E-Paper
Advertisement

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు
Advertisement

Amaravati: ఏపీ మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు. ‘కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు పేరుతో సమావేశాలు ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు.

కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ 

Advertisement

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు అధికారులతో సమావేశాలు, మరోవైపు కూటమిలోని మిత్రులతో భేటీ, ఇంకోవైపు రాష్ట్రానికి వచ్చే అతిధులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు చూస్తూనే యాక్టివ్‌గా ఉన్నారు మంత్రి నారా లోకేష్. కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమేకాదు.. నేతల కుటుంబాలతో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 నుంచి మార్చి 7 వరకు రోజుకో జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ సమావేశాలు మొదలుపెట్టారు. తొలి సమావేశం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వారి వారి కుటుంబసభ్యులతో జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులను పేరు పేరునా పలకరించి ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు.

Advertisement

అమరావతిలో ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

కేవలం విందుకు పరిమితం కాలేదు. ఎమ్మెల్యేల పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ చదువుతున్నారు? అనే విషయాలను తెలుసుకున్నారు. రాజకీయాల చర్చలకు ఏమాత్రం తావులేకుండా కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగా నిర్వహించారు. నియోజకవర్గాల్లోని సమస్యలపై ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించారు.

గతంలో వారు ఇచ్చిన వినతులను నివేదిక రూపంలో వారికి అందజేశారు. అందులో ఎన్ని పరిష్కరించారు? కొన్ని ఏయే దశల్లో ఉన్నాయి? పరిష్కారం లేకపోతే కారణాలేంటి? ఆ నివేదికలో ఉన్నాయి.  డిన్నర్ భేటీలకు వచ్చిన ఇంటి ఆడపడుచులకు లోకేశ్ మంగళగిరి పట్టు చీరలను అందజేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఆత్మీయ కలయిక తనలో సంతోషాన్ని నింపిందంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు మంత్రి లోకేష్.

ALSO READ:  శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

రాజకీయ చర్చలకు తావులేకుండా కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగా నిర్వహించారు. అందులో ఎన్ని పరిష్కరించారు? కొన్ని ఏయే దశల్లో ఉన్నాయి? పరిష్కారం లేకపోతే కారణాలేంటి? ఆ నివేదికలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ప్రజాప్రతినిధులు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ, కాగిత కృష్ణప్రసాద్, బుద్ధప్రసాద్, కుమార్‌రాజా, బోడే ప్రసాద్, జీవీ ఆంజనేయులు వారి వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీ బాలశౌరి, అమెరికా పర్యటనలో ఉండడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

 

Related News

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

Big Stories

Advertisement
×