E-Paper
Advertisement

AC Service Expense: ఏసి సర్వీస్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? క్లీనింగ్, గ్యాస్ ఫిల్లింగ్, రిపేర్ల కోసం ఎంత చెల్లించాలంటే

AC Service Expense: ఏసి సర్వీస్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? క్లీనింగ్, గ్యాస్ ఫిల్లింగ్, రిపేర్ల కోసం ఎంత చెల్లించాలంటే
Advertisement

AC Service Expense| దేశంలో వేసవి ప్రారంభమైపోయింది. ఇంట్లో, ఆఫీసుల్లో AC వినియోగించాల్సిన అవసరం వచ్చింది. AC సరిగ్గా పనిచేయాలంటే రెగ్యులర్‌గా సర్వీస్ చేయించడం చాలా అవసరం. దీనివల్ల కూలింగ్ బాగుంటుంది, కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది, అంతేకాకుండా ఆకస్మిక బ్రేక్‌డౌన్‌లు అంటే ఏసీ ఒక్కసారిగా పనిచేయకపోవడం లాంటిది జరగదు.

స్ప్లిట్ AC సర్వీస్ ఖర్చు ఎంత?

స్ప్లిట్ AC (Split AC)లో ఇన్‌డోర్, అవుట్‌డోర్ యూనిట్లు ఉంటాయి.
ఇందులో బేసిక్ సర్వీస్ (ఇన్‌స్పెక్షన్, ఫిల్టర్ క్లీనింగ్) కోసం రూ.500 నుంచి రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
డీప్ క్లీనింగ్ (జెట్ వాషింగ్) చేస్తే రూ.900 నుంచి రూ.1,500 వరకు అవుతుంది.
కూలింగ్ కాయిల్ క్లీనింగ్ రూ.700-రూ.1,200.
డ్రైన్ పైప్ క్లీనింగ్ రూ.200-రూ.500.
గ్యాస్ రీఫిల్ రూ.2,000-రూ.3,500 వరకు ఉంటుంది.
పూర్తి డీప్ క్లీనింగ్ ప్యాకేజీ రూ.2,000-రూ.2,500 మధ్య ఉంటుంది.

విండో AC సర్వీస్ ఖర్చు ఎంత?

Advertisement

విండో ACలో అన్ని భాగాలు ఒకే యూనిట్‌లో ఉంటాయి. సర్వీస్ సులభంగా తక్కువ సమయంలో అయిపోతుంది.
దీని బేసిక్ సర్వీస్ ఖర్చు రూ.400-రూ.700.
డీప్ క్లీనింగ్ రూ.700-రూ.1,200.
కూలింగ్ కాయిల్ క్లీనింగ్ బిల్ రూ.500-రూ.900. గ్యాస్ రీఫిల్ రూ.1,800-రూ.3,000.
పూర్తి సర్వీస్ ప్యాకేజీ (గ్యాస్ లేకుండా) రూ.1,500-రూ.1,800 వరకు ఉంటుంది.

AC గ్యాస్ రీఫిల్ ధరలు

గ్యాస్ తక్కువైతే కూలింగ్ సరిగా రాదు. లీక్ అయితే రీఫిల్ చేయాలి.
R22 గ్యాస్ రీఫిల్ ధర రూ.1,800-రూ.2,500.
R410A గ్యాస్ రూ.2,500-రూ.3,500.
R32 గ్యాస్ రూ.2,500-రూ.3,800 వరకు ఉంటుంది. AC కెపాసిటీ, సర్వీస్ చేసే ప్రాంతం (మీ నగరం) బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ఫిల్టర్ క్లీనింగ్ ఖర్చు

Advertisement

ఫిల్టర్లు దుమ్ము పేరుకుపోతాయి. దీనివల్ల కూలింగ్ తగ్గుతుంది, విద్యుత్ ఎక్కువ వాడుతుంది. ప్రొఫెషనల్ ఫిల్టర్ క్లీనింగ్ రూ.200-రూ.400. ఫిల్టర్ మార్చేందుకు రూ.500-రూ.1,200 వరకు ఖర్చు అవుతుంది. ఇంట్లోనే 2-3 వారాలకోసారి శుభ్రం చేస్తే మంచిది.

సాధారణ AC రిపేర్ ఖర్చులు

సర్వీస్ సమయంలో సమస్యలు కనిపిస్తే రిపేర్ చేయాలి. PCB బోర్డ్ రిపేర్ రూ.2,000-రూ.5,000. కెపాసిటర్ మార్చడానికి రూ.300-రూ.900 అవుతుంది. ఫ్యాన్ మోటార్ రూ.1,500-రూ.3,000. కంప్రెసర్ రిపేర్ చేయడానికి రూ.5,000-రూ.12,000 వరకు ఉంటుంది. బ్రాండ్, మోడల్ బట్టి ధరలు మారతాయి.

సర్వీస్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తలు

సర్వీస్ మొదలు పెట్టే ముందు పూర్తి ధర గురించి తెలుసుకోండి. అధికారిక సర్వీస్ సెంటర్ లేదా మంచి రివ్యూలు ఉన్న టెక్నీషియన్‌ని ఎంచుకోండి. గ్యాస్ లీక్ లేకపోతే రీఫిల్ చేయవద్దు. వేసవిలో ఫిల్టర్లను ఇంట్లోనే శుభ్రం చేయండి.

Also Read: చదవగానే డెలీట్ అయిపోయే రహస్య జిమెయిల్.. పాస్‌కోడ్‌తో సురక్షితంగా ఇలా పంపించండి

రెగ్యులర్ సర్వీస్ ఎందుకు ముఖ్యం?

ACలో దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీనివల్ల కూలింగ్ తగ్గుతుంది, విద్యుత్ ఎక్కువ వినియోగమవుతుంది. విడి భాగాలు దెబ్బతింటాయి. సంవత్సరానికి 1-2 సార్లు సర్వీస్ చేయించుకోండి. వేసవి ప్రారంభమయ్యేముందు సర్వీస్ చేస్తే ఎండలు తీవ్రంగా ఉన్నసమయంలో ఇంట్లో చల్లని వాతావరణం ఉంటుంది. ఇలా చేస్తే AC ఎక్కువ కాలం పాటు బాగా పనిచేస్తుంది, భారీ రిపేర్ ఖర్చులు తప్పుతాయి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియచేసిన ఖర్చు వివరాలు, సర్వీస్ చేసే కంపెనీపై ఆధారపడి ఉంటాయి. సర్వీస్, రిపేర్ ఖర్చుల బిల్‌లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. సర్వీస్ చేయించుకునే ముందు అంతా పరిశీలించండి. రిపేర్ ఖర్చు కచ్చితత్వంపై ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×