E-Paper
Advertisement

బృందావనం నదిలో పడవ ప్రమాదం.. 15 మంది మృతి, ఇన్‌స్టా రీల్ ఆ మహిళను కాపాడింది

బృందావనం నదిలో పడవ ప్రమాదం.. 15 మంది మృతి, ఇన్‌స్టా రీల్ ఆ మహిళను కాపాడింది
Advertisement

Boat Tragedy: సోషల్‌మీడియా వల్ల చెడు మాత్రమే కాదు.. మంచి కూడా ఉంటుంది. దాన్ని కొందరు మాత్రమే వినియోగించుకుంటారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న మహిళ ఒకరు. బోటు ప్రమాదం ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఘటన సమయంలో కేవలం ఇన్‌స్టా రీల్ ఓ మహిళను కాపాడింది. అదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

యూపీలోని యమునా నదిలో పడవ ప్రమాదం

Advertisement

సోషల్‌మీడియా ద్వారా చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటారు. అందులో మంచి-చెడు ఉంటాయి. దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కనిపిస్తున్న మహిళ అదే జరిగింది. ఫలితంగా బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని యమునా నదిలో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ఈ ఘటన బృందావనం ప్రాంత సమీపంలో జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పర్యాటకులు గల్లంతు అయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.

Advertisement

15 మంది పర్యాటకులు మృతి.. ఇన్‌స్టా రీల్ ఆ మహిళను కాపాడింది

ఘోరమైన పడవ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు డజనకు పైగా మృతదేహాలను వెలికితీశారు అధికారులు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. ఇది ముమ్మాటికీ నిజం.. రీల్ కాదు.. రియల్. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.  ఆమె మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ ఘటన నుంచి తాను ప్రాణాలతో బయటపడటానికి సోషల్ మీడియా వీడియోనే కారణమని తేల్చిచెప్పింది. వైరల్ అవుతున్న ఒక వీడియోలో బాధితురాలు తన అనుభవాన్ని వివరించింది. ఘటన సమయంలో తనకు ఈత రాకపోయినా గతంలో తను చూసిన సోషల్ మీడియా రీల్‌ని గుర్తు తెచ్చుకుంది.  నీటిలో ఏ మాత్రం కంగారు పడకుండా శ్వాసను బిగపట్టడం, ఆ తర్వాత నోరు ఓపెన్ చేయకుండా ఉండాలని పేర్కొంది.

ALSO READ: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 8 మంది మృతి, మరో 12 మందికి

శరీరాన్ని నిటారుగా ఉంచుతూ కాళ్లను నిరంతరం కదిలిస్తూ ఉండటం చేశానని తెలిపింది. గందరగోళం సమయంలో పడవకు చాలాసార్లు తన తలకు తగిలిందని ఆ మహిళ వెల్లడించింది. అంతలా దెబ్బ తగిలినా తాను భయపడలేదని, నీటిని పీల్చలేదని తెలియజేసింది. అదే తన ప్రాణాలను కాపాడటంలో కీలకమైందని అప్పటి క్షణాలను గుర్తు చేసుకుంది.

ఘటన తర్వాత రెస్క్యూ టీమ్ వచ్చే‌వరకు సుమారు 45 నిమిషాల పాటు ఆమె అలాగే ఉండి తన ప్రాణాలను కాపాడుకుంది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండి తనను తాను నిలదొక్కుకోవడానికి ఎలా సహాయ పడిందో గుర్తుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆ మహిళా వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×