E-Paper
Advertisement

అదిరేటి గట్స్ ఉన్న ఆడపిల్లల కథ… ప్రతి అమ్మాయి చూడాల్సిన గొప్ప మూవీ

అదిరేటి గట్స్ ఉన్న ఆడపిల్లల కథ… ప్రతి అమ్మాయి చూడాల్సిన గొప్ప మూవీ
Advertisement

Romantic Drama OTT : ఎప్పుడూ ఫైటింగులు, భారీ యాక్షన్ సీన్లు ఉండే సినిమాలు చూసి బోర్ కొట్టేసిందా ? అయితే ఐయండిబిలో 7.8 రేటింగ్ ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను చూసేయండి. ఇది మన ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉంటే, వాళ్ళ మధ్య జరిగే గొడవలు, ముచ్చట్లు, వాళ్ల కష్టసుఖాల చుట్టూ సాగే సినిమాలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని పడే తాపత్రయాన్ని, ఒకరికి ఒకరు ఇచ్చే సపోర్ట్ ను ఈ మూవీ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒక పక్క నవ్వుతూనే, ఇంకో పక్క కళ్లలో నీళ్లు తెప్పించే మంచి ఎమోషనల్ రైడ్ ఈ సినిమా.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో 2019లో వచ్చిన ఈ సినిమా పేరు ‘లిటిల్ విమెన్’ (Little Women). ఈ సినిమా షూటింగ్ అంతా రచయిత్రి లూయిసా మే ఆల్కాట్ పుట్టి పెరిగిన మసాచుసెట్స్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. కొన్ని సీన్లయితే ఆమె అసలు ఇంట్లోనే చిత్రీకరించారు. అలాగే సినిమాలో జో, మెగ్, అమీ, బెత్ పాత్రల్లో నటించిన నలుగురు అమ్మాయిలు ఎవరూ అమెరికన్లు కాకపోవడం విశేషం. వాళ్లు ఐర్లాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వాళ్ళు . మొదట మెగ్ పాత్ర కోసం ఎమ్మా స్టోన్‌ను అనుకున్నా, డేట్స్ కుదరకపోవడంతో ఆ ఛాన్స్ ఎమ్మా వాట్సన్‌కు దక్కింది. ఫ్లోరెన్స్ పగ్ నటించిన అమీ పాత్రకు, సిర్షా రోనన్ చేసిన జో పాత్రకు ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. కేవలం 40 మిలియన్ డాలర్లతో తీసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 218 మిలియన్ (800 కోట్లు) పైగా వసూలు చేసి పెద్ద హిట్ అయ్యింది.ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇది ఒక నలుగురు అక్కాచెల్లెళ్ల కథ. తండ్రి యుద్ధానికి వెళ్లడంతో ఇంట్లో తల్లితో కలిసి జో, మెగ్, అమీ, బెత్ అనే ఈ నలుగురు కూతుళ్ళు సరదాగా గడుపుతుంటారు. వీళ్లది కొంచెం పేద కుటుంబమే అయినా, ఎప్పుడూ ఏదో ఒక అల్లరితో ఇల్లు కలకలలాడుతుంటుంది. ముఖ్యంగా జో అనే అమ్మాయికి మొండితనం ఎక్కువ. తనేమో ఒక పెద్ద రైటర్ కావాలని కలలు కంటుంది. పక్కింటి కుర్రాడు లారీ వీళ్లతో కలిసి దోస్తీ చేస్తూ, ఆ జో వెనకాలే తిరుగుతుంటాడు. ఆ వయసులో వచ్చే చిన్న చిన్న గొడవలు, ప్రేమలు, అల్లరితో వాళ్ల బాల్యం సరదాగా సాగిపోతుంది.

పిల్లలంతా పెద్దయ్యాక ఎవరి దారి వారు చూసుకుంటారు. ఒకరు పెళ్లి చేసుకుంటే, ఇంకొకరు పెయింటింగ్ నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్తారు. జో మాత్రం తన కాళ్ల మీద తాను నిలబడాలని సిటీకి వెళ్లి కష్టపడుతుంటుంది. ఇంతలో ఇంట్లో ఒక చిన్న చెల్లికి ఒంట్లో బాలేకపోవడం, చనిపోవడం లాంటి సంఘటనలతో వీళ్లంతా మళ్లీ ఒక చోట చేరతారు. అప్పుడే వాళ్లకు అర్థమవుతుంది.. లైఫ్ అంటే కేవలం ఆటపాటలు మాత్రమే కాదు, ఎన్నో బాధలు, బాధ్యతలు కూడా ఉంటాయని. ప్రేమ విషయంలో కూడా కొన్ని మనస్పర్థలు వచ్చి లారీ, అమీలు దగ్గరవుతారు.

Advertisement

చివరికి తన సొంత జీవితాన్నే ఒక కథగా రాస్తుంది జో. పబ్లిషర్స్ మాత్రం కథలో హీరోయిన్ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడితే, కథ కోసం జో ఆ పాత్రకు పెళ్లి చేసి తన పుస్తకాన్ని సక్సెస్ చేసుకుంటుంది. కానీ నిజ జీవితంలో మాత్రం తను అనుకున్న గుర్తింపు తెచ్చుకుని, ఒక స్కూల్ పెట్టి తన కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. నలుగురు ఆడపిల్లలు తమ కష్టాలను దాటుకుని, ఎలా గెలిచారనేదే ఈ సినిమా చాలా అద్భుతంగా చూపిస్తుంది.

ఱెఅడ Also : పడకగదిలో చిచ్చు పెట్టిన మాయావి… ప్రేమించిన భార్యను కాదని మరో అమ్మాయి మోజులో భర్త… అన్నీ అలాంటి సీన్లే

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×