E-Paper
Advertisement

నరకం చూపించే భార్య… టైమ్ ట్రావెల్ చేసి ప్రేయసిని పెళ్లి చేసుకునే భర్త… ప్రతీ ఎపిసోడ్ సరికొత్తగా

నరకం చూపించే భార్య… టైమ్ ట్రావెల్ చేసి ప్రేయసిని పెళ్లి చేసుకునే భర్త… ప్రతీ ఎపిసోడ్ సరికొత్తగా
Advertisement

Romantic Fantasy Drama OTT :ఒక అద్భుతమైన కొరియన్ సిరీస్ ను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ చూడండి. ఎందుకంటే ఇది జీవితాన్ని కళ్ళముందు ఉంచుతుంది. రొమాంటిక్ ఫాంటసీ జోనర్‌కు చెందిన ఈ సిరీస్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో టైమ్ ట్రావెల్ చేసి తన పెళ్లిని మార్చుకోవడానికి హీరో ప్రయత్నిస్తాడు. ఈ కంటెంట్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా సాగుతుంది. ఫాంటసీ అంశం ఉన్నప్పటికీ, ఇది మన రోజు వారి జీవితానికి చాలా దగ్గరగా ఉండే స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు, ఆఫీస్ టెన్షన్లు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోతే జీవితం ఎంత నరకంగా మారుతుందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, మనుషుల మధ్య రిలేషన్షిప్స్ ఎంత విలువైనవో చెప్పే ఒక మంచి ఎమోషనల్ సిరీస్ ఇది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా సిరీస్ పేరు ‘ఫ్యామిలియర్ వైఫ్’ (Familiar Wife). ఈ డ్రామా కొరియాలో 2018లో ‘tvN’ నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. ఇందులో మొత్తం 16 ఎపిసోడ్లు ఉంటాయి. ఇది విడుదలైన సమయంలో దక్షిణ కొరియాలో భారీ వ్యూయర్‌షిప్ రేటింగ్స్ సాధించింది. దీనికి వచ్చిన క్రేజ్ కారణంగా, 2021లో జపనీస్ భాషలో కూడా ఇదే పేరుతో రీమేక్ చేశారు. ఈ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు లీ సాంగ్-యోబ్ తెరకెక్కించగా, యాంగ్ హీ-సంగ్ దీనికి కథను అందించారు. ఇక ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన జి సంగ్ హాన్ జి-మిన్ తమ నటనతో ప్రాణం పోశారు. ముఖ్యంగా హాన్ జి-మిన్, ఒకవైపు విసుగుతో ఉన్న గృహిణిగా, మరోవైపు ఉత్సాహంగా ఉండే వర్కింగ్ ఉమెన్‌గా రెండు విభిన్న షేడ్స్‌లో అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలుస్తాయి. ఇది Netflix, Viki ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో జూ-హ్యుక్ ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి. పెళ్ళైన కొత్తలో తన భార్య ఉజిన్ తో ఎంతో అన్యోన్యంగా ఉంటాడు. ఆ తరువాత బాధ్యతల ఒత్తిడి వల్ల వీళ్ళ సంసారం నరకంలా మారుతుంది. తన జీవితం ఇలా అయిపోయిందేంటని రోజూ బాధపడుతుంటాడు జూ-హ్యుక్. ఆ సమయంలోనే అతనికి అనుకోకుండా గతంలోకి వెళ్లే ఒక వింత అవకాశం వస్తుంది. టైమ్ ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళిన జూ-హ్యుక్, ఇప్పుడు తన భార్యను కాకుండా, తను ఇష్టపడిన మరో రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తిరిగి ప్రజెంట్ కాలానికి వచ్చేసరికి అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. అతను కోరుకున్నట్టే ధనవంతుడు అవుతాడు, ఆ అమ్మాయే అతనికి భార్యగా ఉంటుంది.

అయితే అనుకోకుండా అతని పాత భార్య ఉజిన్ అతనికి ఒక కొలీగ్‌గా మళ్ళీ పరిచయమవుతుంది. కొత్త జీవితంలో తన పాత భార్య చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉండటం చూసి జూ-హ్యుక్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది. తను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే గతంలో ఆమె అంత కోపంగా ఉండేదని, తప్పు ఆమెలో లేదు తనలోనే ఉందని గ్రహిస్తాడు. చివరకు తన తప్పును సరిదిద్దుకుని, ఆమెను మళ్ళీ ఎలా దక్కించుకున్నాడు ? టైమ్ ట్రావెల్ తో అన్నీ మళ్ళీ సర్దుకుంటాయా ? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ ఉంటుంది.

Advertisement

Read Also : ఆమె చూపు పడితే నాశనమే… ప్రేమిస్తే చావు మేళం పక్కా… భయపెడుతున్న హారర్ మూవీ

Tags

Related News

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

Big Stories

Advertisement
×