E-Paper
Advertisement

Romantic Drama OTT: కావాల్సినప్పుడు కాంట్రాక్ట్ భార్యగా వచ్చే అమ్మాయి… జడ్జితో కూడా వదలకుండా…

Romantic Drama OTT: కావాల్సినప్పుడు కాంట్రాక్ట్ భార్యగా వచ్చే అమ్మాయి… జడ్జితో కూడా వదలకుండా…
Advertisement

Romantic Drama OTT : కొరియన్ సిరీస్ ల క్రేజ్ ఇప్పుడు వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా,ఈ రొమాంటిక్ సిరీస్ లు నడుస్తూనే ఉన్నాయి. ఇక అక్కడి నుంచి వచ్చిన ఒక రొమాంటిక్ సిరీస్ క్రేజీ కంటెంట్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు చేసుకునే ఒక అమ్మాయి చుట్టూ కథ ఉంటుంది. అయితే సిరీస్ మాత్రం చక్కగా, చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ట్రయాంగిల్ చుట్టూ తిరిగే ఈ సిరీస్ చూపు తిప్పుకోనివ్వదు. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

కొరియా రొమాంటిక్ కామెడీ సిరీస్ పేరు ‘లవ్ ఇన్ కాంట్రాక్ట్’ (Love in Contract). ఇది 2022లో వచ్చిన ఒక హిట్ సిరీస్. ఇందులో పార్క్ మిన్-యంగ్, గో క్యుంగ్-ప్యో, కిమ్ జే-యంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం 16 ఎపిసోడ్‌లతో ఈ కథ సాగుతుంది. ఈ సిరీస్ Amazon Prime Video, Netflix, Rakuten Viki ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లో కూడా ఇది స్ట్రీమింగ్ లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరోయిన్ చోయ్ సాంగ్-యున్ ఒక బిజినెస్ మైండ్‌ ఉన్న అమ్మాయి. ఈమె పని ఏంటంటే.. ఎవరికైనా ఫంక్షన్లకో, చుట్టాలకో చూపించుకోవడానికి పెళ్ళాం కావాలంటే, ఈమెతో అగ్రిమెంట్ రాసుకోవాలి. అంటే ఈమె ఒక ప్రొఫెషనల్ పెళ్ళాం అన్నమాట. డబ్బులు తీసుకుని, చెప్పిన టైంకి వచ్చి భార్యలా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతుంది. అసలు పెళ్లి గొడవ వద్దు అనుకునే వాళ్లకి ఈమె ఒక వరం లాంటిది. సోమవారం ఒకడు.. మంగళవారం ఇంకొకడు ఇలా నడిచిపోతుంటుంది. అయితే ఈమె లైఫ్‌లోకి ఇద్దరు కస్టమర్లు రావడంతో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.

ఒకడు జంగ్ జి-హో, వీడు పరమ సీరియస్ టైపు, అస్సలు మాట్లాడడు. ఐదేళ్లుగా సోమ, బుధ, శుక్రవారాల్లో ఈమె వీడికి కాంట్రాక్ట్ పెళ్ళాం. కట్ చేస్తే.. మంగళ, గురు, శనివారాల కోటాలో కాంగ్ హే-జిన్ అనే ఒక పెద్ద సినిమా స్టార్ ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో హీరోయిన్ నలిగిపోతూ, ఎవరికీ దొరక్కుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ ప్రొఫెషనల్‌గా ఉండే హీరోయిన్, మెల్లగా ఆ సీరియస్ గా ఉండే జంగ్ జి-హో మీద మనసు పారేసుకుంటుంది. అటు పక్క ఆ సినిమా స్టార్‌గాడు కూడా ఈమెని లైన్లో పెట్టాలని చూస్తుంటాడు. ఈ ముక్కోణపు ప్రేమాయణం మధ్యలో హీరోయిన్ నిజమైన ప్రేమని ఎలా గెలుచుకుంది? ఆ కాంట్రాక్ట్ గోడవలన్నీ ఎలా సెటిల్ అయ్యాయి? అనేదే ఈ రొమాంటిక్ కామెడీ కథ.

Advertisement

Read Also : సముద్రంలో కుప్పలు తెప్పలుగా తేలియాడే శవాలు… ఒళ్ళు గగుర్పొడిచే వార్ డ్రామా

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×