E-Paper
Advertisement

Horror Thriller Movie OTT : తల కోసం ఆత్మ బీభత్సం… వణికిపోయే ఒంటరి ఫ్యామిలీ

Horror Thriller Movie OTT : తల కోసం ఆత్మ బీభత్సం… వణికిపోయే ఒంటరి ఫ్యామిలీ
Advertisement

Horror Thriller Movie OTT : ఇండోనేషియన్ నుంచి ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయి. చేతబడి, దెయ్యం స్టోరీలతో ఈ సినిమాలు కూడా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో అయితే ఒక తల లేని దెయ్యం అందరిని భయపెడుతుంటుంది. 1970ల కాలంలో సాగే ఈ కథలో కాఫీ తోటలో ఉన్న ఒక కొత్త జంటను, ఒక తల లేని ఆత్మ తన శరీరం కోసం వేధిస్తుంటుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్ వణుకు పుట్టిస్తుంటాయి. మరి ఈ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదండి.

ఎక్కడ చూడవచ్చు?

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘త్రినిల్: కంబాలికన్ తుబుకు’ (Trinil: Give Me Back My Body). దీనిని ప్రముఖ దర్శకుడు హనుంగ్ బ్రమంట్యో తెరకెక్కించారు. 2024, జనవరి 4న విడుదలైన ఈ సినిమాలో కర్మెలా వాన్ డెర్ క్రుక్, రంగా నాట్రా, ఫతా అమీన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం Netflix ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఇది తెలుగులో కూడా డబ్బింగ్ చేయబడింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1970లలోని జావాలో ఒక టీ ఎస్టేట్ నేపథ్యంలో కథ జరుగుతుంది. పెళ్లైన కొత్తలో రారా, సుతాన్ దంపతులు తమ వారసత్వంగా వచ్చిన ఆ టీ ఎస్టేట్ లోకి అడుగుపెడతారు. అయితే అక్కడ వాళ్లకి వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ పని చేసే వర్కర్లు మిస్టీరియస్‌గా చనిపోతుంటారు. ఒక శరీరం లేని స్త్రీ తల కనిపిస్తుంది. అది తన శరీరాన్ని తిరిగి ఇవ్వమని భయపెడుతూ వీళ్ళ వెంటపడుతుంది. ఈ సంఘటనలతో భయపడిపోయిన ఆ దంపతులు, ఈ దుష్టశక్తి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి మాంత్రికుడి సహాయం కోరతారు.

ఇక స్టోరీ నడిచే కొద్దీ ఆ ఆత్మ ఎవరో తెలిసి అందరూ షాక్ అవుతారు. ఆ ఆత్మ మరెవరో కాదు, రారా తల్లి అయిన రాయు. గతంలో ఆమె ఆస్తి కోసం తన కూతురిని, భర్తను మోసం చేయడానికి ప్రయత్నించి క్రూరంగా హత్య చేయబడుతుంది. చనిపోయిన తర్వాత కూడా శాంతించని ఆమె ఆత్మ, ఇప్పుడు రారా శరీరాన్ని ఆక్రమించి తిరిగి జీవించాలని చూస్తుంది. ఈ క్రమంలో రారా తన తల్లి ఆత్మని ఎలా ఎదుర్కొంది ? మాంత్రికుడి సహాయంతో తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంది అనేది మిగిలిన కథ.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న అపర్ణ బాలమురళి మలయాళం రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో విడుదలైన నెలలోపే..

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×