E-Paper
Advertisement

డేటింగ్ యాప్ తో మొదలయ్యే తమిళ లవ్వు… తెలుగులో కూడా చూడచ్చు

డేటింగ్ యాప్ తో మొదలయ్యే తమిళ లవ్వు… తెలుగులో కూడా చూడచ్చు
Advertisement

Romantic Movie OTT : డేటింగ్ యాప్ నేపథ్యంలో ఒక తమిళ మూవీ గత నెల థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఈ రొమాంటిక్ మూవీ నెల లోపే ఓటీటీ ఆడియన్స్ ని కూడా పలకరించబోతోంది. రెండు రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ జంట ప్రయాణం ఎలా సాగిందనే అంశాల చుట్టూ ఈ మూవీ ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమాను యూత్ బాగా ఆకట్టుకుంది కూడా. దీని పేరు ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ తమిళ రొమాంటిక్ మూవీ పేరు ‘నీ ఫర్ ఎవర్’. అశోక్ కుమార్ కళైవాణి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2026 మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఏప్రిల్ 24న నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది. జెన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో సుదర్శన్ గోవింద్, అర్చనా రవి హీరోహీరోయిన్లుగా నటిించారు. థియేటర్లో ఈ మూవీకి మిక్స్ డ్ రెస్సాన్స్ దక్కింది. ఈ మూవీకి ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కాలం కుర్రాళ్ల డేటింగ్ గోల ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. హీరో అజయ్ (సుదర్శన్ గోవింద్) స్టార్టప్ యాప్ డెవలపర్. ఒక కొత్త డేటింగ్ యాప్ తయారు చేయాలనుకుంటాడు. హీరోయిన్ మాతి (అర్చనా రవి) ఏమో పెద్ద సినిమా డైరెక్టర్ అయిపోవాలని కలలు కనే పిల్ల. ఈ ఇద్దరికీ ప్రేమ మీద పెద్దగా నమ్మకం ఉండదు. కానీ తమ స్వార్థం కోసం ఒక ప్లాన్ వేస్తారు. అజయ్ తన యాప్ ఎలా పని చేస్తుందో టెస్ట్ చేయడానికి, మతి తన సినిమా కథ కోసం లవ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి.. ఇద్దరూ కలిసి ఒక ఫేక్ లవ్ డ్రామా ఆడటం మొదలుపెడతారు. అంటే బయట ప్రపంచానికి మేమిద్దరం లవర్స్ అని కలరింగ్ ఇస్తూ లోపల మాత్రం ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కానీ ఎంత యాక్టింగ్ చేసినా మనసు ఊరుకోదు కదా! కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా ఒకరినొకరు ఇష్టపడటం మొదలవుతుంది. ఈ క్రమంలో ఒకరి నిజం మరొకరికి తెలిసినప్పుడు అసలు పంచాయితీ మొదలవుతుంది. చివరికి ఈ డేటింగ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ? ఆ గొడవలన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఒక్కటయ్యారు? అనే విషయాన్ని ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పక్క పక్క గదుల్లో ఉంటూ మనసు ఇచ్చి పుచ్చుకునే జంట… కొత్త లోకంలోకి తీసుకెళ్లే మధురమైన ప్రేమ కథ

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×