E-Paper
Advertisement

ఆర్మీ అధికారి గుండెల్లో తుఫాను రేపిన సుందరి… బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన కొరియన్ డ్రామా

ఆర్మీ అధికారి గుండెల్లో తుఫాను రేపిన సుందరి… బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన కొరియన్ డ్రామా
Advertisement

Romantic Movie on OTT : యుద్ధ భూమిలో ప్రేమ అనే పాయింట్ వినడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో కదా. కానీ అదే ప్రేమ కాకుండా వ్యామోహం అయితే ? ఆ వ్యామోహం పైఅధికారి భార్యతో అయితే ఎలా ఉంటుంది ? అలాంటి ఆసక్తికర కథాంశంతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

రెండు ఓటీటీలలో అందుబాటులో

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ‘Obsessed (2014)’. వియత్నాం యుద్ధం ముగిసే సమయంలో అంటే 1969 నేపథ్యంలో కథ ఇది. ఈ దక్షిణ కొరియా ఎరోటిక్ రొమాంటిక్ డ్రామాకు ‘కిమ్ డే-వూ’ దర్శకత్వం వహించారు. పగడ్బందీ సైనిక వాతావరణంలో, ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టిన ప్రేమ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం భారతదేశంలో Amazon Prime Videoలో కొన్ని రీజియన్లలో అందుబాటులో ఉంది. అలాగే Apple TV లో రెంట్‌ కి కూడా తీసుకునే ఆప్షన్ ఉంది. ఇక ఈ చిత్రం ద్వారా పరిచయమైన ‘లిమ్ జి-యోన్’ (The Glory ఫేమ్) అనేక అవార్డులను అందుకున్నారు. సినిమాలో అందమైన విజువల్స్, అద్భుతమైన మ్యూజిక్ మాత్రమే కాదు, ఎమోషనల్ క్లైమాక్స్ ఉండడంతో కొరియన్ సినిమాలో దీన్నొక క్లాసిక్ లవ్ స్టోరీగా చెప్పుకుంటారు.

కథలోకి వెళ్తే…

Advertisement

గౌరవప్రదమైన కల్నల్, యుద్ధ వీరుడు కిమ్ జిన్-ప్యాంగ్ (సాంగ్ స్యుంగ్-హీన్). తన పై అధికారి కూతురితో అతనికి పెళ్లి జరుగుతుంది. ఆ తరువాత అనతి కాలంలోనే తన కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు కల్నల్. ఈ క్రమంలోనే ఓ వైపు సక్సెస్ ఫుల్ లైఫ్, మరోవైపు యుద్ధం వల్ల కలిగిన మానసిక ఒత్తిడి (PTSD) వల్ల కలిగే మానసిక వేదనతో సతమతం అవుతుంటాడు. అదే సమయంలో అతని కింది స్థాయి అధికారి భార్య జోంగ్ గా-హ్వెన్ (లిమ్ జి-యోన్) అతని లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె అందం, మౌనం జిన్-ప్యాంగ్‌ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

వీరిద్దరి మధ్య మొదట చిన్నగా మొదలైన పరిచయం కాస్తా నెమ్మదిగా గాఢమైన ప్రేమగా టర్న్ తీసుకుంటుంది. బయట ప్రపంచానికి క్రమశిక్షణ గల సైనికాధికారిగా కన్పిస్తాడు. కానీ లోపల ఆమె కోసం తపించే ఒక ప్రేమికుడిగా మారిపోతాడు జిన్-ప్యాంగ్. ఆర్మీ క్వార్టర్స్‌ లోనే ఎవరికీ తెలియకుండా ఇద్దరూ కలుసుకుంటారు. దీంతో వారి మధ్య శారీరక, మానసిక సాన్నిహిత్యం మరింతగా పెరుగుతాయి.

Advertisement

జిన్-ప్యాంగ్ ఆమెపై ఉన్న ‘అబ్సెషన్’ వల్ల కెరీర్ డేంజర్ లో పడుతుంది. కెరీర్‌ తో పాటు కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒకానొక సమయంలో వారి సంబంధం బయటపడే ప్రమాదకర పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో గా-హ్వెన్ తన భర్తను వదిలి రాలేనని చెప్పేస్తుంది. దీంతో జిన్-ప్యాంగ్ ఆ మాటను తట్టుకోలేకపోతాడు. అందరి ముందు తన ప్రేమను ఒప్పుకోవడమే కాదు, తన చేజేతులా పరువును కూడా పోగొట్టుకుంటాడు. ఆ ప్రేమ దక్కని వేదనలో అతను తీసుకున్న నిర్ణయం ఆడియన్స్ మనసును కలిచివేస్తుంది. మరి ఇంతకీ కల్నల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి ? ఈ మూవీ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

Read Also : అమ్మాయి కోసం ఇదేం అరాచకం… ప్రదీప్ రంగనాథన్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×