E-Paper
Advertisement

చనిపోయిన భార్య కోసం టైమ్ ట్రావెల్ చేసే పిచ్చి ప్రేమికుడు… కొరియన్ ఫ్యాన్స్ మిస్ అవ్వకూడని సిరీస్

చనిపోయిన భార్య కోసం టైమ్ ట్రావెల్ చేసే పిచ్చి ప్రేమికుడు… కొరియన్ ఫ్యాన్స్ మిస్ అవ్వకూడని సిరీస్
Advertisement

Romantic fantasy comedy OTT : టైమ్ ట్రావెల్ జానర్ అంటేనే ఒక పెద్ద కిక్కు ఉంటుంది. ఒక కాలం నుంచి మరొక కాలానికి వెళ్ళి, అక్కడ మనుగడ సాగించే విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఈ జానర్ లో వచ్చిన ఒక రొమాంటిక్ కామెడీ ఆడియన్స్ ను పెద్ద ఎత్తునే అలరించింది. ఈ కథలో భార్య మర్డర్ మిస్టరీ ని తెలుసుకునే క్రమంలో ఒక రాజు 300 ఏళ్ల ప్రజెంట్ కాలానికి వస్తాడు. ఆ తరువాత కథ ఓ రేంజ్ లో నడుస్తుంది. ముఖ్యంగా ఈ కొరియన్ డ్రామాలో కనిపించే ‘ఓమురైస్’ అనే వంటకం ప్రేక్షకులలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ అభిమానులు ఈ డ్రామాను గుర్తు చేసుకున్నప్పుడు ఆ వంటకాన్ని ప్రస్తావించకుండా ఉండలేరు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ డ్రామా పేరు ‘రూఫ్ టాప్ ప్రిన్స్’ (Rooftop Prince). దీనిని దర్శకులు షిన్ యూన్-సబ్, అన్ గిల్-హో తెరకెక్కించగా, దీనికి లీ హీ-మ్యుంగ్ కథను అందించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో పార్క్ యూ-చున్, హాన్ జీ-మిన్ తమ అద్భుత నటనతో మెప్పించగా, విలన్ పాత్రల్లో జియాంగ్ యు-మి, లీ టే-సంగ్ నటించారు. ఈ డ్రామా విడుదలైన సమయంలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, 2012 SBS డ్రామా అవార్డ్స్‌లో హీరో పార్క్ యూ-చున్ హీరోయిన్ హాన్ జీ-మిన్ ‘టాప్ ఎక్సలెన్స్’ అవార్డులను గెలుచుకున్నారు. కేవలం కొరియాలోనే కాకుండా, చైనా, జపాన్ భారతదేశంలోని కొరియన్ డ్రామా ప్రియులలో కూడా ఇది ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ డ్రామా Viki, Netflix లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సుమారు 300 ఏళ్ల క్రితం జోసెన్ రాజ్యంలో తన భార్య (రాకుమారి) మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని యువరాజు లీ గాక్ ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో తన ముగ్గురు అనుచరులతో కలిసి శత్రువుల నుండి తప్పుకోబోయి కొండ పైనుంచి దూకేస్తారు. అంతే.. కట్ చేస్తే, వాళ్ళు 300 ఏళ్లు దాటి ప్రజెంట్ కాలానికి వస్తారు. అదికూడా సియోల్ నగరంలో ఒకమ్మాయి ఇంటి డాబా మీద ల్యాండ్ అవుతారు.

తమ రాజ్యాన్ని, కాలాన్ని వదిలి వచ్చిన ఆ నలుగురికీ ఈ కొత్త ప్రపంచం వింతగా అనిపిస్తుంది. కరెంటు, కార్లు, టీవీలు చూసి వాళ్ళు పడే కంగారు, చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇక్కడ యువరాజు తనలాగే ఉండే ఒక ధనవంతుడిని, అలాగే తన భార్యను పోలిన మరో మహిళను చూసి ఆశ్చర్యపోతాడు. దీంతో తన భార్య మరణానికి, ఈ కాలానికి ఏదో సంబంధం ఉందని అతడు బలంగా నమ్ముతాడు. కథ కూడా చివరివరకు ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. చివరికి తన భార్య మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని లీ గాక్ కనిపెడతాడా ? మళ్ళీ తన కాలానికి తిరిగి వెళ్లిపోతాడా ? ఈ కథ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు… మైండ్ బెండింగ్ ట్విస్టులతో అదరగొడుతున్న సిరీస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×