E-Paper
Advertisement

Romantic Drama OTT : పిచ్చోడు అనుకున్నారు.. కానీ ప్రపంచాన్నే గెలిచాడు… క్లైమాక్స్ వరకు చూపు కూడా తిప్పలేరు

Romantic Drama OTT : పిచ్చోడు అనుకున్నారు.. కానీ ప్రపంచాన్నే గెలిచాడు… క్లైమాక్స్ వరకు చూపు కూడా తిప్పలేరు
Advertisement

Romantic Drama OTT : సాధారణంగా సినిమాల్లో మానసిక రోగులంటే ఏదో ఒక క్రైమ్ చేస్తారని లేదా వింతగా ప్రవర్తిస్తారని చూపిస్తారు. కానీ ఈ సినిమాలో ఒక షిజోఫ్రెనియా అనే మానసిక జబ్బు ఉన్న పేషెంట్ పడే నరకం, అతను ఎదుర్కొనే అవమానాలను చూపించారు. ఇది ఒక చిన్న బడ్జెట్ సినిమాగా మొదలై, బాక్సాఫీస్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో క్లైమాక్స్ మాత్రం అందరి మనసులను గెలుచుకుంటుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘వర్డ్స్ ఆన్ బాత్‌రూమ్ వాల్స్’ (Words on Bathroom Walls). 2020లో వచ్చిన ఈ సినిమా జూలియా వాల్టన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. థోర్ ఫ్రూడెంతల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో చార్లీ ప్లమ్మర్ (ఆడమ్), టేలర్ రస్సెల్ (మాయ), ఆండీ గార్సియా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో హీరోగా నటించిన చార్లీ ప్లమ్మర్ నటనకు గాను కొన్ని ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా నామినేషన్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆడమ్ అనే కుర్రాడు మామూలు కుర్రాడిలాగే ఉంటాడు కానీ, అతని మెదడులో ఏదో సమస్య ఉంటుంది. అతనికి లేని మనుషులు కనిపిస్తూ, రకరకాల గొంతులు వినిపిస్తూ పిచ్చెక్కిస్తుంటాయి. ఒకసారి స్కూల్ ల్యాబ్‌లో ప్రయోగం చేస్తూ ఇలాగే ఏదో ఊహించుకుని నానా రభస చేస్తాడు. దాంతో స్కూల్ మేనేజ్‌మెంట్ వానిని బయటికి గెంటేస్తుంది. తీరా డాక్టర్లు చెక్ చేస్తే అతనికి ‘షిజోఫ్రెనియా’ అనే జబ్బు ఉందని తేలుతుంది. అతని ఫ్యామిలీ మళ్ళీ వేరే స్కూల్లో చేరుస్తారు. అయితే కొత్త స్కూల్‌లో తన జబ్బు గురించి ఎవరికీ తెలియకూడదని ఆడమ్ జాగ్రత్త పడతాడు.

అక్కడే ఆడమ్ కి మాయ అనే ఒక తెలివైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య దోస్తీ మొదలై అది కాస్తా ప్రేమగా మారుతుంది. మాయకు దగ్గరవుతున్న కొద్దీ, తనలోని లోపాన్ని ఆమె కనిపెట్టేస్తుందేమో అని ఆడమ్ భయపడుతుంటాడు. ఆ టెన్షన్‌లో అతను వాడుతున్న మందులు కూడా సరిగ్గా పని చేయవు. ఒక రోజు స్కూల్ డాన్స్ ప్రోగ్రామ్ టైమ్‌లో ఆడమ్ జబ్బు విషయం అందరికీ తెలిసిపోతుంది. అందరూ అతన్ని ఒక పిచ్చోడిలా చూస్తారు. ఇక ఈ క్లైమాక్స్ చాలా క్రేజీగా ఉంటుంది. చివరికి ఆడమ్ ఈ సమస్య నుంచి ఎలా బయట పడ్డాడు ? ఆడమ్ ప్రేమ కథ ఏమవుతుంది ? ఈ క్లైమాక్స్ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : హిట్ అండ్ రన్ కేసు వెనుక హీట్ ఎక్కించే బయో వార్ మిస్టరీ… ఫ్యూజులు అవుటయ్యే ఇన్వెస్టిగేషన్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×