E-Paper
Advertisement

భర్తను పంచుకున్న యువతితో భార్య పెంచుకున్న బంధం… ఒకే పురుషుని కోసం ఇద్దరు స్త్రీల ఆరాటం

భర్తను పంచుకున్న యువతితో భార్య పెంచుకున్న బంధం… ఒకే పురుషుని కోసం ఇద్దరు స్త్రీల ఆరాటం
Advertisement

Romantic Movie on OTT : ఇద్దరు ప్రేమికుల మధ్య మరో వ్యక్తి వస్తే ఆ రిలేషన్ ఎంత దెబ్బతింటుందో అందరికీ తెలిసిందే. కానీ స్వయంగా భార్యే తన భర్తను మరో వ్యక్తితో పంచుకుంటే ? ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆరాట పడితే ఎలా ఉంటుంది ? ఈ స్టోరీ లైన్ డో పాత సినిమాలో విన్నట్టుగా ఉంది కదా. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఓ కొరియన్ డ్రామా గురించి. మరి ఈ క్రేజీ కే-డ్రామా ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్  

ఈ సినిమా పేరు ‘Love In Between’ (కొరియన్ టైటిల్ Du yeoja). 2010లో విడుదలైన ఈ సౌత్ కొరియా ఎరోటిక్ మెలో డ్రామాకు చొంగ్ యున్-సు దర్శకత్వం వహించారు. ఇందులో షిన్ ఉన్-క్యుంగ్, జంగ్ జూన్-హో, షిమ్ యి-యంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక భార్య, తన భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న తర్వాత తీసుకునే నిర్ణయాల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం దక్షిణ కొరియా వంటి కొన్ని రీజియన్లలో Netflix లో అందుబాటులో ఉంది. అలాగే భారత దేశంలోనూ నెట్‌ఫ్లిక్స్ ద్వారా వీక్షించే అవకాశం ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

మన హీరోయిన్ హాన్ సో-యంగ్ (షిన్ ఉన్-క్యుంగ్). ఆమె సక్సెస్ ఫుల్ గైనకాలజిస్ట్. అయితే తన భర్త యున్ జి-సియోక్ (జంగ్ జూన్-హో)తో చాలా సంతోషంగా ఉన్నానని అనుకుంటూ ఉంటుంది. జి-సియోక్ ఆర్కిటెక్ట్ గా, యూనివర్సిటీ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. చూడ్డానికి వీరిద్దరూ పర్ఫెక్ట్ కపుల్ లా కనిపిస్తారు. కానీ ఒకరోజు సో-యంగ్ కు అనుకోకుండా తన భర్త ఆఫీసులో ఒక వింత మెసేజ్‌ కన్పిస్తుంది. ఆ మెసేజ్ ను చూశాక, ప్రొఫెసర్ అయిన తన భర్త స్టూడెంట్ సు-జీ (షిమ్ యి-యంగ్)తో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమెకు అర్థం అవుతుంది.

సాధారణంగా ఇలాంటి విషయం తెలిసినప్పుడు భార్యలు ఆవేశంలో రచ్చ రచ్చ చేస్తారు. హీరోయిన్ మాత్రం భర్తను ఈ విషయం గురించి నేరుగా నిలదీయదు. అసలు ఆ రెండో అమ్మాయి ఎవరు ? ఎందుకు తన భర్తను ఇష్టపడుతోంది ? అని తెలుసుకోవడానికి సో-యంగ్ విచిత్రమైన ప్లాన్ వేస్తుంది. సు-జీ యోగా క్లాసు నివహిస్తుండగా, అందులో హీరోయిన్ తన పేరు మార్చుకుని జాయిన్ అవుతుంది. అక్కడ సు-జీతో స్నేహం చేస్తుంది. అలాగే ఆమెకు తెలియకుండానే ఆమె వ్యక్తిగత జీవితం, న భర్తతో ఉన్న సంబంధం గురించిన విషయాలు రాబడుతుంది. అయితే సు-జీకి సో-యంగ్ అసలు విషయం తెలియదు కదా. అందుకే ఆమెను తన ప్రాణ స్నేహితురాలిగా అనుకుని అన్నీ చెప్పేస్తుంది.

Advertisement

ఆ అమ్మాయి అమాయకత్వాన్ని, తన భర్త పట్ల ఆమెకున్న ప్రేమని చూసి సో-యంగ్ మనసులో అప్పటిదాకా ఉన్న ద్వేషం మెల్లగా జాలిగా మారుతుంది. మరోవైపు జి-సియోక్ ఇద్దరు మహిళలను ప్రేమించే విషయం ఆలోచిస్తూ గందరగోళంలో పడతాడు. సో-యంగ్ ఫ్రెండ్షిప్ సు-జీతో మరింత బలపడుతుంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురి రిలేషన్ మరింత క్లిష్టంగా మారుతుంది. అంతలోనే సుజీ ప్రెగ్నెంట్ అనే బాంబు లాంటి వార్త బయటపడుతుంది. మరి ఆ తరువాత ఏం జరిగింది ? ఈ ముగ్గురి ప్రేమ కథకు ఎలాంటి ఎండ్ కార్డు పడింది ? అన్నది చూసి తెలుసుకోవాల్సిన కథ.

Read Also : 1 గంట 56 నిమిషాల ఈ థ్రిల్లర్ లో చివరి వరకు హంతకుడిని కనిపెట్టలేరు

Tags

Related News

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×