Romantic Drama OTT : చదువు, ఉద్యోగం కాగానే ప్రతీ ఇంట్లో జరిగే చర్చ పెళ్లి గురించే. అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లెప్పుడు అని ఇరుగు పొరుగు అడుగుతూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు అంటూ తొందర పెడతారు. ఇలాంటి సిట్యుయేషన్ నుంచి బయట పడడానికి ఓ జంట ఏం చేసిందనే స్టోరీతో తెరకెక్కిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ కథ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘వెడ్డింగ్ సీజన్’ (Wedding Season). ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా 2022 ఆగస్టు 4న స్ట్రీమింగ్ కి వచ్చింది. టామ్ డే దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతీయ-అమెరికన్ కుటుంబాల నేపథ్యంలో సాగే కామెడీ ప్రేమకథ. ప్రధాన పాత్రల్లో పల్లవి శార్దా (ఆషా), సూరజ్ శర్మా (రవి) నటించారు. రిజ్వాన్ మంజీ, వీనా సూద్, సీన్ క్లీయర్, అర్జున్ మన్హాస్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బడ్జెట్ సుమారు 5 మిలియన్ డాలర్లే. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో భారీ సంఖ్యలో వీక్షకులను ఆకర్షించింది. థియేటర్లలో విడుదల కాలేదు, కానీ ఓటీటీలో మాత్రం అదరగొట్టింది. IMDbలో 6.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 99 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను వీక్షించవచ్చు. రిలీజ్ అయిన మొదటి వారంలో 25 మిలియన్ గంటల వ్యూవర్‌షిప్ తో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లోకి వచ్చింది. పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో నామినేషన్ (బెస్ట్ రొమాంటిక్ కామెడీ), NAACP ఇమేజ్ అవార్డ్స్‌లో బెస్ట్ మల్టీకల్చరల్ మూవీ నామినేషన్ ను దక్కించుకుంది ఈ మూవీ. వెడ్డింగ్ సీజన్ సినిమా రిలాక్స్‌డ్ మూడ్‌లో చూడటానికి పర్ఫెక్ట్.
Also Read : డిప్రెషన్ లో ఉన్నవాళ్లకు హ్యాపీనెస్ తెచ్చే మూవీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు
కథ న్యూజెర్సీలోని భారతీయ-అమెరికన్ కుటుంబాలలో సాగుతుంది. ఆషా (పల్లవి శార్దా) అనే అమ్మాయి ఇందులో హీరోయిన్. ఆమెను తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఆమె తల్లి సుమ (రిజ్వాన్ మంజీ) ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఆషా తన ఉద్యోగం, కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటుంది. అదే సమయంలో రవి (సూరజ్ శర్మా) కూడా తన తల్లిదండ్రుల ఒత్తిడికి గురవుతాడు. వాళ్లిద్దరూ ఒక పార్టీలో కలుసుకుని, తమ సమస్యలు చర్చిస్తారు. అప్పుడు వాళ్లు ఒక ప్లాన్ చేసుకుంటారు.
“ఫేక్ డేటింగ్” ప్లాన్ చేస్తారు. అంటే వాళ్లు నటిస్తూ, తమ తల్లిదండ్రులను మోసం చేసి, వెడ్డింగ్ సీజన్ లో కలిసి ఉంటారు. వెడ్డింగ్ పార్టీలు, డ్యాన్స్, కుటుంబ గొడవలతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ క్రమంలోనే ఆషా, రవి మధ్య స్నేహం మొదలవుతుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. కానీ వాళ్ల తల్లిదండ్రులు వేర్వేరు సంబంధాలు చూడటం వల్ల సమస్యలు వస్తాయి. చివరికి వాళ్లు తమ ప్రేమను ఒప్పుకుని, కుటుంబాలను ఒప్పించి, పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. మరి ఆ తరువాత ఏం జరిగింది ? అన్నది కథ.