E-Paper
Advertisement

My Village Show : ‘మై విలేజ్ షో ‘ నుంచి తప్పుకున్న అనిల్ జీలా .. ఏం జరిగిందంటే..?

My Village Show : ‘మై విలేజ్ షో ‘ నుంచి తప్పుకున్న అనిల్ జీలా .. ఏం జరిగిందంటే..?
Advertisement

My Village Show : ఇటీవల కాలంలో చాలామంది యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అవుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్తో యూట్యూబ్ ని స్టార్ట్ చేసి తమ వీడియోలతో జనాలకు బాగా దగ్గరవుతున్నారు. అంతేకాదు తమ క్రేజ్ వల్ల పాపులర్ అవడంతో పాటుగా సినిమాల్లో కూడా ఛాన్స్ ని అందుకుంటున్నారు. ఈమధ్య బిగ్ బాస్ లో ఎక్కువ మంది యూట్యూబ్ ఇన్ఫ్లెన్సర్లు రావడం విశేషం. ఎక్కడో మారుమూలల్లో గ్రామాలలోని పరిస్థితుల గురించి వివరిస్తూ ఫేమస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మై విలేజ్ షో అనిల్ జీలా కూడా ఒకరు. ఈ ఛానల్ ద్వారా బాగా పాపులారిటీని దక్కించుకున్న అనిల్ ప్రస్తుతం బుల్లితెరపై అలాగే వెండితెరపై సందడి చేస్తున్నాడు. తనకి అంత మంచి క్రేజ్ ని తీసుకొచ్చిన మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నుంచి ఆయన తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అసలేం జరిగింది ఎందుకు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చేస్తాడు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

మై విలేజ్ షో ఛానెల్ ..

Advertisement

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లంబాడి పల్లె గ్రామానికి చెందిన అనిల్ జీలా, శ్రీకాంత్, శివకృష్ణ లు మొదటగా ఈ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. 2012లో ఈ ఛానల్ ని ప్రారంభించగా.. 2018లో ఈ ఛానల్ బాగా పాపులర్ అయింది.. అయితే అప్పటి నుంచి అందులో ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. ఏకంగా 3 మిలియన్స్ కు పై ఫాలోవర్స్ పెరిగారు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛానల్ కి మంచి పాపులారిటీ ఉంది. ఇందులో పెట్టే వీడియోలను చూసే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. అయితే ఇప్పుడు అంత పాపులారిటీ ఉన్న ఛానల్ నుంచి యూట్యూబ్ అనిల్ బయటికి వచ్చేసినట్లు తెలుస్తుంది. అసలు మీడియా వేదికగా ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ కి తనకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా ఒక శ్రీకాంత్పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

Also Read : ఇంట్లోంచి వెళ్లిన శృతి.. రవి, శృతి కాపురంలో ప్రభా చిచ్చు.. ప్రభావతికి మీనా స్ట్రాంగ్ కౌంటర్..

ఆ పోస్టులో ఏముందంటే..? 

Advertisement

ఈ యూట్యూబ్ ఛానెల్ నిర్వాకులలో ఒకరైన శ్రీకాంత్ ఆ పోస్ట్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఆ పోస్టులో అనిల్ కి ఈ ఛానల్ కి ఇకమీదట ఎటువంటి సంబంధం లేదు అని రాశారు. తాను సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన విషయాన్ని కూడా అందులో రాసుకోవచ్చారు. ఇకపై అనిల్ జీలా చేసే ప్రమోషన్లు, ఆయన వ్యాపారాలకు ‘మై విలేజ్ షో’ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది టీమ్. ‘మై విలేజ్ షో’ పేరుతో ఎవరైనా సంప్రదిస్తే, తమ అధికారిక సోషల్ మీడియాల ద్వారా సమాచారం ఇవ్వండి అని పేర్కొంది. అంతే కాదు చివరగా ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు శ్రీకాంత్. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవ్వడంతో కొందరు నెటిజెన్లు ఏమైంది?గొడవలు ఎందుకు? అని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై యూట్యూబర్ అనిల్ స్పందిస్తారేమో చూడాలి..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×