందింది. తానేర్ అక్వర్డర్, గోక్రిన్ డోకుమాసి, సెలెన్ కిలికార్స్లాన్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. ఇందులో జైనబ్‌గా దామ్లా సోన్మెజ్, కెనన్‌గా మెర్ట్ ఫిరాత్, మురత్‌గా అల్పర్ సల్దిరాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో మొత్తం 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నుండి 50 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ఈ సిరీస్ ప్రస్తుతానికి Amazon Prime Videoలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇస్తాంబుల్‌లోని ఒక పాత బస్తీలో నివసించే జైనబ్ అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమెది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐదుగురు సంతానంలో జైనబ్ ఒకరు. తన కుటుంబం పరువును కాపాడుతూ, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ఆరాటపడుతుంటుంది. ఒక పెళ్లి వేడుకలో ఆమెకు కెనన్ అనే పెద్ద ధనవంతుడు పరిచయమవుతాడు.కెనన్ చాలా గర్వమున్న వ్యక్తి, కానీ జైనబ్ తెలివితేటలు, ఆమె వ్యక్తిత్వం అతన్ని ఆకర్షిస్తాయి. వీళ్లిద్దరి మధ్య మొదట్లో గొడవలు జరిగినా, మెల్లగా అది ప్రేమగా మారుతుంది. అయితే కథలో అసలు ట్విస్ట్ జైనబ్ చిన్ననాటి స్నేహితుడు మురత్ వల్ల వస్తుంది.

మురత్ మొదటి నుండి జైనబ్‌ను ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. జైనబ్ కుటుంబం కూడా మురత్‌ను నమ్ముతుంది. అటు తన మనసుకు నచ్చిన కెనన్, ఇటు తనను అమితంగా ప్రేమించే మురత్.. ఈ ఇద్దరి మధ్య జైనబ్ నలిగిపోతుంది. ఆమె ఎవరిని ఎంచుకోవాలో తెలియక సతమతమవుతుంది. చివరికి ఈ త్రికోణ ప్రేమకథలో ఎవరి ప్రేమ పట్టాలెక్కుతుంది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఓటీటీలోకి తమిళ కామెడీ వెబ్ సిరీస్… నవ్వు తెప్పిస్తున్న స్నేహితుల అల్లరి… ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×