E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి పై అవనికి అనుమానం.. పల్లవి దొరికిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి పై అవనికి అనుమానం.. పల్లవి దొరికిపోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode February 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి కావాలని మీనాక్షిని అవమానించేలా మాట్లాడాలా ప్లాన్ చేస్తుంది. అక్కడున్న ముత్తైదులతో మాట్లాడి మీనాక్షిని ఎలాగైనా సరే అవమానం ఎలా చేయాలని అనుకుంటుంది. అయితే మీనాక్షి బొట్టు పెట్ట పోతుంటే నువ్వు శ్రియకి బొట్టు పెడితే నీలాగే తయారవ్వాలని అనుకుంటున్నావా? నీకు భర్త లేడు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని అక్కడున్న ఓ మహిళ అంటుంది.. నీ కూతురు కంటే భర్త ఉన్నాడు కాబట్టి ఆమె ఏదైనా చేయొచ్చు.. కానీ నీకు భర్త ఎవరో కూడా తెలియదు నువ్వెలా గర్భవతికి బొట్టు పెడతావు అని అందరూ నిందిస్తారు. భర్త ఎవరో తెలియని నువ్వు ఇలాంటి ఫంక్షన్లకు రావడం కూడా తప్పే అది నువ్వు గుర్తుపెట్టుకోవా? అని అక్కడున్న వాళ్ళు దారుణంగా మాట్లాడడంతో.. మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది..

అందరూ తలా ఒక మాట మాట్లాడుతుంటే.. భానుమతి కూడా మా ఇంట్లో ఇలాంటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు రావద్దు అని చెప్పాను కదా.. మరి ఎందుకు వచ్చావు అని అరుస్తుంది.. ఇంట్లో మీనాక్షి వల్ల పెద్ద గొడవ జరుగుతుంది. ఇది మొత్తానికి ఫంక్షన్ని పూర్తి చేసేస్తారు. మీనాక్షి మాత్రం నేను రానా అని అనుకున్నాను కాకపోతే నువ్వు రమ్మని చెప్పావ్ కాబట్టి వచ్చాను అని అంటుంది. ఇక ఇంటికి అమ్మను ఎప్పటికీ తీసుకురాను అక్క అని భరత్ మీనాక్షి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మా నాన్న నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరు ఇలా బాధపడితే ఎలా అండి అని అవని అడుగుతుంది. ఎంత ధైర్యంగా ఉండాలని చూసినా కూడా మా నాన్నని ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది అని అంటాడు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కుంగిపోతూ ఉంటే మావయ్య గారు ఇంకెలా ఉంటారు అని అవని ఎంత చెప్తున్నా సరే అక్షయ మాత్రం తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఇక అవని కూడా మా మామయ్య గారి నీలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

వీరిద్దరూ రాజేంద్రప్రసాద్ దగ్గర ఏడుస్తూ ఉండడం చూసినా కమల్ మీరు ఇలా ఏడిస్తే నాన్న ఇంకా బాధపడతారు. నాన్నని సంతోషంగా ఉంచాలని డాక్టర్ చెప్పారు కదా మీరు ఇంకొకసారి ఇలా ఏడవద్దు అని అంటాడు.. ఇక తర్వాత పల్లవి నీ రాజేంద్రప్రసాద్ అనుమానంగా చూడడంతో అవనికి పల్లవి పై అనుమానం మొదలవుతుంది. ఏంటి మావయ్య గారు పల్లవిని అదోలా చూస్తున్నాడు. కోపంగా చూస్తున్నాడు కదా పల్లవి పై ఏదైనా సీరియస్ గా ఉన్నాడా..? ఫంక్షన్ లో కూడా పల్లవి ఏదో మావయ్య గారితో సీరియస్గా మాట్లాడింది. పల్లవి పై మావయ్య చాలా సీరియస్ గా ఉన్నాడు. మామయ్యకి ఇలా జరగడానికి కారణం పల్లవిని అయి ఉంటుందా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అవని అనుకుంటుంది.

Advertisement

ఆ తర్వాత పల్లవి ఈ ముసలోడు ఏంది నన్ను చూస్తున్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉదయం లేవగానే కమల్ రాజేంద్రను బయటకు తీసుకురావడం చూసిన పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎలా ఉన్న మనిషి ఎలా తయారయ్యాడు మీరు ఆయనని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వీళ్ళందర్నీ చూసిన భానుమతి అక్కడికి వచ్చి అందరూ దిష్టి పెట్టి ఉంటారు నేను దిష్టి తీస్తాను అని అంటుంది. అవును అమ్మమ్మ గారు మీరు చెప్పింది నిజమే ఎవరో ఈ ఇంటికి దిష్టి పెట్టినట్లు ఉన్నారు నేను ఒక భూత వైద్యంతో మాట్లాడినాను.. మీరు ఒప్పుకుంటే అతన్ని ఇక్కడికి పిలుస్తాను అని అంటుంది..

సరే అతనిని నువ్వు తీసుకురావే ఇంకా ఆలస్యం ఎందుకు? ఏమైనా జరిగిందేమో అలాంటివి చేస్తే పోతాయని భానుమతి అంటుంది. పార్వతి కూడా అవనికి సపోర్ట్ చేయడంతో అవని ఒక భూత వైద్యుణ్ని రమ్మని పిలుస్తుంది. అతని ఎంట్రీ మామూలుగా ఉండదు.. ఎపిసోడ్ మొత్తానికి అతని హైలెట్ అవుతాడు. అతన్ని చూసిన మొదట ఎవ్వరూ కూడా అతని గురించి నమ్మరు.. ఆ తర్వాత అతను మీరేం అడిగితే అది చెప్తాను అని చెప్పడంతో నమ్ముతారు. కమల్ భానుమతిలను మీరు ఏదైనా సందేహాలు ఉంటే టెస్ట్ చేసుకోండి అని అతను చెప్తాడు.. అతను భానుమతికి అలాగే కమల్ కి అన్ని నిజాలు చెప్పడంతో మిమ్మల్ని నమ్ముతున్నాము పూజ మొదలు పెట్టండి అని వాళ్ళు అంటారు..

Also Read :శుక్రవారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. తెలుగులో ఒక్క మూవీ లేదా..?

శ్రేయ మాత్రం అతను ఏంటి ఇలా ఉన్నాడు అని నమ్మదు. అతను మాత్రం మీకు నా గురించి నమ్మకం లేదు కదా మీకు దిష్టి తీస్తాను అది నిజమే అని నమ్ముతారా లేదా అని అంటుంది. చివరికి ఆ నిమ్మకాయల వల్ల అతని శ్రియ కూడా నమ్ముతుంది. ఇక ఇంట్లోని వాళ్ళందరూ పూజ చేసి మా రాజేంద్రకి ఏదైనా దోషం ఉంటే పోయేలా చేయండి అని అంటారు. అయినా పూజలు చేసి అందరి చేత నిమ్మకాయలు కట్ చేస్తాడు. ఆఖరిన పల్లవి నిమ్మకాయని ఇవ్వబోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Big Stories

Advertisement
×