E-Paper
Advertisement

Fantasy Drama OTT : దేవుడి కోరికను తీర్చే మనిషి… ఓటీటీలోకి మలయాళ ఫాంటసీ డ్రామా… ఎక్కడ చూడచ్చు అంటే

Fantasy Drama OTT : దేవుడి కోరికను తీర్చే మనిషి… ఓటీటీలోకి మలయాళ ఫాంటసీ డ్రామా… ఎక్కడ చూడచ్చు అంటే
Advertisement

Fantasy Drama OTT : సైజు కురుప్ గత ఏడాది నటించిన మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరచిన ఈ సినిమా, థియేటర్లలో విడుదలైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ వారం వరకు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఉన్నట్టుండి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే, దీనిని ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేందుకు మంచి ఆప్షన్. ఎందుకంటే స్టోరీ హింస, రొమాన్స్ లాంటి సీన్స్ లేకుండా, ఒక రోడ్ ట్రిప్ లా సాగుతుంది.

మనోరమ మాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్ 

ఫెబి జార్జ్ దర్శకత్వం వహించిన ‘రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్’ (Written & Directed by God) 2025 జూన్ 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సైజు కురుప్, సన్నీ వేన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. షాన్ రెహమాన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా 2026 మార్చి 20 నుంచి మనోరమ మాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ మలయాళ చిత్రం కేవలం ఇంగ్లీష్ సబ్-టైటిల్స్‌తో ఒరిజినల్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు ఆడియన్స్ కు ఇది నిరాశపరిచే విషయమే.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జిజో అనే ఒక యువకుడు పెద్ద డైరెక్టర్ అయిపోదామని తెగ ఆశపడతాడు. కానీ పాపం అతను తీసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అవుతాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు, అప్పులవాళ్ల గోల ఎక్కువైపోయింది. విసిగిపోయిన జిజో, అసలు నీకు కళ్లు ఉన్నాయా? నా బతుకు ఎందుకు ఇలా చేసావు? అని ఆకాశం వైపు చూసి దేవుడిని నోటికొచ్చినట్టు తిడతాడు. అతని బాధను భరించలేక సాక్షాత్తూ ఆ దేవుడే (సన్నీ వేన్) మనిషి రూపంలో కిందకి దిగి వస్తాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దేవుడు జిజో కష్టాలు తీర్చడానికి రాలేదు, రివర్స్‌లో జిజో సాయం కోరతాడు. నాకు కూడా ఒక చిన్న కోరిక ఉంది, అది నువ్వే తీర్చాలని కండిషన్ పెడతాడు. ఇక చేసేదేం లేక, జిజో ఆ దేవుడిని తన బైక్ మీద ఎక్కించుకుని ఒక రోడ్ ట్రిప్‌కి బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో దేవుడితో కలిసి తిరుగుతున్నప్పుడు జిజోకి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. చివరికి ఆ దేవుడి కోరిక ఏంటి? ఈ డైరెక్టర్ దేవుని కోరికను తీర్చాడా ? అనే విషయాను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also :  భార్యను దెయ్యానికి తాకట్టు… రాత్రయితే రగడ… వణికిస్తున్న ఒక్కో సీన్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×