E-Paper
Advertisement

హైస్కూల్ డేస్ నుంచి పెళ్లి వరకు… చూసే కొద్దీ చూడాలనిపించే సిరీస్… ఐయండిబిలో 8.5 రేటింగ్

హైస్కూల్ డేస్ నుంచి పెళ్లి వరకు… చూసే కొద్దీ చూడాలనిపించే సిరీస్… ఐయండిబిలో 8.5 రేటింగ్
Advertisement

Romantic Drama OTT : కొరియన్ డ్రామాలు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయాయి. ఎక్కడ చూసినా వీటి గోలే ఎక్కువగా ఉంది. అయితే చైనీస్ సిరీస్ లు కూడా మంచి కంటెంట్ తో వస్తున్నాయి. ఇవి ఓటీటీలో సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సిరీస్ చైనాలోనే కాకుండా చాలా దేశాలలో ట్రెండింగ్ లో నిలిచింది. దీనికి ఐయండిబిలో 8.5 రేటింగ్ కూడా ఉందంటే సిరీస్ ఏ మాత్రం ఉంటుందో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ డ్రామాకి ఉన్న క్రేజ్ ఏంటంటే, ఇందులో అనవసరమైన విలన్లు, ఏడుపుగొట్టు సీన్లు ఉండవు. కేవలం స్కూల్ రోజుల్లో ఉండే స్వచ్ఛమైన స్నేహం, ఆ వయసులో పుట్టే చిన్నపాటి ప్రేమల చుట్టూ చాలా పాజిటివ్‌గా సాగుతుంది. అందుకే యువతకు ఈ సిరీస్ బాగా నచ్చింది.ముఖ్యంగా షూటింగ్ లో వాడిన లొకేషన్లు, ఆ స్కూల్ వాతావరణం చాలా కలర్‌ఫుల్‌గా, కళ్ళకు హాయిగా అనిపిస్తాయి.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ చైనీస్ రొమాంటిక్ డ్రామా పేరు ‘వెన్ ఐ ఫ్లై టువర్డ్స్ యు’ (When I Fly Towards You). ఈ సిరీస్ చైనాలో 2023 జూన్ 13న విడుదలైంది. ఇది “షీ ఈజ్ ఏ లిటిల్ క్రేజీ” అనే నవల ఆధారంగా తీశారు. ఇందులో మొత్తం 24 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కోటి అరగంట సేపు ఉంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో ఝౌ యిరాన్ తన సీరియస్ లుక్ తో, హీరోయిన్ ఝాంగ్ మియావోయి తన అమాయకపు అల్లరితో అదరగొట్టేశారు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసి చాలా మంది వీళ్ళు నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అనుకున్నారు. ఈ సిరీస్ సక్సెస్ వల్ల వీరికి చైనాలోనే కాకుండా మన ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సు జైజై అనే ఒక చురుకైన పిల్ల కొత్తగా ఊళ్లోని హైస్కూల్‌కు వస్తుంది. అక్కడ జాంగ్ అనే ఒక అబ్బాయిని చూసి పడిపోతుంది. ఆ కుర్రాడు భలే అందంగా ఉంటాడు కానీ ఎవరితోనూ కలవడు, ఎప్పుడూ పుస్తకాల్లో మునిగి తేలుతుంటాడు. అతనికి ఇంట్లో వాళ్ళ పోరు, చదువుల టెన్షన్ ఎక్కువ. కానీ ఈ పిల్ల మాత్రం వదిలిపెట్టదు, అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ, తన వైపు తిప్పుకోవడానికి నానా తంటాలు పడుతుంది. స్టోరీ నడిచే కొద్దీ మెల్లగా ఇద్దరూ దోస్తులవుతారు. ఇక వీళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు బ్యాచ్ కూడా ఉంటుంది. వీళ్లంతా కలిసి స్కూల్లో చేసే అల్లరి, పరీక్షల టైంలో పడే కష్టాలు చూస్తుంటే మన స్కూల్ రోజులు గుర్తొస్తాయి. ఆ అబ్బాయికి తన మీద తనకే నమ్మకం లేనప్పుడు, ఈ పిల్లే ధైర్యం చెప్పి వాడిని ఒక దారికి తెస్తుంది.

ఇక వీళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ, తిట్టుకుంటూనే ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. చివరికి ఏమవుతుందంటే, వీళ్లందరూ స్కూల్ పూర్తి చేసి, కాలేజీలకి వెళ్లి, లైఫ్ లో బాగా సెటిల్ అవుతారు. ఆ తరువాత వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. ఆ ఐదుగురు స్నేహితుల బంధం కూడా అప్పటికి ఇప్పటికీ అస్సలు తగ్గదు. మొత్తం మీద ఈ సిరీస్ చూస్తుంటే మన పాత స్నేహితులని, ఆ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది.

Advertisement

Read Also : ప్రతి ఇంటి సమస్యను గొంతెత్తి చాటిన గొప్ప ప్రయత్నం… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×