E-Paper
Advertisement

Carmeni Selvam Review :’ కార్మేని సెల్వం’ రివ్యూ..

Carmeni Selvam Review :’ కార్మేని సెల్వం’ రివ్యూ..
Advertisement

Carmeni Selvam Review : “అప్పులు చేస్తే ఆస్తులు పోతాయి.. కానీ అనవసరమైన ఖర్చులు చేస్తే ఆత్మీయులే దూరమవుతారు” – ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఒక సాదాసీదా క్యాబ్ డ్రైవర్ జీవితంలో అప్పులు తెచ్చిన తంటాలు ఏంటి? అసలు ఈ ‘సెల్వం’ గాడి కథ ఏంటి?

నటీనటులు: సముద్రఖని, లక్ష్మీ ప్రియ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ.

Advertisement

దర్శకత్వం: రామ్ చక్రి (శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి వచ్చిన టాలెంట్).

సంగీతం: రామానుజన్.

కథ..

Advertisement

సెల్వం (సముద్రఖని) ఒక క్యాబ్ డ్రైవర్. తన భార్య శాంతి (లక్ష్మి) తో కలిసి ఎంతో నిజాయితీగా బతుకుతుంటాడు. వీళ్లద్దరికీ ఒకటే కల.. ఎలాగైనా కష్టపడి ఒక ‘సొంతిల్లు’ కట్టుకోవాలని. దీనికోసం రూపాయి రూపాయి పొదుపు చేస్తారు. కానీ, మధ్యతరగతి మనుషులకి ఉండే అతిపెద్ద జబ్బు “లోకం కోసం గొప్పలు పోవడం”.

ఒక ఫంక్షన్‌లో జరిగిన చిన్న అవమానం వల్ల, తన దగ్గరున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేసి మర్యాద కాపాడుకోవాలనుకుంటారు. సరిగ్గా అదే టైమ్‌లో కొడుకుకి యాక్సిడెంట్ అవ్వడం, ఆ అప్పులు తీర్చడానికి తన యజమాని సంపత్ (గౌతమ్ మీనన్) కి తెలియకుండా తన కారునే అద్దెకు తిప్పడం.. ఇలా ఒక తప్పును కవర్ చేయడానికి సెల్వం చేసే ప్రయత్నాలు అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాయి? చివరికి తన కలను నిజం చేసుకున్నాడా లేదా? అనేదే సినిమా.

విశ్లేషణ..

దర్శకుడు రామ్ చక్రి చాలా సింపుల్ పాయింట్‌ని ఎంచుకున్నాడు. మన చుట్టుపక్కల కనిపించే మనుషులనే పాత్రలుగా చూపించాడు.

ఎమోషన్స్: సినిమా అంతా చాలా నేచురల్‌గా సాగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, పిల్లల మీద వాళ్లకుండే ప్రేమ మన ఇంటి కథలాగే అనిపిస్తుంది.

మెసేజ్: “అవసరం లేని వస్తువుల కోసం ఆశపడితే.. అవసరమైన మనుషులను కోల్పోతాం” అని సినిమా చివర్లో చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.

నెమ్మదైన కథనం: సినిమా చాలా స్లోగా సాగుతుంది. కమర్షియల్ ఫైట్లు, మాస్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు. ఇది పక్కా ఒక ‘క్లాస్’ అండ్ ‘ఎమోషనల్’ డ్రామా.

నటీనటుల పెర్ఫార్మన్స్..

సముద్రఖని: ఈయన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక మిడిల్ క్లాస్ తండ్రి పడే వేదనను తన కళ్లలోనే చూపించారు. సెల్వం పాత్రకు ఈయన తప్ప ఇంకెవరూ సెట్ అవ్వరు అన్నంతగా నటించారు.

లక్ష్మీ ప్రియ: ఒక సామాన్య గృహిణిగా, భర్తకు అండగా ఉంటూనే.. పరిస్థితుల వల్ల విసిగిపోయే భార్యగా అద్భుతంగా చేసింది.

గౌతమ్ మీనన్ & అభినయ: వీళ్ల పాత్రలు చిన్నవైనా సినిమాలో చాలా కీలకం. గౌతమ్ మీనన్ తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.

చీవరి మాట..

‘కార్మేని సెల్వం’ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కాదు.. ఒక మంచి “లైఫ్ లెసన్”. ఫ్యామిలీతో కలిసి హాయిగా కూర్చుని చూడదగ్గ క్లీన్ మూవీ. అప్పుల బాధల్లో ఉన్నవారు, మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసేవారు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఎమోషనల్ అవుతారు.

ఒక్క మాటలో చెప్పాలంటే: మన ఇంటి కథ.. మనందరి వ్యథ! ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాని చూసేయొచ్చు..

కార్మేని సెల్వం రేటింగ్: 3/5

Related News

గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ

‘రణబాలి’ మూవీ రివ్యూ.. విరోష్ జంట హ్యాట్రిక్ కొట్టిందా?

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ.. తెలంగాణ పల్లెటూరి అమ్మాయి ఆకట్టుకుందా?

జైలర్ 2 మూవీ రివ్యూ.. రజినీకాంత్ జైలర్ మ్యాజిక్ రిపీట్ చేశారా?

మయూఖ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

చకోర మూవీ రివ్యూ..

రివ్యూ: కామ్రేడ్‌ కళ్యాణ్‌.. మెప్పించిండా? 

‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. ప్రేమ గెలిచిందా? తండ్రి మాట గెలిచిందా?

Big Stories

Advertisement
×