Romantic drama OTT : కొరియన్ సిరీస్ ఫ్యాన్స్ ఇప్పుడు మరో కొత్త సిరీస్ పై పడ్డారు. రీసెంట్ గాఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ చాలా క్రేజీగా ఉంటుంది. పెళ్లి పట్ల ఈ కాలం యువత ఎలా ఆలోచిస్తోందో ఈ సిరీస్ చక్కగా చూపిస్తుంది. ట్రయాంగిల్ ప్రేమ కథతో మొదలయ్యే ఈ సిరీస్ చూసేందుకు ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక హోటల్ మేనేజర్ అయిన అమ్మాయి, ఇద్దరబ్బాయిలను ఇష్టపడుతుంది. ఈ క్రమంలో ప్రతీ ఎపిసోడ్ క్రేజీగా, ఊహించని మలుపులతో ఉంటుంది.
ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా పేరు ‘ది ప్రాక్టికల్ గైడ్ టు లవ్’ (The Practical Guide to Love). దీనికి లీ సాంగ్-యోప్ దర్శకత్వం వహించారు. ఈయన గతంలో ‘వైఫ్ దట్ ఐ నో’ వంటి ఫేమస్ డ్రామాలను డైరెక్ట్ చేశారు. ఇందులో హాన్ జి-మిన్, పార్క్ సుంగ్-హూన్,
లీ కి-టెక్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 12 ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ దాదాపు 60-70 నిమిషాల నిడివితో ఉంటుంది.ఈ క్రేజీ కొరియన్ డ్రామా 2026 ఫిబ్రవరి 28నుంచి Viki ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అసలు భాష కొరియన్ తో పాటు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది ఈ సిరీస్.
లీ ఉయ్-యోంగ్ అనే యువతి ఒక హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంటుంది. తను ఇష్టపడే సహోద్యోగి కూడా తనను ప్రేమిస్తున్నాడని ఆమె ఒక చిన్న పొరపాటు పడుతుంది. తీరా అసలు విషయం తెలిశాక, ఆ బాధ నుంచి బయటపడటానికి వరుసగా బ్లైండ్ డేట్స్ (పెళ్లి చూపులు) కి వెళ్లడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమె జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు వస్తారు. మొదటి వ్యక్తి టే-సోప్, ఒక కంపెనీకి CEO. ఆయన చాలా ప్రాక్టికల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి, పెళ్లి విషయంలో చాలా క్లారిటీతో ఉంటాడు. ఇక రెండో వ్యక్తి జి-సూ, ఇతను కొంచెం సరదాగా, జీవితాన్ని ఎంజాయ్ చేసే టైపు. వీరిద్దరిలో ఒకరు బాధ్యతగా కనిపిస్తే, మరొకరు మనసుకి నచ్చేలా ఉంటారు. ఈ ఇద్దరి మధ్య ఉయ్-యోంగ్ ఎవరిని ఎంచుకుంది? అసలు ఈ కాలంలో ప్రేమ అంటే కేవలం మనసు పారేసుకోవడమేనా? భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడమా? అనే విషయాలను ఈ సిరీస్‌లో చాలా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా చూపించారు.
Read Also : ఊహించని మలుపులతో ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?