E-Paper
Advertisement

Romantic drama OTT : 17 ఏళ్లకే ప్రెగ్నెంట్… చెల్లిని కూడా వదలని మొగుడు… దిమ్మ తిరిగే ట్విస్టులు కూడా

Romantic drama OTT : 17 ఏళ్లకే ప్రెగ్నెంట్… చెల్లిని కూడా వదలని మొగుడు… దిమ్మ తిరిగే ట్విస్టులు కూడా
Advertisement

Romantic drama OTT : ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. భాష రాని వాళ్లు కూడా ఈ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. యాక్షన్, హారర్, కామెడీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జోనర్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలు అంటే చెవి కోసుకునే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీ రీసెంట్ గా థియేటర్లోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళితే….

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘రిగ్రెట్టింగ్ యూ’ (Regretting You). కొలీన్ హూవర్ రాసిన నవల ఆధారంగా, సుసాన్ మెక్‌మార్టిన్ స్క్రీన్‌ప్లేతో జోష్ బూన్ దర్శకత్వం వహించారు. ఇందులో అల్లిసన్ విలియమ్స్, మెక్కెన్నా గ్రేస్, డేవ్ ఫ్రాంకో, మాసన్ థేమ్స్ నటించారు. ఈ సినిమాను 2025 అక్టోబర్ 24న యునైటెడ్ స్టేట్స్‌లోని పారామౌంట్ పిక్చర్స్ విడుదల చేసింది.ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. $30 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $90 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ప్రస్తుతం prime video, Paramount+ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మోర్గాన్ అనే అమ్మాయి భవిష్యత్తు మీద ఎన్నో కలలు కంటుంది. కాని తన 17వ ఏటనే గర్భవతి కావడంతో క్రిస్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వీరికి క్లారా అనే కూతురు పుడుతుంది. ఇక కూతురు కూడా టీనేజ్ వయసుకు వస్తుంది. అయితే ఇప్పుడు తల్లీకూతుళ్లకి అస్సలు పడదు. కూతురు తనలాగే తొందరపడి లైఫ్ పాడు చేసుకోకూడదని తల్లి స్ట్రిక్ట్‌గా ఉంటే, క్లారా మాత్రం తన తల్లికి ఏమీ తెలియదని, తనని అనవసరంగా కంట్రోల్ చేస్తోందని ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటుంది.

ఇలాంటి టైమ్‌లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి మోర్గాన్ భర్త క్రిస్, ఆమె చెల్లెలు జెన్నీ ఇద్దరూ చనిపోతారు. ఈ బాధలో ఉండగానే మోర్గాన్‌కు మైండ్ బ్లాక్ అయ్యే నిజం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే.. తన భర్తకి, తన సొంత చెల్లెలికి మధ్య అక్రమ సంబంధం ఉందనే పచ్చి నిజం తెలుస్తుంది. ఈ దారుణమైన విషయం కూతురు క్లారాకు తెలిస్తే తండ్రి మీద అసహ్యం పెంచుకుంటుందని, ఆమె తట్టుకోలేదని మోర్గాన్ ఆ నిజాన్ని తనలోనే దాచుకుని కుమిలిపోతూ ఉంటుంది.

Advertisement

కానీ క్లారా మాత్రం తన తండ్రి చనిపోతే తల్లి ఏడవకుండా ఉంటోందని, తల్లిని ఇంకా ద్వేషించడం మొదలుపెడుతుంది. క్లారా తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ తల్లిని మరింత ఇబ్బంది పెడుతుంది. చివరికి ఈ కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది ? తన తండ్రి గురించి క్లారాకు తెలుస్తుందా ? తల్లీకూతుర్ల మధ్య సమస్యలు కొలిక్కి వస్తాయా ? లేక తల్లిలాగే కూతురు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : రాత్రిపూట మాత్రమే కనిపించే ఊరు… బర్త్ డే పార్టీలో చేరే దయ్యాలు… ఐఎండిబీలో 7.4 రేటింగ్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×