E-Paper
Advertisement

Romantic Drama OTT : పదేళ్ళ తరువాత లవర్ కోసం వస్తే… మూగ భర్తతో షాక్ ఇచ్చే అమ్మాయి… గుండెను బరువెక్కించే కథ

Romantic Drama OTT : పదేళ్ళ తరువాత లవర్ కోసం వస్తే… మూగ భర్తతో షాక్ ఇచ్చే అమ్మాయి… గుండెను బరువెక్కించే కథ
Advertisement

Romantic Drama OTT : గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇది చైనీస్ సినిమాల్లో క్లాసిక్ లవ్ స్టోరీల్లో ఒకటిగా పేరు పొందింది. ఇది చాలా ఎమోషనల్ గా సాగే ఒక హార్ట్ టచింగ్ స్టోరీ. గ్రామీణ జీవితం రియలిస్టిక్‌గా చూపించారు ఇందులో. పదేళ్ల తర్వాత తన సొంత గ్రామానికి తిరిగి వచ్చిన ఒక యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ తన చిన్ననాటి ప్రేయసిని కలిశాక స్టోరీ మారిపోతుంది. ప్రేక్షకులు కూడా ఆ ఎమోషన్ తో వచ్చే ఫీలింగ్స్ ని అలానే చూస్తూ ఉండిపోతారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2003లో వచ్చిన ఈ చైనీస్ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘నువన్’ (Nuan). హువో జియాంకీ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. 1 గంట 46 నిమిషాల ఈ సినిమా IMDbలో 7.6/10 రేటింగ్ ను పొందింది. ఈ చిత్రం 16వ టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. ఇది ప్రసిద్ధ రచయిత మో యాన్ రాసిన “ది వైట్ డాగ్ అండ్ ది స్వింగ్” అనే కథ ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా mubi, plex లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లిన్ జింగే అనే యువకుడు పదేళ్ల పాటు సిటీ లో చదువుకుని, ఉద్యోగం చేస్తూ తన సొంత గ్రామానికి తిరిగి వస్తాడు. అక్కడ తన చిన్ననాటి ప్రేయసి నువాన్ను కలుస్తాడు. గతంలో నువాన్ ఆ గ్రామంలోనే అత్యంత అందమైన అమ్మాయిగా ఉండేది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు కూడా. కానీ ఒక ప్రమాదంలో నువాన్ కాలుకి గాయమై ఆమె కుంటిది అవుతుంది. ఆ సమయంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన లిన్, నగరం వెళ్ళాక ఆమెను మర్చిపోయి తన జీవితంలో బిజీ అయిపోతాడు.

ఇప్పుడు తిరిగి వచ్చిన లిన్ కు నువాన్ ఒక మూగవాడిని పెళ్లి చేసుకుని, ఒక కూతురితో కలిసి పేదరికంలో బతుకుతున్నట్లు తెలుస్తుంది. తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకు లిన్ తీవ్రమైన పశ్చాత్తాపానికి గురవుతాడు. చివరకు ఆమె జీవితాన్ని చూసి లిన్ ఏవిధంగా స్పందిస్తాడు ? తను చేసిన తప్పును ఎలా సరిదిద్దుకుంటాడు అనేదే మిగతా కథ.

Advertisement

Read Also :  అయ్యబాబోయ్… సైబర్ క్రైమ్స్ ఇలా జరుగుతాయా ? ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×