E-Paper
Advertisement

పడకగదిలో చిచ్చు పెట్టిన మాయావి… ప్రేమించిన భార్యను కాదని మరో అమ్మాయి మోజులో భర్త… అన్నీ అలాంటి సీన్లే

పడకగదిలో చిచ్చు పెట్టిన మాయావి… ప్రేమించిన భార్యను కాదని మరో అమ్మాయి మోజులో భర్త… అన్నీ అలాంటి సీన్లే
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా చూస్తుంటారు. అయితే కొన్ని రొమాంటిక్ సినిమాలను కొంతమందే చూడగలుగుతారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా. ఇది ప్రధానంగా ఫిలిప్పీన్స్‌లోని ఒక మత్స్యకారుల గ్రామం నేపథ్యంలో సాగుతుంది. అక్కడ ఆల్చిప్పలు ఏరుకుంటూ బతికే సామాన్యుల జీవితాలను, వాళ్ళ మధ్య ఉండే అక్రమ సంబంధాలను దర్శకుడు చాలా బోల్డ్‌గా చూపించాడు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు. ఒక పెళ్లయిన దంపతుల మధ్యకు మూడో వ్యక్తి వస్తే, ఆ అక్రమ సంబంధాల వల్ల కలిగే ఇబ్బందులను ఈ సినిమా చూపిస్తుంది.

వివామాక్స్ (Vivamax) ఓటీటీలో

2024లో వచ్చిన ఈ ఒక ఫిలిప్పీన్స్ రొమాంటిక్ మూవీ పేరు ‘పాలిపట్-లిపట్, పపాలిట్-పాలిట్’ (Palipat-Lipat, Papalit-Palit). ఒక చోట ఉండకుండా అటు ఇటు తిరగడం అని ఈ టైటిల్ అర్థం. అంటే మనుషుల మనసులు, కోరికలు ఒకే వ్యక్తి మీద ఉండకుండా ఎలా మారిపోతాయనేది ఈ సినిమా చూపిస్తుంది. ఇందులో విక్టర్ రెలోసా, డెనిస్ ఎస్టెబాన్ తమ పాత్రల్లో జీవించారని, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో వాళ్ళ నటన బాగుందని చెప్పుకుంటారు. ఇది వివామాక్స్ (Vivamax) ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లారీ, ఎడ్నా అని ఒక మొగుడు పెళ్లాం ఉంటారు. వాళ్లు ఎక్కడో పల్లెటూర్లో సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ హాయిగా బతుకుతుంటారు. ఒకరోజు లారీకి రోడ్డు మీద అమీ అనే ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి కనిపిస్తుంది. అయ్యో పాపం అని జాలిపడి, ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తాడు. అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. ఇంటికి వచ్చిన అమీ.. థాంక్స్ చెప్పి వెళ్ళిపోకుండా, మెల్లగా లారీ మీద కన్నేస్తుంది. తన అందచందాలతో వాడిని బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. లారీ కూడా ఆ పిల్లను చూసి లైన్ వేయడం మొదలుపెడతాడు. పెళ్లాం ఇంట్లోనే ఉన్నా సరే, దొంగచాటుగా వీళ్లిద్దరూ ఎంజాయ్ చేయడం, ఒకరికొకరు దగ్గరవ్వడం చూస్తుంటే ఎడ్నాకు మండుతుంది. చివరికి ఆ కొత్త పిల్ల వల్ల మొగుడు పెళ్లాం మధ్య గొడవలు ముదిరిపోతాయి. ప్రేమ ముఖ్యం అనుకున్న లారీ, కామంతో కళ్లు మూసుకుపోయి తప్పులు చేస్తాడు. ఆ కొత్త అమ్మాయి వీళ్ళ కాపురంలో ఎలా చిచ్చు పెట్టింది ? చివరికి ఆ మొగుడు పెళ్లాం విడిపోయారా ? కలిసి ఉన్నారా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : అక్క మొగుడు చెల్లితో సంసారం… హత్యతో ఉలిక్కిపడే ఫ్యామిలీ… ఓటీటీలో దూసుకెళ్తున్న థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

Big Stories

Advertisement
×