E-Paper
Advertisement

AP Pensions: ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందుగానే

AP Pensions: ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందుగానే
Advertisement

AP Pensions: ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, 2026 బదులుగా డిసెంబర్ 31న పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ మిగిలిపోయిన పింఛన్లను జనవరి 2న పంపిణీ చేయాలని సూచించింది.

రికార్డు స్థాయిలో పెన్షన్లు

ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే దేశంలో అధిక సామాజిక పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో సమాజంలోని పేద, బలహీన వర్గాల కష్టాలను, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలను తగ్గించడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఉపయోగపడుతుందని అంటోంది.

Advertisement

2024 జూన్ లో విడుదలైన ఉత్తర్వుల మేరకు.. వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్ జెండర్లు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు రూ.4000 అందిస్తు్న్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.6000, పూర్తి వికలాంగులకు రూ.10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10000 ఆర్థిక సాయం అందిస్తుంది.

Also Read: AP Govt Transfers: ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ.. కొత్త పోస్టింగ్ లు వీరికే

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్‌దారులకు రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది పింఛన్‌దారుల ఇంటివద్దనే పంపిణీ చేయనున్నారు. డిసెంబర్ 31 2025 తేదీన పంపిణీ కాకుండా మిగిలిన పెన్షన్‌లను జనవరి 2న సచివాలయ సిబ్బంది లబ్దిదారులకు అందిస్తారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×