E-Paper
Advertisement

బ్యాక్ టచ్ చేస్తే వచ్చే వింత శక్తులు… నవ్వులు పూయిస్తూనే భయపెట్టే క్రైమ్ థ్రిల్లర్

బ్యాక్ టచ్ చేస్తే వచ్చే వింత శక్తులు… నవ్వులు పూయిస్తూనే భయపెట్టే  క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Comedy Crime Thriller Series OTT : నవ్వుతూనే గోళ్లు గిల్లుకునేలా చేసే ఒక కామెడీ సిరీస్ ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. ఈ కొరియన్ కథలో హీరోయిన్ కి ఒక వింత పవర్ ఉంటుంది. ఎవరినైనా వెనక భాగాన్ని తాకితే ఆమెకు అతని గతం ఏమిటో తెలిసిపోతుంది. ఈ వింత కాన్సెప్ట్‌తో సిరీస్ ఫుల్ కామెడీగా, సరదాగా సాగిపోతుంది. మధ్యలో ఒక సీరియల్ కిల్లర్ ఎంట్రీ ఇవ్వడంతో అసలు ఆట మొదలవుతుంది. కిల్లర్ ఎవరో తెలీక, వాడు కూడా ఒక వింత పవర్‌తో అందరినీ ముప్పుతిప్పలు పెడుతుంటే, కథ సూపర్ సస్పెన్స్‌గా మారుతుంది. సరదాగా మైండ్ రీఫ్రెష్ అవ్వాలనుకునేటోళ్ళు ఈ సిరీస్ ను మాత్రం మిస్ కావద్దు.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

2023 లో వచ్చిన ఈ కొరియన్ కామెడీ సిరీస్ పేరు ‘బిహైండ్ యువర్ టచ్’ (Behind Your Touch). ఈ డ్రామాకు కిమ్ సియోక్-యూన్ దర్శకత్వం వహించారు. ఈయన గతంలో ‘మై లిబరేషన్ నోట్స్’ వంటి క్లాసిక్ హిట్స్ కూడా తీశారు. ఇందులో మెయిన్ లీడ్స్‌గా చేసిన హాన్ జి-మిన్, లీ మిన్-కి తమ నటనతో సిరీస్‌ని మరో లెవల్‌కు తీసుకెళ్లారు. ముఖ్యంగా పాపులర్ కే-పాప్ గ్రూప్ EXO లీడర్ సుహో ఒక కీలక పాత్రలో నటించడం వల్ల ఈ సిరీస్‌కు గ్లోబల్ లెవల్‌లో మంచి క్రేజ్ వచ్చింది. కొరియాలో ప్రసారమైనప్పుడు ఇది దాదాపు 9.3% రేటింగ్‌తో టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కథలో వచ్చే ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ వల్ల దీనికి ఐఎమ్‌డిబి (IMDb)లో 7.4 రేటింగ్ లభించింది. తెలుగు ప్రేక్షకులకు ప్లస్ పాయింట్ ఏంటంటే, నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఇది తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. కాబట్టి భాషా ఇబ్బంది లేకుండా ఎంచక్కా హాయిగా చూసేయచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ముజిన్ అనే ఒక పల్లెటూర్లో బొంగ్ యే-బూన్ అనే డాక్టర్ అమ్మాయి ఉంటుంది. ఈమె మామూలు డాక్టర్ కాదు, పశువుల డాక్టర్. ఒకరోజు ఒక ఆవుకు ట్రీట్మెంట్ ఇస్తుండగా ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చి ఈమె మీద పడుతుంది. అప్పటినుండి ఈమెకు ఒక వింత శక్తి వస్తుంది. అదేంటంటే.. ఏదైనా జంతువుని గానీ, మనిషిని గానీ వెనక వైపు (పిరుదుల మీద) తడితే చాలు, వాళ్ళ గతం ఏంటో ఈమెకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అయితే ఈ వింత అలవాటు వల్ల ఊర్లో వాళ్లందరూ ఈమెను ఒక పిచ్చిదానిలా, తేడా మనిషిలా చూస్తుంటారు. అదే ఊరికి మూన్ జాంగ్-యోల్ అనే పోలీస్ సిటీ నుండి పనిష్మెంట్ ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. ఎలాగైనా పెద్ద కేసు పట్టుకుని మళ్ళీ సిటీకి వెళ్ళిపోవాలని ఆరాటపడుతుంటాడు.

అయితే మొదట్లో ఈ డాక్టర్ అమ్మాయి చేసే పనులన్నీ చూసి ఆమెను తిక్కది అనుకుంటాడు. కానీ మెల్లగా ఆమెకున్న శక్తి గురించి తెలిసి షాక్ అవుతాడు. ఇక అప్పటినుండి ఆమెను వదలకుండా, తన ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెను వాడుకోవడం మొదలుపెడతాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. కానీ అసలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఆ చిన్న ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ సీరియల్ కిల్లర్ ఎవరో ఎవరికీ అర్థం కాదు. పైగా వాడు కూడా ఒక వింత శక్తి ఉన్నవాడే అని వీళ్ళకు తెలుస్తుంది. ఈ డాక్టర్ అమ్మాయి తన పవర్‌తో, ఆ పోలీస్ తన తెలివితేటలతో కలిసి ఆ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారు? ఆ ఊరిని ఎలా కాపాడారు? అనే విషయాలతో భయం భయంగా ఉంటూనే భలే కామెడీగా సాగుతుంది ఈ కథ.

Advertisement

Read Also : రిలేషన్షిప్ మర్డర్ తో దిమ్మతిరిగే లీగల్ క్రైమ్ స్టోరీ… క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు బాస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×