E-Paper
Advertisement

Romantic Drama Series OTT: మదర్ బెస్ట్ ఫ్రెండ్ కూతురితో ప్రేమలో… స్నేహితుడితోనే ప్రేమ పాఠాలు… పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్

Romantic Drama Series OTT: మదర్ బెస్ట్ ఫ్రెండ్ కూతురితో ప్రేమలో…  స్నేహితుడితోనే ప్రేమ పాఠాలు… పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్
Advertisement

Romantic Drama Series OTT : ఒక చూడచక్కని సిరీస్ ని చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మిస్ అవ్వద్దు. ఎందుకంటే దీనిని చూస్తున్నంత సేపు మన పక్క ఇంట్లో, లేదా మన లైఫ్ లో జరిగినట్లు ఫీలింగ్ వస్తుంది. మన ఊరి భాషలో చెప్పాలంటే, అమ్మల గొడవలు, పిల్లల ప్రేమలు కలిపిన పక్కా ఫ్యామిలీ ప్యాకేజీ ఇది. ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా విపరీతంగా ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారు. అలాగే సరదాగా కూడా ఉంటుంది ఈ సిరీస్. ఈ డ్రామా కేవలం ప్రేమ కథే కాకుండా, కెరీర్, కుటుంబ బంధాలు, స్నేహం గురించి చాలా చక్కగా చూపిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ రొమాంటిక్ కొరియన్ సిరీస్ పేరు ‘లవ్ నెక్స్ట్ డోర్’ (Love Next Door). యూ జే-వోన్ దర్శకత్వంలో ఇది 2024లో వచ్చిన ఒక పాపులర్ సిరీస్. ఇందులో జంగ్ హే-ఇన్, జంగ్ సో-మిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 16 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. ఈ సీరీస్ మీద మొదటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైన కొత్తలోనే ఇది గ్లోబల్ టాప్ 10 లో చోటు సంపాదించుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరో, హీరోయిన్ ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకే వీధిలో పెరిగిన దోస్తులు. వీళ్ళ అమ్మలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో, వీళ్లిద్దరూ కలిసి ఆడుకుంటూ, కొట్టుకుంటూ పెరిగారు. హీరో ఇప్పుడు ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అయ్యి మంచి పేరు సంపాదిస్తే, హీరోయిన్ మాత్రం అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిపోతుంది. కానీ అక్కడ ఏదో తేడా కొట్టి, తన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుని సడన్‌గా తన ఊరికి తిరిగొస్తుంది. హీరోయిన్ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ రచ్చ రచ్చ చేస్తుంది. అమెరికాలో అంత మంచి సంబంధం, ఉద్యోగం వదిలేసి ఎందుకు వచ్చావని అందరూ తనని సూటిపోటి మాటలు అంటుంటే, హీరో మాత్రం ఆమెకు తోడుగా ఉంటాడు.

కథ సగంలో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడుతుంది. హీరోయిన్ అమెరికాలో ఉన్నప్పుడు ఆమెకు క్యాన్సర్ వచ్చిందని, ఆపరేషన్ చేయించుకుని ఆ బాధను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగానే భరించిందని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి వాళ్ల అమ్మ, నాన్న కుప్పకూలిపోతారు. అప్పుడే హీరోకి తన మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది. తను చిన్నప్పటి నుండి ఆమెనే ఇష్టపడుతున్నానని, కానీ చెప్పలేక దాచుకున్నానని బయటపెడతాడు. హీరోయిన్ కూడా నాకు ఈ రోగం ఉంది కదా, నీ జీవితం ఎందుకు పాడు చేయడమని దూరంగా ఉన్నానని చెప్తుంది. దీంతో ఆమె చుట్టూ తిరుగుతూ, మళ్ళీ ఆమె ముఖంలో నవ్వు తెప్పిస్తాడు హీరో.

Advertisement

ఇక హీరోయిన్ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వద్దని పక్కన పెట్టేసి, తనకి ఇష్టమైన షెఫ్ కావాలని కలలు కంటుంది. మరోవైపు హీరో తన ఆర్కిటెక్ట్ ఆఫీసులో బిజీగా ఉంటూనే, హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. చివరికి హీరో, హీరోయిన్ల పెళ్లి ముచ్చటతో ఈ సీరీస్ ఒక మంచి ఫీల్ గుడ్ తో ముగుస్తుంది.

Read Also :  దేవుడి కోరికను తీర్చే మనిషి… ఓటీటీలోకి మలయాళ ఫాంటసీ డ్రామా… ఎక్కడ చూడచ్చు అంటే

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×